Swiggy Delivery Boy: బిల్డింగ్‌పై నుంచి పడ్డ స్విగ్గీ డెలివరీ బాయ్ మృతి… ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి

బంజారాహిల్స్, లుంబిని క్యాజిల్ అపార్ట్‌మెంట్‌లో ఈ నెల 11న మొహమ్మద్ రిజ్వాన్ అనే స్విగ్గీ డెలివరీ బాయ్ ఫుడ్ డెలివరీ చేసేందుకు వెళ్లాడు. అక్కడ మూడో ఫ్లోర్‌‌లో ఉంటున్న కస్టమర్‌‌కు డెలివరీ చేసేందుకు రిజ్వాన్ వెళ్లాడు

Swiggy Delivery Boy: బిల్డింగ్‌పై నుంచి పడ్డ స్విగ్గీ డెలివరీ బాయ్ మృతి… ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి

Swiggy Delivery Boy: హైదరాబాద్‌లో ఇటీవల మూడో అంతస్థు నుంచి కింద పడిపోయిన స్విగ్గీ డెలివరీ బాయ్ మరణించాడు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం సాయంత్రం ప్రాణాలు కోల్పోయాడు. హైదరాబాద్,

Siberian City: ఇదే అత్యంత చల్లటి నగరం.. చలి తట్టుకోవాలంటే క్యాబేజీలా డ్రెస్ చేసుకోవాలంటున్న స్థానికులు

బంజారాహిల్స్, లుంబిని క్యాజిల్ అపార్ట్‌మెంట్‌లో ఈ నెల 11న మొహమ్మద్ రిజ్వాన్ అనే స్విగ్గీ డెలివరీ బాయ్ ఫుడ్ డెలివరీ చేసేందుకు వెళ్లాడు. అక్కడ మూడో ఫ్లోర్‌‌లో ఉంటున్న కస్టమర్‌‌కు డెలివరీ చేసేందుకు రిజ్వాన్ వెళ్లాడు. అయితే, వాళ్ల ఫ్లాట్ నుంచి జర్మన్ షెఫర్డ్ జాతికి చెందిన పెంపుడు కుక్క గట్టిగా అరుస్తూ , రిజ్వాన్‌పైకి దూసుకొచ్చింది. ఈ కుక్కను తప్పించుకునే క్రమంలో రిజ్వాన్ మూడో అంతస్తు నుంచి కింద పడిపోయాడు.

Chandigarh: రోడ్డుపై కుక్కకు ఆహారం పెడుతున్న యువతిపైకి దూసుకెళ్లిన కారు… తీవ్ర గాయాలపాలైన యువతి

ఈ ఘటనలో అతడికి తీవ్ర గాయాలయ్యాయి. ముఖ్యంగా అతడి తలకు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే స్పందించిన ఆ కుక్క యజమాని, కస్టమర్ అయిన వ్యక్తి రిజ్వాన్‌ను నిమ్స్ ఆస్పత్రిలో చేర్పించాడు. అయితే, అక్కడ నాలుగు రోజులపాటు చికిత్స పొందిన రిజ్వాన్ ఆదివారం మరణించాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు.

రిజ్వాన్ మరణంపై తెలంగాణ ప్రభుత్వం, పోలీసులు స్పందించి, తగిన చర్యలు తీసుకోవాలని, తమ కుటుంబానికి న్యాయం చేయాలని రిజ్వాన్ కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు.