Chandigarh: రోడ్డుపై కుక్కకు ఆహారం పెడుతున్న యువతిపైకి దూసుకెళ్లిన కారు… తీవ్ర గాయాలపాలైన యువతి
రోడ్డుపై వీధి కుక్కలకు ఆహారం పెడుతున్న యువతిపైకి దూసుకెళ్లిందో వాహనం. ఈ ఘటనలో ఆ యువతి తీవ్ర గాయాలపాలైంది.

Chandigarh: నిర్లక్ష్యంగా వాహనాలు నడుపుతూ ఇతరుల ప్రాణాలకు ముప్పు తెస్తున్న ఘటనలు అనేకం జరుగుతున్నాయి. తాజాగా చండీగఢ్‌ల డ్రైవర్ నిర్లక్ష్యానికి బలైన ఒక యువతి ప్రాణాపాయస్థితిలో ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది.
Chiranjeevi : ఇప్పటి జనరేషన్ అయినా ఇలా చేయండి.. నాన్నని తలుచుకుంటూ ఎమోషనల్ అయిన చిరంజీవి..
రోడ్డుపై వీధి కుక్కలకు ఆహారం పెడుతున్న యువతిపైకి దూసుకెళ్లిందో వాహనం. ఈ ఘటనలో ఆ యువతి తీవ్ర గాయాలపాలైంది. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు అక్కడి సీసీ కెమెరాలో రికార్డయ్యాయి. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం చండీగఢ్‌లో తేజస్విత అనే యవతి శనివారం రాత్రి, తన తల్లితో కలిసి వీధి కుక్కలకు ఆహారం పెడుతోంది. ఇంటికి దగ్గర్లో రోడ్డుపై ఉన్న కుక్కలకు ఆహారం అందిస్తుండగా, వేగంగా వచ్చిన మహీంద్రా థార్ వాహనం ఆమెను ఢీకొంది.
ఈ ఘటనలో దూరం ఎగిరిపడ్డ తేజస్వితకు తీవ్ర గాయాలయ్యాయి. ఆమె రక్తపు మడుగులో పడిపోయింది. వెంటనే తేజస్విత తల్లి అక్కడికి చేరుకుని, భర్తకు, పోలీసులకు ఫోన్ చేసింది. తర్వాత వారి సాయంతో తేజస్వితను దగ్గర్లోని ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడ ఆమె చికిత్స పొందుతోంది. ప్రస్తుతం ఆమె నెమ్మదిగా కోలుకుంటోంది.
తన కూతురు గాయాలపాలై రక్తపుమడుగులో పడి ఉన్నప్పటికీ, ఎవరూ తనకు సాయం చేసేందుకు ముందుకు రాలేదని తేజస్విత తల్లి చెప్పింది. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు. వాహనం నడిపిన డ్రైవర్‌ను అరెస్టు చేస్తామని పోలీసులు చెప్పారు.
Caught On Camera: Woman hit by a car while feeding street dogs in Chandigarh.#Chandigarh #HitAndRun pic.twitter.com/zikYMUWZbD
— TIMES NOW (@TimesNow) January 16, 2023