Girl Half brain switched off : ఆరేళ్ల చిన్నారి సగం మెదడుని డిస్‌కనెక్ట్ చేసి నిద్రపుచ్చిన డాక్టర్లు..

ఆరేళ్ల చిన్నారి సగం మెదడుని డాక్టర్లు డిస్ కనెక్ట్ చేశారు. అంటే స్విచ్ ఆఫ్ చేసినట్లుగా చేశారు. చిన్నారికి వచ్చిన అరుదైన వ్యాధికి సర్జరీ చేసే క్రమంలో ఆ పాప మంచి చోసం సగం మెదడుని స్విచ్ ఆఫ్ చేసి నిద్రపోయేలా చేశారు

Girl Half brain switched off : ఆరేళ్ల చిన్నారి సగం మెదడుని డిస్‌కనెక్ట్ చేసి నిద్రపుచ్చిన డాక్టర్లు..

Girl Half brain switched off

Updated On : October 11, 2023 / 2:55 PM IST

Six Years Old Girl Half brain switched off : ఆరేళ్ల చిన్నారి సగం మెదడుని డాక్టర్లు డిస్ కనెక్ట్ చేశారు. అంటే స్విచ్ ఆఫ్ చేసినట్లుగా చేశారు. చిన్నారికి వచ్చిన అరుదైన వ్యాధికి సర్జరీ చేసే క్రమంలో ఆ పాప మంచి చోసం సగం మెదడుని స్విచ్ ఆఫ్ చేసి నిద్రపోయేలా చేశారు.అంటే సగం మెదడుని పనిచేయకుండా చేశారు. ఇది ఆ పాప భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని చేసిన సర్జరీ. ఈ అరుదైన సర్జరీ తరువాత పాప చక్కగా కోలుకుంది.

అమెరికాలోని కాలిఫోర్నియాలోని లోమా లిండా యూనివర్సిటీ హెల్త్ ఆసుపత్రిలో డాక్టర్లు అరేళ్ల పాపకు ప్రత్యేక సర్జీర చేసారు. బాలిక ప్రాణాలను కాపాడేందుకు డాక్టర్లు ఆమె మెదడులోని సగభాగాన్ని నిద్రాణ స్థితిలోకి వెళ్లేలా చేశారు. మెదడులోని రెండు సగ భాగాల మధ్యా ఉండే సంబంధాన్ని కట్ చేసి ఓ భాగాన్ని డిస్ కనెక్ట్ చేశారు.

బ్రియానా బోడ్లీ అనే ఆరేళ్ల పాపకు రాస్‌ముసెన్స్ ఎన్‌సెఫెలైటిస్ (Rasmussen’s encephaliti)అనే అరుదైన వ్యాధి వచ్చింది. ఈ వ్యాధి ఉన్నవారి మెదడు వాచిపోతుంటుంది. ఇది మరింతగా విషమించితే వారి అవయవాలు పని చేయకుండాపోతాయి. అవయవాల కదలిక నిలిచిపోతుంది. ప్రతీ సంవత్సరం 500లమంది పిల్లలు ఈ వ్యాధికి గురవుతున్నారట. ఇది ఎక్కువగా పిల్లలు, యువకులపై ప్రభావం చూపిస్తోందట. ఈ వ్యాధి రావటానికి కచ్చితమైన కారణాలను వైద్యులు కనుగొనలేకపోతున్నారు.

Mouse Milk : వామ్మో..! ఎలుక పాలు లీటరు రూ. 18లక్షలట..!!

అటువంటి వ్యాధితో అరేళ్ల పాప బాధపడుతోంది. చికిత్స కోసం లోమా లిండా యూనివర్సిటీ హెల్త్ ఆసుపత్రిలో జాయిన్ చేశారు పాప తల్లిదండ్రులు. ఈ వ్యాధికి గల కారణాలు కచ్చితంగా కనుగొనలేకపోయినా పాప ఆరోగ్యం కోసం ఆస్పత్రి డాక్టర్లు ఆమె మెదడులోని సగ భాగాన్ని తొలగిద్దామని అనుకున్నారు. కానీ సమస్య పరిష్కారం అవుతుందో లేదో అనేది గ్యారంటీ లేదు. పైగా పాపకు భవిష్యత్తులో ఏం జరుగుతుందో తెలియదు.

దీంతో..డాక్టర్లు కాస్త రిస్క్ తీసుకున్నారు పాప తల్లిదండ్రుల అనుమతితో. పాపకు భష్యత్తులో ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు ఆమె మెదడులోని సగ భాగాన్ని పూర్తిస్థాయిలో నిద్రాణస్థితికి తీసుకెళ్లడం తప్ప వేరే మార్గం లేదని భావించారు. అదే విషయాన్ని పాప బంధువులకు చెప్పారు. వారి అనుమతితో ‘‘రెండు భాగాల మధ్య ఉన్న కనెక్షన్‌ను తెంచేశారు. అంటే సగం మెదడు పనిచేయకుండా చేశారు. దీని కోసం మెదడు రెండు భాగాల మధ్య ఉండే కనెక్షన్ ను డిస్ కనెక్ట్ చేశారు. ఇలా చేయటం వల్ల ఈ వ్యాధి మెదడులోని ఇతర భాగాలకు వ్యాపించకుండా ఉంటుంది.

ఈ సర్జరీ చేసిన డాక్టర్ల బృందానికి నేతృత్వం వహించిన డాక్టర్ ఆరన్ రాబిన్సన్ మాట్లాడుతు..ఈ వ్యాధి భయకరమైనది. కానీ పాప భవిష్యత్తు కోసం ఇలా చేయాల్సి వచ్చిందని తెలిపారు. సగం మెదడుని పనిచేయకుండా చేయటానికి రెండు భాగాల మధ్యా ఉండే కనెక్షన్ ను డిస్ కనెక్ట్ చేశామని తెలిపారు.