Bihar : అసలే గుండు ఇంకేం గీస్తార్రా బాబూ.. షాక్ మామూలుగా లేదుగా.. అసలు ట్విస్ట్ వేరే ఉంది!
పీటల మీద కూర్చున్న వరుడ్ని రౌండప్ చేశారు. గుండు గీసి వీడియో తీసి పరువు తీయటానికి రెడీగా ఉన్నారు. బార్బర్ వస్తాడు..గుండు గీస్తాడు..అంటుండగానే అసలు విషయం తెలిసి షాక్ అయ్యారు..

man second marriage Cheating
groom shockingly reveals bald head : అదొక పెళ్లి మండపం. కాసేపట్లో పెళ్లి జరుగబోతోంది. పెళ్లి పీటల మీద కూర్చున్న వరుడ్ని చుట్టు రౌండప్ చేసి కూర్చున్నారు వధువు తరపు బంధువులు. ఇదేదో వరుడ్ని ఆటపట్టించటానికి కాదు. గుండు గీయించేయటానికి ప్లాన్ వేశారు. దాని కోసం బార్బర్ కు కబురు పంపారు. కాసేపట్లో బార్బర్ వస్తాడు. గుండు గీస్తాడు.. అదంతా వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టడానికి అందరు సెల్ ఫోన్లతో రెడీగా ఉన్నారు. దీంతో సదరు వరుడు కొన్ని మాటలు గున గున అంటూ మాట్లాడాడు. అప్పటికే మండిపోయి ఉన్న అక్కడున్నవారంతా నోరు మూస్కుని కూర్చో లేదంటే బార్బర్ చేతిలో కత్తి ఏ పార్టుని కట్ చేస్తుందో తెలియదు అంటూ వార్నింగ్ ఇచ్చేసరికి ఆ వరుడు నోరు మూస్కుని కూర్చున్నాడు.
కానీ ఆ వరుడు నెమ్మదిగా అన్నమాటలు వింటే వారికి అర్థమయ్యేది.. ‘అసలే గుండు ఇంకేం గీస్తార్రా నన్ను వదిలేయండీ’ అంటూ వేడుకున్నాడు. కానీ అతని మాటలు వినేలా లేరు అక్కడున్నవారంతా. అతనేదో అంటున్నాడని ‘ఏయ్.. ఎక్కువ మాట్లాడకు.. నీకు గుండు గీయించే కార్యక్రమం పూర్తి అయ్యాకే వదులుతాం అప్పటి వరకు కుదురుగా కూర్చో లేదంటే బార్బర్ కత్తి దేన్ని కోస్తుందో తెలియదు’ అని వార్నింగ్ ఇచ్చేసరికి సదరు వ్యక్తి నోరు మూసుకుని కూర్చున్నాడు.
Uttar Pradesh : జైలుకెళ్లాలనే భయంతో పోలీస్‌స్టేషన్‌లో బల్లిని మింగేసిన అత్యాచార కేసు నిందితుడు
ఇంతకీ వరుడికి వధువు బంధువులు ఎందుకు గుండు గీయించాలనుకున్నారంటే..బీహార్‌లోని గయాలో మరి కాసేపట్లో వధువు మెడలో తాళి కడతాడు అనగా అతనికి ఇంతకు ముందే పెళ్లి అయ్యిందని.దీంతో వధువు కుటుంబ సభ్యులు, బంధువులు మండిపడ్డారు. ఇంత మోసం చేస్తావా? అంటూ ఆగ్రహంతో ఊగిపోయారు. పెళ్లి పీటల మీద నిజం తెలిసింది కాబట్టి మా బిడ్డ బతుకు నాశనం కాలేదు.. నీకు తగినశాస్తి చేస్తాం అంటూ అందరు మూకుమ్మడిగా చితకబాదారు. అంతటితో వారి కోపం తగ్గలేదు. గుండు గీయించి అది వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టి అతని పరువు మొత్తం తీసేద్దామని ప్లాన్ వేశారు.
కొత్వాలి పోలీస్ స్టేషన్ పరిధిలోని ఇక్బాల్‌నగర్ ప్రాంతంలో నివసిస్తున్న వ్యక్తి… మొదటి భార్య ఉండగానే రెండో పెళ్లికి రెడీ అయ్యాడు. మొదటి పెళ్లి విషయం దాచిపెట్టి ధోబీ పీఎస్ పరిధిలోని ఓ గ్రామానికి చెందిన యువతితో వివాహం నిశ్చయం చేసుకుని పెళ్లి ముహూర్తం కూడా పెట్టుకున్నాడు. మాయామాటలు చెప్పి.. ఎలాగోలా పెళ్లి పీటల వరకూ తీసుకొచ్చాడు. కానీ వాడి టైమ్ బాగాలేనట్లుంది. లాస్ట్ మినిట్ లో అతనికి ఇంతకుముందే పెళ్లైందన్న విషయం తెలిసి.. యువతి కుటుంబ సభ్యులు రెచ్చిపోయారు. ఆగ్రహంతో అతనిపై దాడి చేశారు. పిచ్చికొట్టుడు కొట్టారు. తప్పైందని పెళ్లికొడుకు చేతులు జోడించి వేడుకున్నాడు కానీ వారు వదల్లేదు.
ఊరిలోని బార్బర్ ను పిలిచి గుండుగీయమని పురమాయించారు. అందుకు వద్దు వద్దు అంటూ జుట్టును అదిమి పట్టుకుంటున్న ఆ పెళ్లి కొడుకుని చూసి పరువు కోసం అలా వద్దంటున్నాడేమో అని అనుకున్నారు. కానీ ఆ జనంలో ఒకరు ధైర్యం చూసి ఆ జుట్టును లాగా.. అతని చేతికి పెళ్లి కొడుకు విగ్గు ఊడి వచ్చింది. అప్పటికే వరుడికి మొదటి పెళ్లే కాదు.. బట్టతల కూడా ఉందన్న రహస్యం బట్టబయలైంది. ఇక కోపంగా ఉన్న యువతి బంధువులు మరింతగా రెచ్చిపోయారు మళ్లీ మళ్లీ చితక్కొట్టారు. ఉతికి ఉతికి ఆరేశారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.