Rajasthan: చేతులు కలిపిన ఇద్దరు బద్ధ శత్రువులు.. రాజస్తాన్‭ రాజకీయాల్లో ఏం జరుగుతోంది?

ఒక్కసారిగా ఇంతటి విచిత్రమైన పరిణామాల్ని చూసిన రాజకీయం పండితులకు ఇదేమి పరిణామమో తేల్చడానికి అంతు చిక్కడం లేదు. పైగా మూడు రోజుల క్రితమే ఓ జాతీయ మీడియాకు ఇంటర్వ్యూ ఇస్తూ సచిన్ పైలట్‭ను పలుమార్లు ద్రోహి అంటూ అశోక్ గెహ్లాట్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఈ విషయమై సొంత పార్టీలోనే పెద్ద ఎత్తున గ్రూప్ వార్ జరిగింది. అప్పుడే వీరిద్దరూ ఇలా కనిపించడం మరింత ఆశ్చర్యానికి లోను చేస్తోంది.

Rajasthan: చేతులు కలిపిన ఇద్దరు బద్ధ శత్రువులు.. రాజస్తాన్‭ రాజకీయాల్లో ఏం జరుగుతోంది?

Ashok Gehlot And Sachin Pilot Stand Together In Rajasthan

Rajasthan: రాజస్తాన్‭లో మంగళవారం అత్యంత ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. మంచి నీళ్లను కూడా పెట్రోల్ తరహాలో మండించే బద్ధ శత్రువులైన ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్, మాజీ ఉప ముఖ్యమంత్రి సచిన్ పైలట్ రాజీకొచ్చారా? అనే ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి. ఇది కేవలం రాజీనే అనకూడదు. ఇద్దరూ ఏకమయ్యాన్నట్లుగానే కనిపించారు. చేతులు కలిపి పైకి ఎత్తుతూ ఐక్యతా చిహ్నాం చూపిస్తూ అభివాదం చేశారు. ఒక్కసారిగా ఇంతటి విచిత్రమైన పరిణామాల్ని చూసిన రాజకీయం పండితులకు ఇదేమి పరిణామమో తేల్చడానికి అంతు చిక్కడం లేదు. పైగా మూడు రోజుల క్రితమే ఓ జాతీయ మీడియాకు ఇంటర్వ్యూ ఇస్తూ సచిన్ పైలట్‭ను పలుమార్లు ద్రోహి అంటూ అశోక్ గెహ్లాట్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఈ విషయమై సొంత పార్టీలోనే పెద్ద ఎత్తున గ్రూప్ వార్ జరిగింది. అప్పుడే వీరిద్దరూ ఇలా కనిపించడం మరింత ఆశ్చర్యానికి లోను చేస్తోంది.

Rahul Gandhi Bharat Jodo Yatra: ఉత్సాహంగా కొన‌సాగుతున్న‌ రాహుల్ గాంధీ భార‌త్ జోడో యాత్ర‌.. (ఫొటోలు)

రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర రాజస్తాన్ రాష్ట్రంలో ప్రవేశిస్తున్న తరుణంలో వీరి కలయిక మరింత ప్రాధాన్యత సంతరించుకుంది. వాస్తవానికి యాత్ర సందర్భంగా పార్టీలో ఐక్యత చూపించడం కోసమే వీరిరువురూ ఇలా కలిసినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. కాగా, ఈ కలయికపై సీఎం గెహ్లాట్ స్పందిస్తూ మా మధ్య ఎన్నున్నా.. మాకు సుప్రీం పార్టీనే. పార్టీ ప్రయోజనాల ముందు మా వివాదాలు చాలా చిన్నవి. పార్టీని మరింత బలోపేతం చేసి, పార్టీలో ఒక కొత్త మెరుపును తీసుకురావాలనే మేము అనుకున్నాం. అదే మా ఈ ఐక్యత. దేశంలో ఉత్కంఠ వాతావరణం నెలకొంది. ఇది మన ముందున్న అతిపెద్ద సవాల్. రాహుల్ గాంధీ లేవనెత్తిన అంశాలకు ప్రజల నుంచి పెద్ద ఎత్తున ఆదరణ లభిస్తోంది’’ అని అన్నారు.

Rowdy Sheeter Sunil: బీజేపీ కార్యక్రమంలో పేరు మోసిన రౌడీ షీటర్.. సమాజ సేవ చేస్తున్నానంటూ స్టేట్‭మెంట్
ఇదే విషయమై సచిన్ పైలట్ స్పందిస్తూ ‘‘రాహుల్ గాంధీని అత్యంత ఉత్సాహంతో అత్యంత బలంతో స్వాగతం పలకుతాం’’ అని అన్నారు. రాహుల్ గాంధీ రాష్ట్రంలో 12 రోజుల పాటు పర్యటించనున్నారు. ఇప్పటికే గెహ్లాట్, పైలట్ వివాదం రాష్ట్ర కాంగ్రెస్‭లో తీవ్ర స్థాయిలో ఉంది. ఇది రాహుల్ యాత్రపై బాగా ప్రభావం చూపుతుందనే విమర్శలు అనేకం ఉన్నాయి. ఈ డ్యామేజీని పూడ్చడానికే ఇరు నేతల మధ్య అధిష్టానం సయోధ్య కుదుర్చిందని అంటున్నారు. రాహుల్ యాత్ర నేపథ్యంలో రాజస్తాన్ కాంగ్రెస్‭లో ఈ ఇద్దరు అగ్రనేతల (గెహ్లాట్-పైలట్) మధ్య ఐక్యత అత్యవసరమైంది.

West Bengal: మెడలో గుచ్చుకున్న త్రిషూలం.. అలాగే 65కి.మీ. ప్రయాణించి ఆసుపత్రి చేరిన వ్యక్తి