West Bengal: మెడలో గుచ్చుకున్న త్రిషూలం.. అలాగే 65కి.మీ. ప్రయాణించి ఆసుపత్రి చేరిన వ్యక్తి

ఆసుపత్రి వర్గాలు తెలిపిన వివరాల ప్రకారం, రోగి ఆదివారం రాత్రి సుమారు 3 గంటలకు ఎన్‌ఆర్‌ఎస్ ఆసుపత్రిలోని అత్యవసర విభాగంలో చేరాడని తెలిసింది. వైద్యులు అతడిని పరీక్షించి 30 సెంటీమీటర్ల పొడవున్న 150 ఏళ్ల నాటి త్రిశూలం నాటి త్రిషూలం మెడలో ఇరుక్కుపోయి ఉన్నట్లు గుర్తించారు. అంతలా గుచ్చుకున్నప్పటికీ రోగి ఎటువంటి అసౌకర్యంగా భావించలేదని వైద్యులు ఆశ్చర్యం వ్యక్తం చేశారు

West Bengal: మెడలో గుచ్చుకున్న త్రిషూలం.. అలాగే 65కి.మీ. ప్రయాణించి ఆసుపత్రి చేరిన వ్యక్తి

Man travels 65 km with 'trishul' stuck in his neck for operation in WB

West Bengal: పశ్చిమ బెంగాల్‌లోని నాడియా ప్రాంతానికి చెందిన ఓ వ్యక్తిని మెడలో త్రిషూలంతో దాదాపు 65 కిలోమీటర్లు ప్రయాణించి ఆసుపత్రిలో చేరాడు. మెడలో త్రిషూలం అంటే, మెడలో వేలాడదీసుకున్న త్రిషూలం కాదు, మెడకు అమాంతంగా గుచ్చుకున్న త్రిషూలంతో. కళ్యాణి నివాసి భాస్కర్ రామ్‭ ఎదుర్కొన్న విపత్కర పరిస్థితి ఇది. అయితే మెడలో త్రిషూలం అమాంతంగా గుచ్చుకున్నప్పటికీ తనకేమీ నొప్పనిపించలేదని అతడు చెప్పడం గమనార్హం.

Hairball: తన వెంట్రులు తానే తినె అలవాటు ఉన్న యువతి.. ఇప్పటికే 3 కిలోలు తిన్నదట.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?

ఆదివారం రాత్రి ఓ వ్యక్తితో భాస్కర్ రామ్‭కు చిన్న వాగ్వాదం జరిగింది. అనంతరం అతడు భాస్కర్ రామ్‭పై త్రిశూలంతో దాడికి దిగాడు. ఆ శూలం భాస్కర్ రామ్‭ మెడ వెనుక భాగంలో గుచ్చుకుంది. ఈ ఘటనను చూసిన బాధితుడి సోదరి ఘటనా స్థలంలోనే అపస్మారక స్థితికి చేరుకుంది. భాస్కర్ మాత్రం మెడలో గుచ్చుకున్న త్రిశూలంతోనే కల్యాణి నుంచి కోల్‌కతాలోని ఎన్‌ఆర్‌ఎస్ మెడికల్ కాలేజీకి (కనీసం 65 కిలోమీటర్లు) వెళ్లాడు.

Gujarat Polls: ఉగ్రవాదంపై కాంగ్రెస్‭ను టార్గెట్ చేసిన మోదీ.. ఇందిరా, రాజీవ్ మరణాన్ని గుర్తు చేస్తూ ఖర్గే కౌంటర్ అటాక్

ఆసుపత్రి వర్గాలు తెలిపిన వివరాల ప్రకారం, రోగి ఆదివారం రాత్రి సుమారు 3 గంటలకు ఎన్‌ఆర్‌ఎస్ ఆసుపత్రిలోని అత్యవసర విభాగంలో చేరాడని తెలిసింది. వైద్యులు అతడిని పరీక్షించి 30 సెంటీమీటర్ల పొడవున్న 150 ఏళ్ల నాటి త్రిశూలం నాటి త్రిషూలం మెడలో ఇరుక్కుపోయి ఉన్నట్లు గుర్తించారు. అంతలా గుచ్చుకున్నప్పటికీ రోగి ఎటువంటి అసౌకర్యంగా భావించలేదని వైద్యులు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. తాము అడిగితే రోగి తనకు ఎలాంటి నొప్పి లేదని చెప్పాడని వైద్యులు వెల్లడించారు. ఇది చూసిన ఎన్‌ఆర్‌ఎస్‌ ఆస్పత్రిలో విధులు నిర్వహిస్తున్న వైద్యులు కాసేపు షాక్‌కు గురయ్యారు.

Coconut Tree: నట్టింట్లో చెట్టును కదలించింకుండా రెండస్తుల నిర్మాణం.. తాత జ్ఞాపకాలను కాపాడటం కోసం కుటుంబం విశిష్ట ప్రయోగం

నొప్పి లేకపోయినప్పటికీ పరిస్థితి తీవ్రతను గ్రహించిన ఎన్‌ఆర్‌ఎస్‌ ఆస్పత్రి అధికారులు.. ప్రత్యేక వైద్యుల బృందాన్ని ఏర్పాటు చేశారు. అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ ప్రణబాశిష్ బెనర్జీ నేతృత్వంలోని నిపుణులైన వైద్యుల బృందంలో డాక్టర్ అర్పితా మహంతి, సుతీర్థ సాహా, డాక్టర్ మధురిమ ఉన్నారు. రోగి మెడలోని త్రిశూలాన్ని తొలగించేందుకు అత్యవసర శస్త్ర చికిత్స చేయాలని ఆస్పత్రి అధికారులు నిర్ణయించారు. ఆ తర్వాత వెంటనే ఈఎన్‌టీ వైద్యుడు ప్రణబాసిస్ బెనర్జీ ఆధ్వర్యంలో శస్త్రచికిత్స ప్రారంభమైంది. అత్యంత నైపుణ్యం కలిగిన వైద్యుల సామర్థ్యంతో, కొన్ని గంటలపాటు సాగిన ఈ అద్భుతమైన శస్త్రచికిత్సలో చివరకు రోగి మెడ నుంచి త్రిశూలాన్ని తొలగించారు. భాస్కర్ కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం, త్రిశూలం తన నివాసంలోని దేవుని బలిపీఠంపై సుమారు 150 ఏళ్ల నుంచి ఉందని.. తరతరాలుగా, భాస్కర్ రామ్ కుటుంబం ఈ పురాణ త్రిశూలాన్ని పూజిస్తుందని తెలిపారు.

Rowdy Sheeter Sunil: బీజేపీ కార్యక్రమంలో పేరు మోసిన రౌడీ షీటర్.. సమాజ సేవ చేస్తున్నానంటూ స్టేట్‭మెంట్