Ysr Death Row: సడెన్‌గా.. పెద్దాయన డెత్ స్టోరీని ఎందుకు తెరమీదకు తెచ్చినట్లు? టీడీపీ స్కెచ్ ఏంటి?
ఈ ఓవరాల్ ఎపిసోడ్లో వైసీపీ..ఎస్పెషల్‌గా జగన్ అందరికీ టార్గెట్ అయిపోయినట్లు కనిపిస్తోంది. అటు టీడీపీ నుంచి మంత్రులు విమర్శల దాడి చేస్తుంటే..తోబుట్టువు షర్మిల స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చేశారు.
- మొన్నటి వరకు మావిగన్..ఇప్పుడు వైఎస్సార్..
- టీడీపీ వర్సెస్ వైసీపీ పొలిటికల్ ఫైట్‌లో ఇంకో ట్విస్ట్
- పెద్దాయన డెత్ స్టోరీని తెరమీదకు తెచ్చిన టీడీపీ
- బొత్స కన్నీళ్ల చుట్టూ రాజకీయ మంటలు
- వైసీపీ టార్గెట్‌గా టీడీపీ, కాంగ్రెస్ అటాక్
Ysr Death Row: ఏపీ పొలిటికల్ ఫైటే డిఫరెంట్. ఎప్పుడూ ఏదో ఒక రచ్చ కామన్. ఎక్కడ ఎప్పుడు ఏ ఇష్యూ స్టార్ట్ అవుతుంది..ఎందుకు రచ్చ అవుతుందో ఎక్స్పెక్ట్ చేయలేం. అలాంటి ఓ ఫేజే..ఇప్పుడు పాలిటిక్స్‌లో హీట్‌ను పెంచుతోంది. వైసీపీ వర్సెస్ టీడీపీ..జగన్ టార్గెట్‌గా కాంగ్రెస్, దుమ్మెత్తిపోస్తున్న మాజీ కాంగ్రెస్..ఏపీ రాజకీయాల్లో సరికొత్త చర్చకు దారితీస్తోంది. పొలిటికల్ గేమ్‌లో..ఎందుకీ కాంట్రవర్సీ రచ్చ? పెద్దాయన డెత్ స్టోరీని టీడీపీ ఎందుకు తెరమీదకు తెచ్చినట్లు? ఈ ఇష్యూ ఎటు టర్న్ తీసుకోబోతోంది?
ఏపీలో కూటమి వర్సెస్ వైసీపీగా నడుస్తున్న రాజకీయ సమరంలో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. దివంగత వైఎస్సార్ పాదయాత్రకు 23 ఏళ్లు పూర్తయిన సందర్భంగా వైసీపీ సంబరాలు చేసుకుంటున్న తరుణంలో టీడీపీ మంత్రి అచ్చెన్నాయుడు వైఎస్సార్ మరణంపై చేసిన వ్యాఖ్యలు తీవ్ర కలకలం రేపాయి. వైఎస్ఆర్ మరణం విషయంలో జగన్‌పై గతంలో వ్యక్తమైన అనుమానాలు నేడు నిజమని నమ్మే పరిస్థితులు వచ్చాయని అచ్చెన్న కామెంట్స్ చేశారు. జగన్ నైజం చూస్తుంటే నాడు బొత్స సత్యనారాయణ చేసిన వ్యాఖ్యలు నిజమే అనిపిస్తోందన్నారు. వైఎస్ చనిపోయినప్పుడు, వివేకా చనిపోయినప్పుడు లాభం పొందిన వ్యక్తి జగన్ ఒక్కరే అన్నారు.
అచ్చెన్న వ్యాఖ్యలపై బొత్స రియాక్ట్ అవడం..కన్నీళ్లు పెట్టుకోవడంతో వైఎస్సార్ మరణంపై మళ్లీ రాజకీయ రచ్చ మొదలైంది. బొత్స కామెంట్స్‌పై అటు కాంగ్రెస్ నేతల నుంచి..ఇటు మాజీ కాంగ్రెస్ లీడర్ల స్పందనతో పొలిటికల్ ఫైట్ కొత్త టర్న్ తీసుకుంటోంది. బొత్స కన్నీళ్లు పెద్ద డ్రామా అని అచ్చెన్న..జగన్ నైజం చూసి బొత్సకు భయంతో కూడిన బాధ వచ్చిందని..అందుకే కన్నీళ్లు పెట్టుకున్నారని మంత్రి పయ్యావుల రివర్స్ అటాక్ చేశారు.
నిండు సభలో వైఎస్ ను, విజయమ్మను అవమానించారు..
బొత్స కన్నీళ్లు పెట్టుకోవడంపై ఏపీ పీసీసీ చీఫ్ షర్మిల కూడా రియాక్ట్ అయ్యారు. బొత్స ఎందుకు ఏడ్చారో తెలియదు కానీ..అసెంబ్లీలో వైఎస్ విజయమ్మను అవమానించినందుకు ఆయన కన్నీళ్లు పెట్టుకోవాల్సిందేనన్నారు. YS మరణంపై బాధపడిపోతున్న ఆయన..అదే వైఎస్‌ను, ఆయన భార్య విజయమ్మను నిండు సభలో అవమానించారని గుర్తుచేశారు. ఇటు జగన్‌ను టార్గెట్ చేశారు. గన్నులు, గొడ్డళ్లు, నరకడం, చంపడం తప్ప వైసీపీకి వేరే సిద్ధాంతమే లేదని ఫైర్ అయ్యారు. జగన్ పేరు కలిసొచ్చేలా రాజధానికి మావిగన్ అని పేరు పెట్టమంటున్నారు కదా.. మరి పులివెందులను ఎందుకు వదలడం అంటూ ఎద్దేవా చేశారు.
అమరావతికి జగన్ పేరు కలిపి ‘మావిగన్’ అంటున్నారు సరే..మరి పులివెందులకు అవినాష్ పేరు మీద ‘అవి-గొడ్డలి’ అని పెట్టాల్సింది కదా అని పంచ్ వేశారు. ఈ ఎపిసోడ్‌పై మాజీ కాంగ్రెస్ నేత, కన్నా లక్ష్మీనారాయణ రియాక్ట్ అవడం మరింత చర్చకు దారితీస్తోంది. సంతకాలు తాను సేకరించలేదని..వైఎస్సార్ మీదున్న అభిమానంతో సంతకం మాత్రం పెట్టానంటున్నారు. బొత్స ఎందుకు కన్నీళ్లు పెట్టుకున్నారో తనకు తెలియదంటున్నారు కన్నా లక్ష్మీనారాయణ. ఈ క్రమంలోనే ఆయన జగన్ టార్గెట్‌గా విమర్శల దాడి చేశారు. ఈ ఓవరాల్ ఎపిసోడ్లో వైసీపీ..ఎస్పెషల్‌గా జగన్ అందరికీ టార్గెట్ అయిపోయినట్లు కనిపిస్తోంది. అటు టీడీపీ నుంచి మంత్రులు విమర్శల దాడి చేస్తుంటే..తోబుట్టువు షర్మిల స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చేశారు. ఇక మాజీ కాంగ్రెస్ నేతలు కూడా జగన్‌ను కార్నర్ చేస్తుండటంలో పొలిటికల్ హాట్ టాపిక్‌గా మారింది.
జగన్ మావిగన్ ప్రతిపాదనకు పాజిటివ్ రెస్పాన్స్ వస్తుండటాన్ని తట్టుకోలేకే..టీడీపీ కొత్త కుట్రలకు తెరలేపిందని రివర్స్ అటాక్ చేస్తోంది వైసీపీ. క్యాపిటల్‌గా మావిగన్ అంటూ జరుగుతున్న చర్చ..పబ్లిక్ నుంచి సానుకూల స్పందన వస్తుండటంతోనే..ఇష్యూను సైడ్ ట్రాక్ పట్టించేందుకే అచ్చెన్న నోరు పారేసుకున్నారని ఫ్యాన్ పార్టీ నేతలు విమర్శల దాడి చేస్తున్నారు. టీడీపీ మంత్రులకు కలలో కూడా మావిగన్ గుర్తుకొస్తుందని..మావిగాన్ అంటే కూటమి నాయకులకు ఎందుకంత ఉలికిపాటు ప్రశ్నిస్తోంది.
రాజకీయ లబ్ది కోసమే వైఎస్సార్ మరణం ప్రస్తావన..
రాజకీయ లబ్ది కోసమే వైఎస్సార్ డెత్ స్టోరీని అనవసరంగా తెరమీదకు తెచ్చి..మధ్యలో తన పేరు ప్రస్తావించి అచ్చెన్న కామెంట్స్ చేశారనేది బొత్స వాదన. వైఎస్సార్ మరణం వెనక జగన్ ఉన్నాడని తాను అన్నట్లుగా అచ్చెన్న చెప్పడం రాజకీయ దిగజారుడుతనానికి నిదర్శనం అంటున్నారాయన. ఓవైపు అమరావతి Vs మావిగన్ అంటూ చర్చ జరుగుతుండగా..వరుస పెట్టి వైసీపీ నేతలు ప్రెస్మీట్లు పెట్టి రెచ్చిపోతుండటంతో..అచ్చెన్న బిగ్ ట్విస్ట్ ఇచ్చారన్న చర్చ అయితే జరుగుతోంది.
ఒక్కసారిగా మావిగన్ టాక్ సైడ్ అయిపోయి..వైఎస్సార్ డెత్ స్టోరీలో జగన్ టార్గెట్‌గా బాణాలు ఎక్కుపెట్టే సీన్‌కు తెరలేపారని అంటున్నారు. 17ఏళ్ల తర్వాత మరోసారి వైఎస్సార్ డెత్‌పై అచ్చెన్న డౌట్స్ వ్యక్తం చేయడం..తన అనుమానాలకు జగన్, బొత్సకు లింకు పెట్టడం..బిగ్ పొలిటికల్ స్కెచ్‌గా డిస్కషన్ నడుస్తోంది. లేటెస్ట్గా తెరమీదకు వచ్చిన ఈ ఎపిసోడ్‌పై ఎన్నాళ్లు రచ్చ కొనసాగనుందో వేచి చూడాలి.
Also Read: మావిగన్ మంత్రం.. రాజధానిపై వైసీపీ ప్లాన్ ఏంటి? ఆ విషయంలో జగన్ సక్సెస్ అయినట్లేనా?
