BAN vs PAK : మేం చేసిన బిగ్ మిస్టేక్ అదే.. అందుకనే బంగ్లాదేశ్ చేతిలో ఓడిపోయాం.. లేదంటేనా.. పాక్ కెప్టెన్ షాహీన్ అఫ్రిది కామెంట్స్..
బ్యాటింగ్ వైఫల్యం కారణంగానే తాము బంగ్లాదేశ్‌తో తొలి వన్డే మ్యాచ్‌లో ఓడిపోయినట్లు (BAN vs PAK ) పాకిస్థాన్ వన్డే కెప్టెన్ షాహీన్ అఫ్రిది తెలిపాడు
BAN vs PAK Shaheen Afridi comments after Pakistan lost 1st ODI against Bangladesh
- తొలి వన్డేలో బంగ్లాదేశ్ చేతిలో ఓటమి
- స్పందించిన పాక్ కెప్టెన్ షాహీన్ అఫ్రిది
- ఇంకో రెండు మ్యాచ్‌లు ఉన్నాయ్
BAN vs PAK : బ్యాటింగ్ వైఫల్యం కారణంగానే తాము బంగ్లాదేశ్‌తో తొలి వన్డే మ్యాచ్‌లో ఓడిపోయినట్లు పాకిస్థాన్ వన్డే కెప్టెన్ షాహీన్ అఫ్రిది తెలిపాడు. ప్రస్తుతం తమది యువ జట్టు అని అన్నాడు. వన్డేల్లో భాగస్వామ్యాలు నమోదు చేయడం చాలా ముఖ్యం అని చెప్పుకొచ్చాడు. మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లో భాగంగా బుధవారం ఢాకా వేదికగా జరిగిన తొలి వన్డే మ్యాచ్‌లో పాకిస్థాన్ 8 వికెట్ల తేడాతో ఓటమి చవిచూసింది.
ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన పాకిస్థాన్ 30.4 ఓవర్లలో 114 పరుగులకే ఆలౌటైంది. పాక్ బ్యాటర్లలో ఫహీం అష్రఫ్ (37), సాహిబ్జాదా ఫర్హాన్ (27) లు రాణించారు. మాజ్ సదఖత్ (18), మహ్మద్ రిజ్వాన్ (10) లు మాత్రమే రెండు అంకెల స్కోరు చేయగా మిగిలిన వారంతా సింగిల్ డిజిట్‌కే పరిమితం అయ్యారు. బంగ్లా బౌలర్లలో నహిద్ రాణా ఐదు వికెట్లు పడగొట్టాడు. మెహిది హసన్ మీరాజ్ మూడు వికెట్లు, తస్కిన్ అహ్మద్, ముస్తాఫిజుర్ రెహమాన్ చెరో వికెట్ పడగొట్టారు.
IPL 2026 : ఐపీఎల్ 2026 తొలి దశ షెడ్యూల్ వచ్చేసింది.. ఆర్సీబీ, సన్రైజర్స్ల మధ్య తొలి మ్యాచ్
అనంతరం తంజిద్ హసన్ తమీమ్ (67 నాటౌట్; 42 బంతుల్లో 7 ఫోర్లు, 5 సిక్సర్లు) హాప్ సెంచరీతో చెలరేగడంతో బంగ్లాదేశ్ 115 పరుగుల లక్ష్యాన్ని 15.1 ఓవర్లలో రెండు వికెట్లు కోల్పోయి ఛేదించింది. పాక్ బౌలర్లలో షాహీన్ అఫ్రిది, మహ్మద్ వసీం జూనియర్ లు చెరో వికెట్ పడగొట్టారు.
ఇక మ్యాచ్ అనంతరం ఓటమిపై పాకిస్థాన్ కెప్టెన్ షాహీన్ అఫ్రిది స్పందించాడు. మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లో తొలి మ్యాచ్‌లో గెలిచి సిరీస్‌లో ఘనంగా బోణీ కొట్టాలని భావించామని అయితే అలా జరగలేదన్నాడు. బ్యాటర్ల వైఫల్యం తమ కొంపముంచిదని చెప్పుకొచ్చాడు. బంగ్లా బౌలర్ నహిద్ రాణా చాలా అద్భుతంగా బౌలింగ్ వేశాడని మెచ్చుకున్నాడు. ఓటమికి ఎన్నో కారణాలు ఉన్నాయన్నాడు.
అయితే.. ప్రస్తుత జట్టు యువ జట్టు అని, నేర్చుకునే స్థితిలోనే ఉందన్నాడు. ఓ కెప్టెన్‌గా తన జట్టుకు ఎప్పుడు మద్దతు ఇస్తానని అన్నాడు. వన్డే మ్యాచ్‌లో భారీ స్కోర్లు చేయాలంటే భాగస్వామ్యాలను నిర్మించడం చాలా ముఖ్యం అని తెలిపాడు. ఈ ఓటమి నుంచి పాఠాలు నేర్చుకుని మిగిలిన మ్యాచ్‌ల్లో మెరుగైన ప్రదర్శన చేసి సిరీస్‌ను సొంతం చేసుకుంటామనే ధీమాను వ్యక్తం చేశాడు.
