AP Cabinet : ఉద్యోగుల పీఆర్సీ జీవోలకు ఆమోదం..రిటైర్‌‌మెంట్ 62 ఏళ్లకు పెంపు

పీఆర్‌సీ పోరాటాన్ని ముందుకు ఎలా తీసుకెళ్లాలన్న దానిపై విజయవాడలో ఉద్యోగ సంఘాల నేతలు భేటీ అయ్యారు. భవిష్యత్‌ ఉద్యమ కార్యాచరణపై చర్చిస్తున్నారు.

AP Cabinet : ఉద్యోగుల పీఆర్సీ జీవోలకు ఆమోదం..రిటైర్‌‌మెంట్ 62 ఏళ్లకు పెంపు

Ap Cabinet

AP Employees PRC : పీఆర్సీని వ్యతిరేకిస్తూ ఉద్యోగ సంఘాలు సమ్మెకు సిద్ధమవుతుంటే….మరోవైపు ఏపీ కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. ఉద్యోగుల పీఆర్సీ జీవోలకు రాష్ట్రమంత్రి వర్గం ఆమోదముద్ర వేసింది. కొత్త పీఆర్సీ ప్రకారమే ముందుకెళ్లాలని కేబినెట్ నిర్ణయించింది. పదవీ విరమణ వయసును 62 ఏళ్లకు పెంచుతూ తీసుకున్న నిర్ణయాన్ని కేబినెట్ ఆమోదించింది.

Read More : Shanmukh Jaswanth : షణ్ముఖ్ జస్వంత్ నుంచి మరో సిరీస్.. బిగ్‌బాస్ నుంచి వచ్చాక ఫస్ట్ ప్రాజెక్టు

2022, జనవరి 21వ తేదీ గురువారం ఉదయం కేబినెట్ సమావేశమైంది. ఈ సమావేశంలో కీలక అంశాలపై చర్చించారు. ప్రధానంగా పీఆర్సీ వ్యవహారంపై ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందని ఉత్కంఠ నెలకొంది. ఉద్యోగుల డిమాండ్లకు ప్రభుత్వం తలొగ్గుతుందని అందరూ ఊహించారు. కానీ..ముందుగా ఇచ్చిన జీవోల ప్రకారమే…వెళ్లాలని కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. కేబినెట్ తీసుకున్న నిర్ణయాన్ని ప్రభుత్వ ఉద్యోగుల సంఘాల నేతలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు.

Read More : Ganjayi Smuggling: రూ.1.80 కోట్ల విలువచేసే 800 కిలోల గంజాయి స్వాధీనం

మరోవైపు…పీఆర్‌సీ పోరాటాన్ని ముందుకు ఎలా తీసుకెళ్లాలన్న దానిపై విజయవాడలో ఉద్యోగ సంఘాల నేతలు భేటీ అయ్యారు. భవిష్యత్‌ ఉద్యమ కార్యాచరణపై చర్చిస్తున్నారు. ఈ సమావేశానికి బొప్పరాజు వెంకటేశ్వర్లు, బండి శ్రీనివాసరావు, వెంకట్రామిరెడ్డి, సూర్య నారాయణరావు హాజరయ్యారు. సమావేశానంతరం మధ్యాహ్నం సీఎస్‌కు సమ్మె నోటీస్‌ ఇచ్చే అవకాశముంది.