Akhil Akkineni: అఖిల్ కోసం భారీగా ప్లాన్ చేస్తున్న కరణ్ జోహర్..?

అక్కినేని యంగ్ హీరో అఖిల్ నటిస్తున్న తాజా చిత్రం ‘ఏజెంట్’ ఇప్పటికే శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. ఈ సినిమాతో బాక్సాఫీస్ వద్ద ఎలాగైనా బ్లాక్‌బస్టర్ హిట్ అందుకోవాలని అఖిల్ తెగ కష్టపడుతున్నాడు. ఈ సినిమా తరువాత అఖిల్ తన నెక్ట్స్ చిత్రాన్ని బాలీవుడ్ స్టార్ ఫిలిం మేకర్ కరణ్ జోహర్‌తో చేయబోతున్నట్లు తెలుస్తోంది.

Akhil Akkineni: అఖిల్ కోసం భారీగా ప్లాన్ చేస్తున్న కరణ్ జోహర్..?

Karan Johar Planning Big For Akhil Akkineni Bollywood Entry

Updated On : September 20, 2022 / 12:00 PM IST

Akhil Akkineni: అక్కినేని యంగ్ హీరో అఖిల్ నటిస్తున్న తాజా చిత్రం ‘ఏజెంట్’ ఇప్పటికే శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. ఈ సినిమాతో బాక్సాఫీస్ వద్ద ఎలాగైనా బ్లాక్‌బస్టర్ హిట్ అందుకోవాలని అఖిల్ తెగ కష్టపడుతున్నాడు. ఇక ఈ సినిమాను దర్శకుడు సురేందర్ రెడ్డి ఓ స్పై థ్రిల్లర్ మూవీగా తెరకెక్కిస్తుండటంతో ఈ సినిమాపై ఇండస్ట్రీ వర్గాలతో పాటు ప్రేక్షకుల్లో భారీ అంచనాలు క్రియేట్ అయ్యాయి. కాగా, ఈ సినిమా తరువాత అఖిల్ తన నెక్ట్స్ చిత్రాన్ని ఎవరితో చేస్తాడా అనే ఆసక్తి అక్కినేని అభిమానుల్లో నెలకొంది. అయితే, అఖిల్ నెక్ట్స్ ప్రాజెక్టు కోసం తండ్రి నాగార్జున అక్కినేని భారీగా ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది.

Akhil Akkineni: మాల్దీవ్స్‌లో ప్రత్యక్షమైన ఏజెంట్.. దేనికోసమో?

ఇప్పటికే నాగ్, బాలీవుడ్ స్టార్ ఫిలిం మేకర్ కరణ్ జోహర్‌ను కలిసిన సంగతి ఇండస్ట్రీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. అయితే నాగ్ కరణ్ జోహర్‌ను కలిసింది ఆయన నటిస్తున్న ‘ది ఘోస్ట్’ చిత్రాన్ని ప్రమోట్ చేయడానికి అని పలువురు అన్నారు. కానీ, తాజాగా వస్తున్న వార్తల ప్రకారం.. కరణ్ జోహర్‌తో అఖిల్ అక్కినేని ఓ భారీ పాన్ ఇండియా ప్రాజెక్ట చేయబోతున్నాడని.. ఈ విషయంపై కరణ్ జోహర్‌తో చర్చించేందుకే నాగ్ ఆయన్ను కలిసినట్లుగా తెలుస్తోంది.

Akhil Akkineni: వైజాగ్‌లో ఏజెంట్ క్రేజ్ మామూలుగా లేదుగా!

ఇక ఈ వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇటీవల విజయ్ దేవరకొండ నటించిన ‘లైగర్’ చిత్రాన్ని బాలీవుడ్‌లో రిలీజ్ చేసిన కరణ్ జోహర్, ఇప్పుడు అఖిల్ వంటి స్టైలిష్ స్టార్‌ను పాన్ ఇండియా స్థాయిలో ప్రెజెంట్ చేయనుండటంతో ఈ భారీ ప్రాజెక్టు గురించి అందరూ ఆసక్తిగా చూస్తున్నారు. మరి నిజంగానే, కరణ్ జోహర్ అఖిల్ కోసం భారీ పాన్ ఇండియా ప్రాజెక్టును రెడీ చేస్తున్నాడా.. ఒకవేళ ఇదే నిజమైతే అక్కినేని అభిమానులకు అదిరిపోయే ట్రీట్ అనే చెప్పాలి.