Ameenpur : అమీన్‌‌పూర్‌‌లో కుటుంబం సూసైడ్ మిస్టరీ.. ఆత్మహత్యా ? హత్య ?

టీసీఎస్‌లో పనిచేసే శ్రీకాంత్.. ఒక గదిలో ఫ్యాన్‌కు ఉరి వేసుకుని కనిపిస్తే.. మరో గదిలో అతని భార్య, కూతురు ప్రాణాలు లేకుండా కనిపించారు. వారి నుదుటన...

Ameenpur : అమీన్‌‌పూర్‌‌లో కుటుంబం సూసైడ్ మిస్టరీ.. ఆత్మహత్యా ? హత్య ?

Sangareddy

Ameenpur Srikanth Goud : సంగారెడ్డి జిల్లా అమీన్‌పూర్‌లో సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి శ్రీకాంత్‌ గౌడ్‌ కుటుంబం సూసైడ్‌ మిస్టరీగా మారింది. అసలు వారిది ఆత్మహత్యా? హత్య? అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. చనిపోవడానికి ముందు పూజలు జరిగాయా అనే కోణంలోనూ విచారణ జరుపుతున్నారు. శ్రీకాంత్‌గౌడ్ మృతిపై స్థానికుల నుంచి పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు.

Read More : T20 World Cup : టీ20 ప్రపంచకప్ 2022 ఫుల్ షెడ్యూల్ ఇదే.. టీమిండియా మ్యాచ్.. ఎప్పుడు.. ఎక్కడంటే?

టీసీఎస్‌లో పనిచేసే శ్రీకాంత్.. ఒక గదిలో ఫ్యాన్‌కు ఉరి వేసుకుని కనిపిస్తే.. మరో గదిలో అతని భార్య, కూతురు ప్రాణాలు లేకుండా కనిపించారు. వారి నుదుటన పెద్ద పెద్ద ఎర్రటి బొట్లు ఉన్నాయి. అలాగే దేవుడి గదిలో చిత్ర పటాలు బోర్లించి ఉన్నాయి.. వీటన్నింటికి లింక్‌ ఏంటన్నది పోలీసులకు అంతుబట్టడం లేదు. ముందుగా శ్రీకాంత్‌ తన భార్యాబిడ్డకు విషం ఇచ్చి.. తాను ఆత్మహత్యకు పాల్పడ్డాడా.. లేక.. వారిని ఎవరైనా హత్య చేశారా? అన్న కోణంలోనూ పోలీసులు దృష్టిపెట్టారు.

Read More : Tiruchanur Temple: 50 ఏళ్ల తరువాత తిరుచానూరులో “నవకుండాత్మక శ్రీ‌యాగం”

పదేళ్ల క్రితం ప్రేమించి పెళ్లి చేసుకున్నారు శ్రీకాంత్‌గౌడ్‌, అనామిక. వారి ప్రేమకు గుర్తుగా ఏడేళ్ల చిన్నారి శ్రీస్నిగ్ధ. శ్రీకాంత్‌ TCSలో సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగం చేస్తుండగా.. అనామిక స్థానికంగా ఉన్న ఓ కార్పొరేట్‌ స్కూల్‌లో టీచర్‌గా పనిచేస్తోంది. ఇప్పటివరకూ అంతా బాగానే ఉంది. తమ సొంతింటి కలను కూడా ఈ మధ్యనే సాకారం చేసుకున్నారు శ్రీకాంత్‌ దంపతులు. అన్నీ బాగున్నాయి‌.. అంతా సెట్‌ అయింది అనుకున్న టైమ్‌లో.. జరగకూడనిది జరిగిపోయింది. ఏం బాధవచ్చిందో తెలీదు కానీ.. ఆ కుటుంబమంతా విగతజీవులుగా మారిపోయారు.

Read More : AP Cabinet : ఉద్యోగుల పీఆర్సీ జీవోలకు ఆమోదం..రిటైర్‌‌మెంట్ 62 ఏళ్లకు పెంపు

రెండ్రోజులుగా శ్రీకాంత్‌, అతని భార్యాపిల్లలు కనిపించడంలేదంటూ పోలీసులకు ఫిర్యాదు చేశారు కుటుంబ సభ్యులు. అన్నిచోట్లా గాలించిన పోలీసులు.. శ్రీకాంత్‌ ఇంటికి వెళ్లి తలుపులు తెరిచారు. ఏడేళ్ల చిన్నారితో పాటు తల్లి కూడా నురగలు కక్కుతూ విగతజీవులుగా కనిపించారు. ఇక తండ్రి ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఇప్పటికైతే ఈ కేసు మిస్టరీగానే మిగిలింది.