Uttar Pradesh : జైలుకెళ్లాలనే భయంతో పోలీస్‌స్టేషన్‌లో బల్లిని మింగేసిన అత్యాచార కేసు నిందితుడు

జైలు కెళ్లాలనే భయంతో నిందితుడు బల్లిని మింగేసిన ఘటన పోలీస్ స్టేషన్ లో చోటుచేసుకుంది. దీంతో పోలీసులు అతనిని ఏం చేశారంటే..

Uttar Pradesh : జైలుకెళ్లాలనే భయంతో పోలీస్‌స్టేషన్‌లో బల్లిని మింగేసిన అత్యాచార కేసు నిందితుడు

accused lizard swallows

Updated On : July 11, 2023 / 10:47 AM IST

Up rape case accused lizard swallows : అతనో అత్యాచారం కేసులో నిందితుడు. పోలీసులు అరెస్ట్ చేశారు. కోర్టులో విచారణ పూర్తి అయ్యింది. కేసు విచారణలో భాగంగా కష్టడీ కోసం జైలుకు తరలించేందుకు పోలీసులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఇదంతా తెలిసిన సదరు నిందుతుడికి భయం వేసింది. తనను ఎక్కడ జైలుకు తరలిస్తారో అనే భయంతో దాన్ని తప్పించుకోవటానికి ఏం చేయాలా..? అని ఆలోచిస్తున్నాడు. తప్పించుకుని పారిపోయినా పోలీసులు ఎలాగూ మళ్లీ తనను పట్టుకుంటారు. మరి ఏం చేయాలి..? అని ఆలోచించారు. అంతలో పోలీసు స్టేషన్ లో గోడమీద పాకుతున్న బల్లి కనిపించింది. అంతే ఆ బల్లిని తీసుకుని గుటుక్కున మింగేశాడు.

ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌లో చోటు చేసుకున్న ఈ ఘటనతో పోలీసులు కంగారుపడిపోయారు. వెంటనే నిందితుడిని భితార్ గావ్ హెల్త్ సెంటర్ కు హాస్పిటల్ కు తరలించారు. అక్కడ ప్రథమ చికిత్స చేసిన తరువాత అక్కడి నుంచి లాలా లజపతిరాయ్ ఆస్పత్రికి తరలించారు. వైద్యం చేసిన తరువాత ప్రస్తుతం నిందితుడు ఆరోగ్య పరిస్థితి బాగానే ఉంది. జైలునుంచి తప్పించుకోవటానికి బల్లిని మింగేసినా అతను జైలుకు వెళ్లటం తప్పదు. అతను ఆరోగ్య పూర్తిగా మెరుగు పడ్డాక జైలుకు తరలించే యోచనలో ఉన్నారు పోలీసులు.

Woman Killed : బీహార్ లో మహిళ దారుణ హత్య… కనుగుడ్లు పెకిలించి, నాలుక కోసి, ప్రైవేట్ భాగాలు ఛిద్రం

కాగా సదరు నిందితుడు సాద్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కిషన్ పూర్ గ్రామానికి చెందినవాడు అతని పేరు మహేశ్ కుమార్. 24 ఏళ్ల అతను జూన్ 14న 18 ఏళ్ల బాలికను అపహరించి అత్చాచారం చేశాడు అనే ఆరోపణలతో పోలీసులు అరెస్ట్ చేశారు.

ఓ వ్యక్తి తన కూతురిని బంధువల ఇంటిలో వదిలి పనిమీద వెళ్లగా మహేశ్ ఆ బాలికకు మాయ మాటలు చెప్పి ఇంట్లోంచి తీసుకెళ్లిపోయారు. బాలిక కనిపించకపోవటంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు బాలిక కోసం వెదకగా బెంగళూరులో గుర్తించారు. బాలికను ప్రశ్నించగా తనపై అత్యాచారం చేశాడని చెప్పింది. దీంతో మహేశ్ ను అరెస్ట్ చేసి కోర్టులో ప్రవేశ పెట్టారు. అనంతరం జైలుకు తరలించనున్నారు. ఇంతలోనే మహేశ్ జైలుకెళ్లాల్సి వస్తుందనే భయంతో బల్లిని మింగేయటం ఆస్పత్రికి తరలించటం జరిగింది.