Gadhouse Miko Portable : రెట్రో లవర్స్‌కు గుడ్ న్యూస్..! 80, 90ల నాటి క్యాసెట్ రికార్డర్ రీ-ఎంట్రీ..! ఈసారి మోడర్న్ ఫీచర్లతో!
Gadhouse Miko Portable : 80,90 ఏళ్ల పాత రోజులను గుర్తుకు తెచ్చే అద్భుతమైన క్యాసెట్ ప్లేయర్ రికార్డర్ మళ్లీ అందుబాటులోకి వచ్చింది. USB-C, బ్లూటూత్ సపోర్టుతో అందుబాటులో ఉంది. టేపులను ప్లే చేస్తుంది. రికార్డ్ కూడా చేస్తుంది. వైర్డ్, బ్లూటూత్ హెడ్ఫోన్లకు సపోర్టు ఇస్తుంది.
Gadhouse Miko Portable
- రికార్డులను ప్లే చేయగలదు.. రికార్డ్ కూడా చేస్తుంది
- AA బ్యాటరీలతో USB-Cకి సపోర్టు ఇస్తుంది
- మికో క్యాసెట్ ప్లేయర్ ఈజీ డిజైన్ అందిస్తుంది
Gadhouse Miko Portable : ఆ రోజులే బాగున్నాయి. ఇప్పుడు ఫోన్లలో పాటలు వింటున్నాం.. అప్పుడు రేడియోలు, క్యాసెట్లలో విన్నాం.. 80, 90లో ప్రతి ఇంట్లోనూ క్యాసెట్ రికార్డర్లు ఉండేవి.. అయితే, ఆనాటి పాత రోజులను మళ్లీ తిరిగి తీసుకొచ్చింది ఓ కంపెనీ. మీరు క్యాసెట్ ప్లేయర్లు, రికార్డర్లను మర్చిపోకపోతే ఈ కంపెనీ ఆ జ్ఞాపకాలను తిరిగి అందిస్తోంది. గాడ్హౌస్ డిజిటల్ యుగం కోసం రెట్రో-స్టయిల్ క్యాసెట్ రికార్డర్‌ను లాంచ్ చేసింది.
మికో పేరుతో ఈ గాడ్జెట్ అచ్చం పాత క్యాసెట్ రికార్డర్ మాదిరిగా కనిపిస్తోంది. టేపులను ప్లే చేస్తుంది. అలాగే రికార్డ్ చేస్తుంది. వైర్డ్, బ్లూటూత్ హెడ్ఫోన్లకు సపోర్ట్ చేస్తుంది. ఈ డివైజ్ ధర, అన్ని ఫీచర్లపై ఓసారి లుక్కేయండి.
గాడ్హౌస్ మికో ధర ఎంతంటే? :
గాడ్హౌస్ మికో ధర 99 డాలర్లు (దాదాపు రూ. 9వేలు). గాడ్హౌస్ మికోను కంపెనీ అధికారిక వెబ్సైట్ నుంచి కొనుగోలు చేయవచ్చు. స్మోక్ (GAD6701), మింట్ (GAD6702) అనే రెండు మోడళ్లలో లభిస్తోంది.
గాడ్హౌస్ మికో ఫీచర్లు :
గాడ్హౌస్ మైకో అనేది ఒక రెట్రో-స్టయిల్ పోర్టబుల్ క్యాసెట్ రికార్డర్. 80, 90 ఏళ్ల నాటి క్యాసెట్ ప్లేయర్లను యూజర్లకు మళ్లీ అందుబాటులోకి తెచ్చింది. రికార్డులను ప్లే చేయగలదు. రికార్డ్ చేయగలదు. కంట్రోలింగ్ కోసం ఈజీ బటన్లు ఉన్నాయి. ఏఏ బ్యాటరీలతో రన్ అవుతుంది. USB-Cకి సపోర్టు ఇస్తుంది. మీరు సోనీ వాక్‌మ్యాన్ TPS-L2ని చూసి ఉంటే.. ఆనాటి రోజులను కచ్చితంగా గుర్తు చేసేలా ఉంటుంది.
మికో క్యాసెట్ ప్లేయర్ ఈజీ డిజైన్‌తో వస్తుంది. ఆపరేట్ చేసేందుకు మెకానికల్ బటన్లు ఉంటాయి. ఆడియో అవుట్‌పుట్ 3.5mm వైర్డ్ లేదా బ్లూటూత్ హెడ్‌ఫోన్ జాక్ ద్వారా ఉంటుంది. సాధారణ క్యాసెట్లను కూడా రికార్డ్ చేయగలదు. రికార్డింగ్ కోసం ఆరెంజ్ కలర్ బటన్ కూడా ఉంది.
ఇందులో ఇంటర్నల్‌గా ఉన్న మైక్రోఫోన్ ద్వారా ఆడియో అందుతుంది. ఎక్స్ ట్రనల్ ఆడియో సోర్స్‌ను కూడా కనెక్ట్ చేయవచ్చు. AA బ్యాటరీలతో రన్ అవుతుంది. కానీ, USB-C ద్వారా కూడా పవర్ ఇవ్వవచ్చు. బాడీ ప్లాస్టిక్‌తో వస్తుంది. కానీ, ట్రిమ్ అల్యూమినియంతో తయారైంది. ఈ డివైజ్ బరువు 192 గ్రాములు ఉంటుంది.
