MP Crime : చెట్టుకు వేలాడుతున్న ముగ్గురు అక్కచెల్లెళ్ల మృతదేహాలు..హత్యలా? ఆత్మహత్యలా..?!

ఓ చెట్టుకు వేలాడుతున్న ముగ్గురు అక్కచెల్లెళ్లు మృతదేహాలు సంచలనం కలిగించాయి. వారివి హత్యలా? ఆత్మహత్యలా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

MP Crime : చెట్టుకు వేలాడుతున్న ముగ్గురు అక్కచెల్లెళ్ల మృతదేహాలు..హత్యలా? ఆత్మహత్యలా..?!

3 sisters Hanging  from tree : మధ్యప్రదేశ్ రాష్ట్రంలో అత్యంత ఘోరం చోటు చేసుకుంది. ఖ్వాండా జిల్లాలో పరిధిలోని జావర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కొట్‌ఖేడి గ్రామంలో ముగ్గురు అక్కచెల్లెళ్లు ఓ చెట్టుకు ఉరి వేసుకున్నారు. ముగ్గురు అమ్మాయిలు చెట్టుకు ఉరి వేసుకున్నారని స్థానికులు ఇచ్చిన సమాచారంతో హుటాహుటిన పోలీసులు ఘటనాస్థలానికి చేరుకున్నారు. యువతుల మృతదేహాలను పోస్ట్ మార్టమ్ కోసం పంపించారు. కేసు నమోదు చేసి, దర్యాప్తు ఆరంభించారు.

దర్యాప్తులో భాగంగా ముగ్గురు స్వయానా అక్కాచెల్లెళ్లు సోనూ, సావిత్రి, లలితలుగా పోలీసులు గుర్తించారు. వారు ఎందుకు ఆత్మహత్య చేసుకున్నారు? కారణాలు ఏమిటి? అనే కోణంలో దర్యాప్తు చేపట్టారు. ఘటనా స్థలంలో ఎటువంటి లేఖ లభించలేదు. దీంతో యువతులు ఆత్మహత్య చేసుకున్నారా? లేక దీని వెనుక ఎవరి హస్తం అయినా ఉందా? అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి.

Also read : Girl Dead Bodies on Tree: భారత్-నేపాల్‌ సరిహద్దుల్లో..చెట్టుకు వేలాడుతూ బాలిక మృతదేహాలు..!!

మృతి చెందిన అక్కా చెల్లెళ్లకు తల్లి, మరో ఇద్దరు సోదరీమణులు, ముగ్గురు సోదరులు కూడా ఉన్నారు. వీరి తల్లి ఒక సోదరుడితో కలసి వీరు గ్రామంలో నివాసం ఉండేవారు. మధ్యప్రదేశ్ రాష్ట్రంలో చెట్లకు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకునే ఘటనలు తరచుగా వెలుగు చూస్తుంటాయి.