Chiranjeevi : చిరంజీవి మెసేజ్ చేస్తే రిప్లై ఇవ్వని ఒకేఒక్క పర్సన్ సుమ.. మూడేళ్లు మెసేజ్ లు చేసినా పట్టించుకోలేదు..

చిరంజీవి మాట్లాడుతూ.. సుమ పుట్టిన రోజు డేట్ తెలిశాక సుమకి వరుసగా మూడేళ్లు బర్త్ డే విషెష్ చెప్పాను. కానీ నాకు ఒక్కసారి కూడా రిప్లై ఇవ్వలేదు. అసలు చిరంజీవి మెసేజ్ చేసినా రిప్లై ఇవ్వని ఒకేఒక పర్సన్ ఎవరన్నా ఉన్నారంటే అది సుమనే.....................

Chiranjeevi : చిరంజీవి మెసేజ్ చేస్తే రిప్లై ఇవ్వని ఒకేఒక్క పర్సన్ సుమ.. మూడేళ్లు మెసేజ్ లు చేసినా పట్టించుకోలేదు..

Anchor Suma did not reply to Chiranjeevi's message

Chiranjeevi :  మెగాస్టార్ చిరంజీవి ఈ సంక్రాంతికి వాల్తేరు వీరయ్య సినిమాతో వచ్చి భారీ విజయం సాధించిన సంగతి తెలిసిందే. రవితేజతో కలిసి పక్కా కమర్షియల్ ఎంటర్టైనింగ్ సినిమాని ఇచ్చారు. బాబీ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో చిరంజీవిని పాత సినిమాల్లో ఉన్న క్యారెక్టర్స్ తో చూపించి వింటేజ్ చిరంజీవిని గుర్తుకువచ్చేలా చేశారు. ఇక ఈ సినిమా ప్రమోషన్స్ ని కూడా భారీగానే చేశారు చిత్రయూనిట్.

వాల్తేరు వ్రీరయ్య సినిమా ప్రమోషన్స్ లో భాగంగా చిరంజీవి సుమ యాంకరింగ్ చేస్తున్న సుమ అడ్డా అనే టీవీ షోకి కూడా వచ్చారు. చిరంజీవి ప్రమోషన్స్ కోసం ఒక టీవీ షోకి రావడంతో ఈ ఎపిసోడ్ కోసం అంతా ఆసక్తిగా ఎదురు చూశారు. ఇటీవలే ఈ ఎపిసోడ్ రిలీజయింది. ఎపిసోడ్ ఆద్యంతం చిరంజీవి కూడా అందర్నీ సరదాగా తన స్టైల్ పంచులతో, టైమింగ్ తో నవ్వించారు. ఈ షోలో చిరంజీవితో పాటు డైరెక్టర్ బాబీ, వెన్నెల కిషోర్ కూడా పాల్గొన్నారు. ఇక ఈ షోలో చిరంజీవి అనేక ఆసక్తికర అంశాలని పంచుకున్నారు. ఈ నేపథ్యంలో యాంకర్ సుమ గురించి చిరంజీవి ఓ ఆసక్తికర విషయాన్ని తెలిపారు.

చిరంజీవి మాట్లాడుతూ.. సుమ పుట్టిన రోజు డేట్ తెలిశాక సుమకి వరుసగా మూడేళ్లు బర్త్ డే విషెష్ చెప్పాను. కానీ నాకు ఒక్కసారి కూడా రిప్లై ఇవ్వలేదు. అసలు చిరంజీవి మెసేజ్ చేసినా రిప్లై ఇవ్వని ఒకేఒక పర్సన్ ఎవరన్నా ఉన్నారంటే అది సుమనే అని అన్నారు. ఆ తర్వాత ఒకసారి కాల్ చేసి విషెష్ చెప్పాను, అప్పుడు నా నంబర్ సేవ్ చేసుకుంది అని తెలిపారు.

Rashmika Mandanna : రష్మిక చేతిపై ఉండే టాటూ మీనింగ్ ఏంటో తెలుసా?? టాటూ ఎందుకు వేయించుకుందో చెప్పేసిన రష్మిక..

సుమ దీనికి సమాధానం చెప్తూ.. సర్, దీనికి సమాధానం మీకు అప్పుడే చెప్పాను, అసలు చిరంజీవి గారు నాకు మెసేజ్ చేయడమేంటి, నాకు బర్త్ డే విషెష్ చెప్పడమేంటి అనుకోని, అదెవరో చేశారనుకొని వదిలేశాను సర్. ఆ తర్వాత మీరు కాల్ చేశాక మీరనుకోలేదు అని సారీ కూడా చెప్పాను, చాలా సంతోషంగా ఫీల్ అయ్యాను, మీరని తెలిశాక, అప్పుడు మీ నెంబర్ సేవ్ చేసుకున్నాను అని చెప్పింది. దీంతో చిరంజీవి సుమకి మెసేజ్ చేసినా రిప్లై ఇవ్వలేదు అనడంతో వైరల్ గా మారింది. ఇక ఈ ఎపిసోడ్ కూడా ప్రస్తుతం యూట్యూబ్ ట్రెండింగ్ లో ఉంది.