Assam: పేరెంట్స్‌కు కంప్లైంట్ చేసినందుకు గర్భిణి అయిన టీచర్‌పై విద్యార్థుల దాడి

పేరెంట్స్‌కు కంప్లైంట్ చేసిందన్న కారణంతో గర్భిణి అయిన ఒక టీచర్‌పై విద్యార్థులు దాడికి పాల్పడ్డారు. ఈ ఘటన అసోంలోని డిబ్రూగఢ్ జిల్లాలో జరిగింది. దీనిపై స్కూలు సిబ్బంది పోలీసులకు ఫిర్యాదు చేశారు.

Assam: పేరెంట్స్‌కు కంప్లైంట్ చేసినందుకు గర్భిణి అయిన టీచర్‌పై విద్యార్థుల దాడి

Assam: అసోంలో దారుణం జరిగింది. తమ చదువు గురించి తల్లిదండ్రులకు ఫిర్యాదు చేసినందుకు గర్భిణి అయిన ఒక టీచర్‌పై దాడికి పాల్పడ్డారు కొందరు విద్యార్థులు. ఈ ఘటన డిబ్రూగఢ్ జిల్లాలోని మోరన్ ప్రాంతంలో ఆదివారం సాయంత్రం జరిగింది. జవహర్ నవోదయ విద్యాలయ వైస్ ప్రిన్సిపల్ చెప్పిన వివరాల ప్రకారం.. ఆదివారం స్కూళ్లో పేరెంట్స్-టీచర్స్ కౌన్సిల్ మీటింగ్ జరిగింది.

Rajasthan: చేతులు కలిపిన ఇద్దరు బద్ధ శత్రువులు.. రాజస్తాన్‭ రాజకీయాల్లో ఏం జరుగుతోంది?

ఈ సందర్భంగా హిస్టరీ టీచర్ ఒకరు విద్యార్థులపై పేరెంట్స్‌కు ఫిర్యాదు చేశారు. కొందరు విద్యార్థులు సరిగ్గా చదవడం లేదని చెప్పారు. అందులో ఒక విద్యార్థి గురించి ఆ టీచర్ ప్రస్తావించారు. దీంతో తమపై పేరెంట్స్‌కు కంప్లైంట్ చేసిందన్న ఆగ్రహంతో కొందరు విద్యార్థులు ఆ టీచర్‌పై దాడికి పాల్పడ్డారు. ఆమె ఐదు నెలల గర్భిణి. ఈ విషయం తెలిసినప్పటికీ విద్యార్థులు స్కూల్లోనే, తోటి టీచర్లు, విద్యార్థినిల ముందు ఆ టీచర్‌పై దాడికి పాల్పడ్డారు. టీచర్‌ను తోసేసి, జుట్టు పట్టుకుని లాగారు. పక్కనే ఉన్న వైస్ ప్రిన్సిపల్‌పై కూడా దాడికి యత్నించారు. అయితే, తోటి టీచర్లు, కొందరు విద్యార్థినిలు, ఇతర స్టాఫ్ కలిసి అడ్డుకున్నారు. గర్భిణి అయిన టీచర్ ఇప్పటికే ప్రెగ్నెన్సీకి సంబంధించి కొన్ని సమస్యలు ఎదుర్కుంటోంది.

Akhil Agent Movie: సంక్రాంతిని సీనియర్లకే వదిలేస్తున్న అయ్యగారు.. ఇక ఉగాదే పక్కా..?

విద్యార్థుల దాడితో ఆమె మరింత ఆందోళనకు గురైంది. అయితే, సిబ్బంది అంతా కలిసి ఆమెను రక్షించి, స్కూల్‌కు సంబంధించిన వాహనంలో వెంటనే ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆ టీచర్ అక్కడ చికిత్స పొందుతోంది. ఈ ఘటనపై వెంటనే వైస్ ప్రిన్సిపల్ విద్యార్థుల తల్లిదండ్రులకు ఫోన్లో ఫిర్యాదు చేశాడు. తన ఇంట్లో అత్యవసర సమావేశం ఏర్పాటు చేశాడు. ఈ విషయం తెలుసుకున్న స్టూడెంట్స్ మళ్లీ రెచ్చిపోయారు. వైస్ ప్రిన్సిపల్ ఇంటివైపు దూసుకొచ్చి దాడికి యత్నించారు. దీంతో ప్రిన్సిపల్ అక్కడ్నుంచి తప్పించుకుని, స్థానిక పోలీస్ స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు అందుకున్న పోలీసులు స్కూల్‌కు చేరుకుని విద్యార్థుల్ని హెచ్చరించారు. విద్యార్థులపై కేసు నమోదు చేశారు.

వారిలో కొందరు మైనర్లు ఉండటంతో కేసు నమోదు చేసే అంశాన్ని పరిశీలిస్తున్నారు. 10, 11 తరగతులకు చెందిన 22 మంది విద్యార్థులు ఈ దాడికి పాల్పడ్డట్లు గుర్తించారు. ఈ ఘటనపై జవహర్ నవోదయ విద్యాలయ ఉన్నతాధికారులు, పోలీసు ఉన్నతాధికారులు కూడా ప్రత్యేక దృష్టి సారించారు.