Agent Teaser: వైల్డ్ యాక్షన్‌తో అదరగొట్టిన స్టైలిస్ ఏజెంట్

అక్కినేని యంగ్ హీరో అఖిల్ నటిస్తున్న ది మోస్ట్ వెయిటెడ్ మూవీ ఏజెంట్ కోసం ప్రేక్షకులు కళ్లు కాయలు కాచేలా ఎదురుచూస్తున్నారు. ఎప్పుడో షూటింగ్....

Agent Teaser: వైల్డ్ యాక్షన్‌తో అదరగొట్టిన స్టైలిస్ ఏజెంట్

Agent Teaser: అక్కినేని యంగ్ హీరో అఖిల్ నటిస్తున్న ది మోస్ట్ వెయిటెడ్ మూవీ ఏజెంట్ కోసం ప్రేక్షకులు కళ్లు కాయలు కాచేలా ఎదురుచూస్తున్నారు. ఎప్పుడో షూటింగ్ మొదులపెట్టుకున్న ఈ సినిమాతో అఖిల్ ఈసారి బాక్సాఫీస్ వద్ద తన సత్తా చాటడం ఖాయమని అక్కినేని అభిమానులు ఫిక్స్ అయ్యారు. ఇక అందుకు తగ్గట్టుగానే ఈ సినిమా కోసం అఖిల్ తనను తాను మార్చుకున్న తీరుకు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. ఇక ఈ సినిమా నుండి తాజాగా టీజర్‌ను రిలీజ్ చేసింది చిత్ర యూనిట్.

Agent: టీజర్ రిలీజ్ కోసం ఏజెంట్ స్పెషల్ ఏర్పాట్లు..?

ఈ టీజర్ ఆద్యంతం యాక్షన్ ఎపిసోడ్స్‌తో నింపేశారు చిత్ర యూనిట్. ఓ దేశభక్తి గల ఏజెంట్.. ప్రాణాలను పణంగా పెట్టి చేసే పోరాటం.. ఎవరికీ దొరకని అతని ఆచూకీ.. తన చావును ముందుగానే రాసిపెట్టుకున్న ఏజెంట్.. ఇలా అతడి పాత్రను ఎలివేట్ చేస్తూ మలయాళ స్టార్ మమ్ముట్టి చేసిన ఇంట్రో సూపర్బ్‌గా ఉండటంతో ఈ సినిమాలో అఖిల్ పాత్రను ఎలా డిజైన్ చేశారో మనకు ఇట్టే అర్థమవుతోంది. కాగా హీరోయిన్ సాక్షి వైద్యా ఏజెంట్‌ను ‘‘వైల్డ్ సాలా’’ అని పిలవడంతో, ఏజెంట్‌గా అఖిల్ అపియరెన్స్ మొదలుకొని అతడి చేష్టల వరకు ఎంతటి వైల్డ్‌గా ఉండబోతున్నాయో మనకు ఈ టీజర్ చివర్లో చూపించారు. శత్రువులకు ఎదురెళ్తూ మరీ నన్ను చంపండ్రా.. అంటూ మొండిగా అఖిల్ చేస్తున్న యాక్షన్ సీక్వెన్స్‌కు ప్రేక్షకులకు గూస్‌బంప్స్ రావడం ఖాయం.

Agent: ఎట్టకేలకు ల్యాండ్ అవుతున్ను ఏజెంట్!

మొత్తానికి అందరూ అనుకుంటున్నట్లుగానే అఖిల్ కోసం ఓ పవర్‌ఫుల్ స్టైలిష్ స్పై థ్రిల్లర్ కథను తనదైన మార్క్‌తో తెరకెక్కించి, ఈసారి బాక్సాఫీస్ వద్ద మరోసారి తన సత్తా చాటాలనే కసిగా ఉన్నాడు ఈ దర్శకుడు సురేందర్ రెడ్డి. ఇక ఈ సినిమాను రామబ్రహ్మం సుంకర ప్రొడ్యూస్ చేస్తుండగా ఈ సినిమాలో సాక్షి వైద్యా హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ చిత్రానికి హిప్ హాప్ తమిళ సంగీతం అందిస్తుండగా పాన్ ఇండియా మూవీగా ఈ సినిమాను రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అవుతోంది.