Akhil Agent Movie: సంక్రాంతిని సీనియర్లకే వదిలేస్తున్న అయ్యగారు.. ఇక ఉగాదే పక్కా..?

అక్కినేని యంగ్ హీరో అఖిల్ నటిస్తున్న ‘ఏజెంట్’ మూవీ కోసం టాలీవుడ్ ప్రేక్షకులు ఓ రేంజ్‌లో ఎదురుచూస్తున్నారు. ఈ సినిమాను ఇప్పటికే చాలా సార్లు వాయిదా వేస్తూ వస్తోంది చిత్ర యూనిట్. ఈ సినిమాను దర్శకుడు సురేందర్ రెడ్డి స్పై యాక్షన్ థ్రిల్లర్ మూవీగా తెరకెక్కించగా, ఈ సినిమా కోసం అఖిల్ తన ఫిజిక్‌ను భారీగా మార్చుకున్నాడు. అయితే ఈ సినిమాను పలుమార్లు వాయిదా వేస్తూ వచ్చిన చిత్ర యూనిట్, ఎట్టకేలకు సంక్రాంతి బరిలో రిలీజ్ చేస్తామని గతంలో ప్రకటించింది.

Akhil Agent Movie: సంక్రాంతిని సీనియర్లకే వదిలేస్తున్న అయ్యగారు.. ఇక ఉగాదే పక్కా..?

Akhil Agent Movie Eyeing New Release Date

Akhil Agent Movie: అక్కినేని యంగ్ హీరో అఖిల్ నటిస్తున్న ‘ఏజెంట్’ మూవీ కోసం టాలీవుడ్ ప్రేక్షకులు ఓ రేంజ్‌లో ఎదురుచూస్తున్నారు. ఈ సినిమాను ఇప్పటికే చాలా సార్లు వాయిదా వేస్తూ వస్తోంది చిత్ర యూనిట్. ఈ సినిమాను దర్శకుడు సురేందర్ రెడ్డి స్పై యాక్షన్ థ్రిల్లర్ మూవీగా తెరకెక్కించగా, ఈ సినిమా కోసం అఖిల్ తన ఫిజిక్‌ను భారీగా మార్చుకున్నాడు. అయితే ఈ సినిమాను పలుమార్లు వాయిదా వేస్తూ వచ్చిన చిత్ర యూనిట్, ఎట్టకేలకు సంక్రాంతి బరిలో రిలీజ్ చేస్తామని గతంలో ప్రకటించింది.

Agent Movie: సంక్రాంతి బరిలోనే అఖిల్ ‘ఏజెంట్’.. అఫీషియల్‌గా అనౌన్స్ చేసిన చిత్ర యూనిట్

అయితే ఇప్పుడు ఈ సినిమాను సంక్రాంతి బరిలో కూడా రిలీజ్ చేయడం కష్టంగానే కనిపిస్తుంది. ఇప్పటికే సంక్రాంతి బరిలో తమ సినిమాలను రిలీజ్ చేసేందుకు సీనియర్ హీరోలు పోటీపడుతున్నారు. మెగాస్టార్ చిరంజీవి వాల్తేరు వీరయ్య, నందమూరి బాలకృష్ణ ‘వీరసింహారెడ్డి’ సినిమాలతో టాలీవుడ్ బాక్సాఫీస్‌ను షేక్ చేసేందుకు రెడీ అయ్యారు. అటు తమిళ స్టార్ హీరో విజయ్ ‘వారసుడు’ మూవీతో మరికొన్ని థియేటర్లను బ్లాక్ చేయనున్నాడు. దీంతో ఈ మూడు సినిమాల మధ్య తమ సినిమాను రిలీజ్ చేయడం ఎందుకని చిత్ర యూనిట్ భావిస్తోందట.

Agent Movie: ఏజెంట్ మూవీలో బాలీవుడ్ యాక్టర్..?

అందుకే తమ ఏజెంట్ సినిమను సంక్రాంతి బరిలో కాకుండా ఏకంగా ఉగాది సీజన్‌లో రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తోంది. ఆ సమయంలో సినిమాల రిలీజ్‌లు తక్కువగా ఉంటాయని, అది తమ సినిమాకు బాగా ఉపయోగపడుతుందని అఖిల్ అండ్ టీమ్ భావిస్తున్నారట. ఇక ఈ సినిమాలో మలయాళ స్టార్ మమ్ముట్టి ఓ కీలక పాత్రలో నటిస్తుండగా, సాక్షి వైద్య హీరోయిన్‌గా నటిస్తోంది. మరి ఈ సినిమా ఉగాదికైనా వస్తుందా లేదా అనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.