Agent: అఖిల్ “ఏజెంట్” నుంచి అదిరిపోయే అప్డేట్..

అక్కినేని యువహీరో అఖిల్ హీరోగా తెరకెక్కుతున్న భారీ బడ్జెట్ చిత్రం "ఏజెంట్". స్టైలిష్ డైరెక్టర్ సురేంద్ర రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా పాన్ ఇండియా లెవెల్ లో విడుదల కాబోతుంది. తాజాగా ఈ సినిమాలోని ప్రతినాయకుడిని పరిచయం చేస్తూ మూవీ టీం ఆదివారం సోషల్ మీడియా వేదికగా ఒక పోస్టర్ విడుదల చేసింది.

Agent: అఖిల్ “ఏజెంట్” నుంచి అదిరిపోయే అప్డేట్..

Agent Movie Villain Pre Look Released

Agent: అక్కినేని యువహీరో అఖిల్ హీరోగా తెరకెక్కుతున్న భారీ బడ్జెట్ చిత్రం “ఏజెంట్”. స్టైలిష్ డైరెక్టర్ సురేంద్ర రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా పాన్ ఇండియా లెవెల్ లో విడుదల కాబోతుంది. తాజాగా ఈ సినిమాలోని ప్రతినాయకుడిని పరిచయం చేస్తూ మూవీ టీం ఆదివారం సోషల్ మీడియా వేదికగా ఒక పోస్టర్ విడుదల చేసింది.

Akhil Akkineni: అఖిల్ కోసం భారీగా ప్లాన్ చేస్తున్న కరణ్ జోహర్..?

ఈ క్యారెక్టర్ ను హర్యానా నటుడు “విక్రమ్ జీత్ విర్క్” పోషిస్తుండగా, ఆ పాత్రను పరిచయం చేస్తూ ప్రీ లుక్ ను విడుదల చేసింది చిత్ర యూనిట్. మొఖం చూపించకుండా, గన్ పట్టుకొని ఉన్న ఫోటోను.. ‘ది బాడ్ గాయ్ అఫ్ ఏజెంట్’ అంటూ రిలీజ్ చేయగా, ఫస్ట్ లుక్ పోస్టర్ ను కూడా త్వరలో విడుదల చేయబోతున్నట్లు ప్రకటించింది.

ఏ.కే ఎంటర్టైన్మెంట్స్ మరియు సురేంద్ర రెడ్డి ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి ఒక ముఖ్య పాత్ర పోషిస్తుండగా, సాక్షీ వైద్య హీరోయిన్ గా నటిస్తుంది. తమిళ సంగీత దర్శకుడు హిప్ హాప్ తమిజ ఈ సినిమాకు స్వరాలు అందిస్తున్నాడు.