Agent: టీజర్ రిలీజ్ కోసం ఏజెంట్ స్పెషల్ ఏర్పాట్లు..?

అక్కినేని యంగ్ హీరో అఖిల్ నటిస్తున్న ది మోస్ట్ వెయిటెడ్ మూవీ ‘ఏజెంట్’ టీజర్ కోసం ప్రేక్షకులు ఎంత ఆతృతగా ఎదురుచూస్తున్నారో అందరికీ తెలిసిందే.....

Agent: టీజర్ రిలీజ్ కోసం ఏజెంట్ స్పెషల్ ఏర్పాట్లు..?

Agent Teaser To Be Released In A Single Screen

Agent: అక్కినేని యంగ్ హీరో అఖిల్ నటిస్తున్న ది మోస్ట్ వెయిటెడ్ మూవీ ‘ఏజెంట్’ టీజర్ కోసం ప్రేక్షకులు ఎంత ఆతృతగా ఎదురుచూస్తున్నారో అందరికీ తెలిసిందే. ఈ సినిమాను స్టైలిష్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి తెరకెక్కిస్తుండటంతో ఈ సినిమా ఎలా ఉండబోతుందా అనే ఆసక్తి అందరిలో నెలకొంది.

Agent: ఎట్టకేలకు ల్యాండ్ అవుతున్ను ఏజెంట్!

ఇక ఈ సినిమా నుండి ఇప్పటివరకు పోస్టర్స్, వర్కింగ్ స్టిల్స్ మాత్రమే రిలీజ్ చేస్తూ వచ్చిన చిత్ర యూనిట్ ఎట్టకేలకు ఈ సినిమా ఫస్ట్ టీజర్ ను రిలీజ్ చేసేందుకు రెడీ అయ్యింది. జూలై 15న ఏజెంట్ ఫస్ట్ టీజర్ ను రిలీజ్ చేస్తున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించినప్పటి నుండి ఈ టీజర్ కోసం యావత్ తెలుగు ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా చూస్తున్నారు. ఈ సినిమా కోసం అఖిల్ చేసిన మేకోవర్ ప్రేక్షకులను మెస్మరైజ్ చేయడంతో, ఈ సినిమాలో అఖిల్ ఎలా కనిపిస్తాడా అని వారందరూ ఎదురుచూస్తున్నారు. అయితే ఈ సినిమా టీజర్ ను హైదరాబాద్‌లోని ఓ సింగిల్ స్క్రీన్ థియేటర్‌లో రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తున్నట్లుగా తెలుస్తోంది.

Agent: ఏజెంట్‌ను మళ్లీ వెనక్కి నెడుతున్నారా..?

అటు సురేందర్ రెడ్డి కూడా ఈ సినిమాను చాలా ప్రెస్టీజియస్ గా తీసుకున్నాడు. అందుకే ఈ సినిమా విషయంలో ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా, ఆలస్యం అయినా కూడా ఈ సినిమాకు పర్ఫెక్ట్ అవుట్ పుట్ వచ్చే వరకు ఆగుతూ వచ్చాడు. ఇక ఈ సినిమా టీజర్ పలు కొత్త రికార్డులు క్రియేట్ చేయడం ఖాయమని చిత్ర వర్గాలు అంటున్నాయి. ఈ సినిమాను పూర్తిగా స్పై థ్రిల్లర్ మూవీగా దర్శకుడు తెరకెక్కించిన విధానం ప్రేక్షకులకు కొత్త అనుభూతిని మిగిలిస్తుందని చిత్ర యూనిట్ ధీమా వ్యక్తం చేస్తోంది. ఈ సినిమాలో సాక్షి వైద్యా హీరోయిన్ గా నటిస్తోండగా, ఈ సినిమాను ఆగస్టు 12న రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అవుతోంది.