Chiranjeevi : ఇప్పటి జనరేషన్ అయినా ఇలా చేయండి.. నాన్నని తలుచుకుంటూ ఎమోషనల్ అయిన చిరంజీవి..
చిరంజీవి మాట్లాడుతూ.. మా నాన్నని కూడా సినిమా షూటింగ్స్ బిజీ వల్ల చాలా మిస్ అయ్యాను. ఆయనతో గడిపిన టైం తక్కువ. ఆయన దూరం అయ్యాక, వెళ్ళిపోయాక................

Chiranjeevi gets emotional while remembering his father
Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవి ఈ సంక్రాంతికి వాల్తేరు వీరయ్య సినిమాతో వచ్చి భారీ విజయం సాధించారు. రవితేజతో కలిసి బాబీ దర్శకత్వంలో పక్కా కమర్షియల్ ఎంటర్టైనింగ్ సినిమాతో వచ్చి హిట్ కొట్టారు. ఈ సినిమాలో వింటేజ్ చిరంజీవిని చూసి ఫ్యాన్స్ ఆనందించారు. ఇక ఈ సినిమా ప్రమోషన్స్ ని కూడా ముందునుంచి భారీగానే చేస్తూ వచ్చారు చిత్రయూనిట్. వాల్తేరు వ్రీరయ్య సినిమా ప్రమోషన్స్ లో భాగంగానే చిరంజీవి సుమ యాంకరింగ్ చేస్తున్న సుమ అడ్డా అనే టీవీ షోకి కూడా వచ్చారు.
చిరంజీవి ప్రమోషన్స్ కోసం ఒక టీవీ షోకి రావడంతో ఈ ఎపిసోడ్ కోసం అంతా ఆసక్తిగా ఎదురు చూశారు. ఇటీవలే ఈ ఎపిసోడ్ రిలీజయింది. ఎపిసోడ్ ఆద్యంతం చిరంజీవి కూడా అందర్నీ సరదాగా తన స్టైల్ పంచులతో, టైమింగ్ తో నవ్వించారు. ఈ షోలో చిరంజీవితో పాటు డైరెక్టర్ బాబీ, వెన్నెల కిషోర్ కూడా పాల్గొన్నారు. ఈ షోలో చిరంజీవి అనేక ఆసక్తికర అంశాలని పంచుకున్నారు. అలాగే తన నాన్న గురించి మాట్లాడుతూ ఎమోషనల్ అయ్యారు.
సుమ మాట్లాడుతూ.. మీ పిల్లలు చిన్నప్పుడు మీరు షూటింగ్స్ తో బిజీగా ఉండటం వల్ల వారితో ఎక్కువ సమయం గడపలేకపోయాను అని గతంలో చెప్పారు. మరి మీ నాన్న గారితో ఎలా ఉండేవారు అని అడగగా చిరంజీవి మాట్లాడుతూ.. మా నాన్నని కూడా సినిమా షూటింగ్స్ బిజీ వల్ల చాలా మిస్ అయ్యాను. ఆయనతో గడిపిన టైం తక్కువ. ఆయన దూరం అయ్యాక, వెళ్ళిపోయాక చాలా మిస్ అవుతున్నాను. ఆయన తిరిగి వస్తే ఇప్పుడు మాత్రం ఆయనతోనే ఉండాలనుకుంటున్నాను. ప్రజెంట్ జనరేషన్ కి కూడా ఒకటే చెప్తున్నా. వాళ్ళు దూరమయ్యాక బాధపడటం కంటే ఇప్పుడే ఎంత బిజీగా ఉన్నా మీ తల్లి తండ్రులతో సమయం గడపండి. వాళ్ళతో గడిపిన సమయమే ఆ తర్వాత మనకి జ్ఞాపకాలుగా ఉంటాయి అంటూ తన నాన్నని గుర్తుచేసుకొని ఎమోషనల్ అయ్యారు.