Agent Movie: ఏజెంట్ మూవీలో బాలీవుడ్ యాక్టర్..?

అక్కినేని యంగ్ హీరో అఖిల్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘ఏజెంట్’ కోసం టాలీవుడ్ ప్రేక్షకులు ఏ రేంజ్‌లో ఎదురుచూస్తున్నారో అందరికీ తెలిసిందే. ఈ సినిమాను స్టైలిష్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి తెరకెక్కిస్తుండటంతో ఈ సినిమాపై అంచనాలు ఓ రేంజ్‌లో క్రియేట్ అయ్యాయి. ఏజెంట్ సినిమాలో ఇప్పటికే పలువురు హేమాహేమీలు నటిస్తుండగా, తాజాగా ఓ బాలీవుడ్ నటుడు కూడా ఈ సినిమాలో నటిస్తున్నట్లు తెలుస్తోంది.

Agent Movie: ఏజెంట్ మూవీలో బాలీవుడ్ యాక్టర్..?

Akhil Akkineni Agent Movie To Have Bollywood Hero

Agent Movie: అక్కినేని యంగ్ హీరో అఖిల్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘ఏజెంట్’ కోసం టాలీవుడ్ ప్రేక్షకులు ఏ రేంజ్‌లో ఎదురుచూస్తున్నారో అందరికీ తెలిసిందే. ఈ సినిమాను స్టైలిష్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి తెరకెక్కిస్తుండటంతో ఈ సినిమాపై అంచనాలు ఓ రేంజ్‌లో క్రియేట్ అయ్యాయి. ఇక ఇప్పటికే రిలీజ్ అయిన ఈ చిత్ర ఫస్ట్ లుక్ పోస్టర్స్ ప్రేక్షకుల్లో ఈ సినిమాపై అంచనాలను రెట్టింపు చేశాయి. కాగా, ఈ సినిమాకు సంబంధించిన అప్డేట్స్ గురించి ప్రేక్షకులు ఆతృతగా ఎదురుచూస్తున్నారు.

Akhil Akkineni: మాల్దీవ్స్‌లో ప్రత్యక్షమైన ఏజెంట్.. దేనికోసమో?

అయితే, తాజాగా ఇండస్ట్రీ వర్గాల్లో ఈ సినిమాకు సంబంధించి ఓ వార్త జోరుగా వినిపిస్తోంది. ఏజెంట్ సినిమాలో ఇప్పటికే పలువురు హేమాహేమీలు నటిస్తుండగా, తాజాగా ఓ బాలీవుడ్ నటుడు కూడా ఈ సినిమాలో నటిస్తున్నట్లు తెలుస్తోంది. బాలీవుడ్‌లో ‘రాజ్’ వంటి సినిమాలో నటించి ప్రేక్షకులను అలరించిన డీనో మోరియా ఏజెంట్ సినిమాలో ఓ నెగెటివ్ రోల్‌లో నటించబోతున్నట్లు తెలుస్తోంది.

Agent Teaser: వైల్డ్ యాక్షన్‌తో అదరగొట్టిన స్టైలిస్ ఏజెంట్

అఖిల్ ఏజెంట్‌గా నటిస్తున్న ఈ సినిమాలో మలయాళ నటుడు మమ్ముట్టి కూడా ఓ పవర్‌ఫుల్ పాత్రలో నటిస్తున్నాడు. సాక్షి వైద్యా హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమా షూటింగ్ చివరిదశకు చేరుకోగా, త్వరలోనే ఈ సినిమాను రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అవుతోంది. మరి ఈ సినిమాలో బాలీవుడ్ నటుడు డోనీ మోరియా నటిస్తున్నాడా లేదా అనే విషయంపై చిత్ర యూనిట్ క్లారిటీ ఇవ్వాల్సి ఉంది.