Bhadradri Kothagudem : పుస్తకాలు కొనేందుకు డబ్బులు ఇవ్వలేదని బాలుడు ఆత్మహత్య

బెండలపాడు గ్రామానికి చెందిన 11 ఏళ్ల సుధీర్ బాబు పుస్తకాలు కొనేందుకు తల్లిదండ్రులను డబ్బులు అడిగాడు. అయితే తల్లిండ్రులు డబ్బులు ఇవ్వకపోవడంతో సుధీర్ బాబు తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు.

Bhadradri Kothagudem : పుస్తకాలు కొనేందుకు డబ్బులు ఇవ్వలేదని బాలుడు ఆత్మహత్య

boy ends life itself

Updated On : October 11, 2023 / 2:59 PM IST

Bhadradri Kothagudem – Boy Ends Life Itself : భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో విషాదం నెలకొంది. పుస్తకాలు కొనేందుకు తల్లిదండ్రులు డబ్బులు ఇవ్వలేదని ఓ బాలుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. జిల్లాలోని చంద్రుగొండ మండలం బెండలపాడు గ్రామానికి చెందిన 11 ఏళ్ల సుధీర్ బాబు పుస్తకాలు కొనేందుకు తల్లిదండ్రులను డబ్బులు అడిగాడు.

అయితే తల్లిండ్రులు డబ్బులు ఇవ్వకపోవడంతో సుధీర్ బాబు తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు. దీంతో సుధీర్ బాబు తన ఇంట్లోనే ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. బాలుడి మృతితో తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు. బాలుడి మృతితో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.

Girl Half brain switched off : ఆరేళ్ల చిన్నారి సగం మెదడుని డిస్‌కనెక్ట్ చేసి నిద్రపుచ్చిన డాక్టర్లు..

సమాచారం తెలిసిన వెంటనే పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని పరిశీలించారు. బాలుడి మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని, దర్యాప్తు చేస్తున్నారు. అన్ని కోణాల్లో విచారణ చేపట్టారు.