Agent Movie: సంక్రాంతి బరిలోనే అఖిల్ ‘ఏజెంట్’.. అఫీషియల్‌గా అనౌన్స్ చేసిన చిత్ర యూనిట్

అక్కినేని యంగ్ హీరో అఖిల్ నటిస్తున్న తాజా చిత్రం ‘ఏజెంట్’ ఇప్పటికే ఇండస్ట్రీ వర్గాల్లో మంచి బజ్‌ను క్రియేట్ చేసింది. ఈ సినిమాలో అఖిల్ మేకోవర్‌కు అభిమానులతో పాటు ప్రేక్షకులు కూడా ఫిదా అవుతున్నారు. ఇప్పటికే ఈ సినిమా పోస్టర్స్, టీజర్ గ్లింప్స్ ప్రేక్షకుల్లో ఈ సినిమాపై నెలకొన్న అంచనాలను రెట్టింపు చేశాయి. ఇక ఈ సినిమాను దర్శకుడు సురేందర్ రెడ్డి తెరకెక్కిస్తుండటంతో ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తుందా అని అందరూ ఆతృతగా చూస్తున్నారు.

Agent Movie: సంక్రాంతి బరిలోనే అఖిల్ ‘ఏజెంట్’.. అఫీషియల్‌గా అనౌన్స్ చేసిన చిత్ర యూనిట్

Akhil Spy Thriller Agent Movie Locks New Release Date

Agent Movie: అక్కినేని యంగ్ హీరో అఖిల్ నటిస్తున్న తాజా చిత్రం ‘ఏజెంట్’ ఇప్పటికే ఇండస్ట్రీ వర్గాల్లో మంచి బజ్‌ను క్రియేట్ చేసింది. ఈ సినిమాలో అఖిల్ మేకోవర్‌కు అభిమానులతో పాటు ప్రేక్షకులు కూడా ఫిదా అవుతున్నారు. ఇప్పటికే ఈ సినిమా పోస్టర్స్, టీజర్ గ్లింప్స్ ప్రేక్షకుల్లో ఈ సినిమాపై నెలకొన్న అంచనాలను రెట్టింపు చేశాయి. ఇక ఈ సినిమాను దర్శకుడు సురేందర్ రెడ్డి తెరకెక్కిస్తుండటంతో ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తుందా అని అందరూ ఆతృతగా చూస్తున్నారు.

Agent Movie: ఏజెంట్ మూవీలో బాలీవుడ్ యాక్టర్..?

అయితే ఈ సినిమా రిలీజ్ విషయంలో పలుమార్లు వాయిదా పడుతూ వచ్చింది. ఇక దీపావళి పండగరోజు సందర్భంగా ఏజెంట్ మూవీ రిలీజ్ డేట్‌ను చిత్ర యనిట్ తాజాగా అనౌన్స్ చేసింది. పూర్తి స్పై థ్రిల్లర్ మూవీగా రాబోతున్న ఈ సినిమాను 2023 సంక్రాంతి బరిలో రిలీజ్ చేస్తున్నట్లు చిత్ర యూనిట్ తాజాగా అనౌన్స్ చేసింది. ఈ సినిమాను వాల్తేరు వీరయ్య, ఆదిపురుష్, వీరసింహారెడ్డి, వారసుడు వంటి సినిమాలతో పోటీగా రాబోతుండటంతో ఈ సినిమాపై అంచనాలు డబుల్ అయ్యాయి.

Agent: అఖిల్ “ఏజెంట్” నుంచి అదిరిపోయే అప్డేట్..

మరి స్టార్ హీరోల సినిమాలతో పోటీలో అఖిల్ ఏజెంట్ ఎంతమేర ప్రేక్షకులను ఆకట్టుకుంటుందో తెలియాలంటే ఈ సినిమా రిలీజ్ అయ్యే వరకు వెయిట్ చేయాల్సిందే. ఈ సినిమాలో సాక్షి వైద్య హీరోయిన్‌గా నటిస్తుండగా, ఎకె ఎంటర్‌టైన్‌మెంట్స్, సురేందర్ 2 సినిమా బ్యానర్లు ఈ సినిమాను ప్రొడ్యూస్ చేస్తున్నాయి. సాక్షి వైద్య ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తోండగా హిప్ హాప్ తమిళ ఈ చిత్రానికి సంగీతాన్ని అందిస్తున్నాడు.