Chhattisgarh: పోర్న్ వీడియోలు చూసి పక్కింటి బాలికపై యువకుడి హత్యాచారం.. ఆత్మహత్యగా చిత్రీకరించే యత్నం

పోర్న్ వీడియోలకు అలవాటుపడ్డ ఒక యువకుడు ఆ వీడియోలు చూసి ఘాతుకానికి పాల్పడ్డాడు. పక్కింట్లో ఉండే పదేళ్ల బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడు. అనంతరం హత్య చేశాడు.

Chhattisgarh: పోర్న్ వీడియోలు చూసి పక్కింటి బాలికపై యువకుడి హత్యాచారం.. ఆత్మహత్యగా చిత్రీకరించే యత్నం

Chhattisgarh: ఛత్తీస్‌గఢ్‌లో యువకుడు దారుణానికి తెగబడ్డాడు. గంటల తరబడి పోర్న్ వీడియోలు చూసి, పక్కింటి బాలికపై హత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ ఘటన ఇటీవల ఛత్తీస్‌గఢ్‌ రాజధాని రాయ్‌పూర్ పట్టణానికి 90 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఒక గ్రామంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… 17 ఏళ్ల యువకుడు గంటల తరబడి పోర్న్ వీడియోలు చూశాడు.

Assam: పేరెంట్స్‌కు కంప్లైంట్ చేసినందుకు గర్భిణి అయిన టీచర్‌పై విద్యార్థుల దాడి

తర్వాత తన పక్కింట్లో ఉండే పదేళ్ల బాలికను, ఇంటి పైకి తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడు. తర్వాత ఈ విషయం ఎవరికైనా చెబుతుందేమో అని ఆలోచించిన అతడు తన దగ్గరున్న చిన్న టవల్‌తో బాలిక గొంతు నులిమి హత్య చేశాడు. బాలిక మరణించిన తర్వాత ఎవరికీ అనుమానం రాకుండా వాళ్లింట్లోనే ఉరి వేసుకున్నట్లు చిత్రీకరించే ప్రయత్నం చేశాడు. బాలికకు తాడు బిగించి, ఉరి వేసుకున్నట్లు వేలాడదీశాడు. దీనికోసం బాలిక కాళ్ల దగ్గర ఒక కుర్చీ కూడా ఉంచాడు. మరణించిన బాలికకు ఏడాది వయసున్న ఒక చిన్నారి చెల్లి ఉంది. బాలిక మృతదేహం దగ్గరే ఆ పాపను ఉంచాడు. ఈ పాపను ఆ బాలికే చూసుకుంటూ ఉండేది. ఇదంతా పూర్తైన తర్వాత నిందితుడు అక్కడ్నుంచి పారిపోయాడు. ఘటన జరిగిన సమయంలో బాలిక తల్లిదండ్రులు పని కోసం బయటకు వెళ్లారు. తర్వాత పని నుంచి ఇంటికొచ్చిన బాలిక తల్లిదండ్రులు అక్కడి దృశ్యం చూసి షాక్ అయ్యారు.

Bengaluru: మద్యం మత్తులో ఉన్న యువతిపై బైక్ ట్యాక్సీ డ్రైవర్ అత్యాచారం.. మరో వ్యక్తితో కలిసి దురాగతం

తర్వాత సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని విచారణ ప్రారంభించారు. అయితే, బాలిక మృతదేహాన్ని చూసిన పోలీసులకు ఒక అనుమానం వచ్చింది. బాలిక అంత ఎత్తుకు తాడు బిగించి ఉరి వేసుకునే అవకాశం లేదని అర్థమైంది. ఎవరో బాలికను హత్య చేశారని నిర్ణయానికొచ్చారు. తర్వాత అత్యాచారానికి గురైనట్లు గుర్తించారు. అన్ని కోణాల్లో విచారణ జరిపిన పోలీసులు నిందితుడిని పట్టుకున్నారు. పోలీసులు తమదైన శైలిలో విచారించగా నేరాన్ని అంగీకరించాడు. జరిగిన ఘటన మొత్తాన్ని వివరించాడు. ప్రస్తుతం పోలీసులు నిందితుడిని అరెస్టు చేసి, తదుపరి విచారణ కొనసాగిస్తున్నారు.