Allu Arjun- Prashanth neel: ప్రశాంత్ నీల్ లిస్ట్ నుంచి అల్లు అర్జున్ అవుట్.. అసలు ఏమైంది అంటే?
అల్లు అర్జున్ తో ప్రశాంత్ నీల్(Allu Arjun- Prashanth neel) చేయబోయే సినిమా ఆల్మోస్ట్ క్యాన్సిల్ అయ్యింది.
allu arjun and prashanth neel movie cancelled
- మరో రెండేళ్లు అల్లు అర్జున్ డైరీ ఫుల్
- ప్రశాంత్ నీల్ తో సినిమా క్యాన్సిల్
- వేరే స్టార్ తో సినిమా ప్లాన్ చేస్తున్న కన్నడ దర్శకుడు
Allu Arjun- Prashanth neel: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తన రాబోయే చిత్రాల విషయంలో పక్కాగా ప్లాన్ చేసుకుంటున్నారు. ప్రస్తుతం ఆయన అట్లీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘రాకా’ చిత్రంపై పూర్తి దృష్టి సారించారు. ఇటీవల విడుదలైన ఈ సినిమా ఫస్ట్ లుక్ సినిమాపై భారీ అంచనాలను పెంచేసింది. దీని తర్వాత లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో తన 23వ చిత్రాన్ని ప్రారంభించేందుకు బన్నీ సిద్ధమవుతున్నారు. లోకేష్ తన సినిమాటిక్ యూనివర్స్ (LCU)తో ఇప్పటికే సంచలనం సృష్టించిన నేపథ్యంలో, ఈ క్రేజీ కాంబో కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
Anasuya: శివాజీ సృష్టించిన చీర.. అనసూయ సాలిడ్ కౌంటర్.. మళ్ళీ మొదలైన రచ్చ
అయితే, అందరూ ఎంతగానో ఎదురుచూస్తున్న ప్రశాంత్ నీల్ – అల్లు అర్జున్(Allu Arjun- Prashanth neel) ప్రాజెక్ట్ పట్టాలెక్కడానికి మరికొంత కాలం వేచి చూడాల్సిందేనని తెలుస్తోంది. ప్రశాంత్ నీల్ ప్రస్తుతం ఎన్టీఆర్‌తో కలిసి డ్రాగన్ అనే భారీ యాక్షన్ ఎంటర్టైనర్ను రూపొందించే పనిలో ఉన్నారు. ఈ ప్రాజెక్ట్ పూర్తయిన తర్వాతే ఆయన బన్నీతో సినిమా చేసే అవకాశం ఉంది. మరోవైపు అల్లు అర్జున్ వరుసగా అట్లీ, లోకేష్ కనగరాజ్ వంటి స్టార్ డైరెక్టర్ల ప్రాజెక్టులతో బిజీగా ఉండటంతో, కాల్ షీట్ల సర్దుబాటు కూడా ఒక అడ్డంకిగా మారింది.
ఈ ఇద్దరు స్టార్స్ కూడా తమ ప్రస్తుత సినిమాలను పూర్తి చేసే వరకు ఈ కాంబినేషన్ సెట్స్‌పైకి వెళ్లడం కష్టమే. అయినప్పటికీ, అల్లు అర్జున్ నటన, ప్రశాంత్ నీల్ మేకింగ్ స్టైల్ కలిస్తే వెండితెరపై ఒక అద్భుతం జరగడం ఖాయం అని ట్రేడ్ వర్గాలు బలంగా నమ్ముతున్నాయి. ఈ భారీ చిత్రాలన్నీ పూర్తయితే అల్లు అర్జున్ మార్కెట్ రేంజ్ అంతర్జాతీయ స్థాయికి చేరుకోవడం ఖాయం. అప్పుడు ఉంటే ఈ కాంబోలో సినిమా వచ్చే అవకాశం ఉంది. కాబట్టి, ప్రస్తుతానికైతే ప్రశాంత్ నీల్ లిస్ట్ నుంచి అల్లు అర్జున్ అవుట్ అనే చెప్పాలి.
