Agent: ఎట్టకేలకు ల్యాండ్ అవుతున్ను ఏజెంట్!

అక్కినేని అఖిల్ నటిస్తున్న తాజా చిత్రం ‘ఏజెంట్’ నుండి ఓ అదిరిపోయే అప్‌డేట్‌ను చిత్ర యూనిట్ ఎట్టకేలకు అనౌన్స్ చేసింది. ఈ సినిమా నుండి అఖిల్‌కు సంబంధించిన....

Agent: ఎట్టకేలకు ల్యాండ్ అవుతున్ను ఏజెంట్!

Agent Movie Teaser Release Date Locked

Agent: అక్కినేని అఖిల్ నటిస్తున్న తాజా చిత్రం ‘ఏజెంట్’ నుండి ఓ అదిరిపోయే అప్‌డేట్‌ను చిత్ర యూనిట్ ఎట్టకేలకు అనౌన్స్ చేసింది. ఈ సినిమా నుండి అఖిల్‌కు సంబంధించిన ఫోటోలతో సోషల్ మీడియాలో గతకొంతకాలంగా దడదడలాడిస్తున్న ఏజెంట్ చిత్ర యూనిట్, తాజాగా ఈ సినిమాకు సంబంధించిన టీజర్ రిలీజ్ డేట్‌ను అనౌన్స్ చేసింది.

Agent: ఏజెంట్‌ను మళ్లీ వెనక్కి నెడుతున్నారా..?

ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఏజెంట్ టీజర్‌ను జూలై 15న రిలీజ్ చేస్తున్నట్లు చిత్ర యూనిట్ పేర్కొంది. స్పై థ్రిల్లర్ మూవీగా ఈ సినిమాను దర్శకుడు సురేందర్ రెడ్డి అత్యద్భుతంగా తెరకెక్కిస్తుండగా, ఈ సినిమాలో అఖిల్ బీస్ట్ మోడ్‌లో మనకు కనిపిస్తున్నాడు. ఇక ఈ టీజర్ లాంఛ్‌కు సంబంధించిన వీడియోను చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది. ఇక ఈ టీజర్‌ను తెలుగుతో పాటు తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో రిలీజ్ చేస్తున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది.

Agent: ఏజెంట్ ట్విస్టుకు ఫ్యూజులు ఎగరాల్సిందేనా..?

ఈ సినిమాలో అఖిల్ పాత్ర ప్రేక్షకులను మెస్మరైజ్ చేయడం ఖాయమని చిత్ర యూనిట్ ధీమా వ్యక్తం చేస్తోంది. కాగా ఈ సినిమాలో అఖిల్ సరసన అందాల భామ సాక్షి వైద్యా నటిస్తుండగా, మలయాళ స్టార్ యాక్టర్ మమ్ముట్టి ఈ సినిమాలో ఓ కీలక పాత్రలో నటిస్తున్నారు. మరి జూలై 15న రిలీజ్ కానున్న ఏజెంట్ టీజర్ ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తుందో చూడాలి.