Anasuya: శివాజీ సృష్టించిన చీర.. అనసూయ సాలిడ్ కౌంటర్.. మళ్ళీ మొదలైన రచ్చ
మరోసారి నటుడు శివాజీపై చీర కామెంట్స్ చేసిన అనసూయ(Anasuya).
Anasuya Bharadwaj comments on Shivaji once again.
- అంతకుముందు మేము చీరలో కట్టుకోలేదు
- ఇది శివాజీ సృష్టించిన చీర
- అనసూయ చీరకట్టుపై సోషల్ మీడియాలో రచ్చ
Anasuya: మహిళల వస్త్రధారణపై నటుడు శివాజీ గతంలో చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో, నటి అనసూయ భరద్వాజ్ మరోసారి తనదైన శైలిలో కౌంటర్ ఇచ్చారు. ఇటీవల ఆమె తన కుటుంబంతో కలిసి చీరకట్టులో గుడికి వెళ్లిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. అయితే, కొందరు నెటిజన్లు దీనిని వక్రీకరిస్తూ “శివాజీ భయానికే అనసూయ చీర కట్టుకుంది” అంటూ పోస్టులు పెట్టడంతో ఆమె ఘాటుగా స్పందించారు.
Venu Udugula: ఆ వార్తలు వేదనకు గురిచేశాయి.. మంగ్లీ వివాదంలో వేణు ఉడుగుల ఎమోషనల్ పోస్ట్
తనపై వస్తున్న ఈ విమర్శలను అనసూయ(Anasuya) వ్యంగ్యంగా తిప్పికొట్టారు. “శివాజీ సృష్టించిన చీరను అనసూయ ధరించింది” అని థంబ్నైల్ పెట్టుకుంటే బాగుంటుందని ఎద్దేవా చేశారు. తాము గతంలో ఎప్పుడూ చీరలు కట్టుకోనట్లుగా కొందరు ప్రవర్తించడం హాస్యాస్పదంగా ఉందని, ఏదైనా ప్రచారం చేసే ముందు వాస్తవాలు తెలుసుకోవాలని హితవు పలికారు. సాధారణంగానే పండుగలు, గుడి సందర్శనల సమయంలో తాను సాంప్రదాయబద్ధంగానే కనిపిస్తానని ఆమె గుర్తు చేశారు.
అనసూయ చేసిన ఈ ట్వీట్ ప్రస్తుతం నెట్టింట విపరీతంగా వైరల్ అవుతోంది. గతంలో అనేక సందర్భాల్లో ఆమె చీరకట్టులో మెరిసిన ఫోటోలను అభిమానులు షేర్ చేస్తూ ఆమెకు మద్దతు తెలుపుతున్నారు. వస్త్రధారణ అనేది వ్యక్తిగత ఇష్టమని, దానిని మరొకరి వ్యాఖ్యలతో ముడిపెట్టడం సరికాదని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. ఈ వివాదం మరోసారి సోషల్ మీడియాలో అనసూయ వర్సెస్ శివాజీ అన్నట్లుగా చర్చకు దారితీసింది.
