Gujarat Polls: ఉగ్రవాదంపై కాంగ్రెస్‭ను టార్గెట్ చేసిన మోదీ.. ఇందిరా, రాజీవ్ మరణాన్ని గుర్తు చేస్తూ ఖర్గే కౌంటర్ అటాక్

దేశంలో శాంతిని సామరస్యాన్ని నెలకొల్పడానికి మా నాయకుల్ని కూడా కోల్పోయాము. ఇందిరా గాంధీ, రాజీవ్ గాంధీ.. వీరిద్దరూ దేశానికి ప్రధానమంత్రులుగా ఉన్నప్పుడు ఉగ్రవాదుల చేతిలో చనిపోయారు. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా పోరాడుతూ వారు ప్రాణత్యాగం చేశారు. దేశ స్వాతంత్ర్యం కోసం పోరాడిన వారిలో భారతీయ జనతా పార్టీ నుంచి ఒక్కరైనా ఉన్నారేమో చూపించగలరా?

Gujarat Polls: ఉగ్రవాదంపై కాంగ్రెస్‭ను టార్గెట్ చేసిన మోదీ.. ఇందిరా, రాజీవ్ మరణాన్ని గుర్తు చేస్తూ ఖర్గే కౌంటర్ అటాక్

Sacrificed 2 Prime Ministers Fighting Terror: Congress Chief Hits Back At PM Modi

Gujarat Polls: నాటి కాంగ్రెస్ ప్రభుత్వం ఉగ్రవాదులను కాకుండా తనను టార్గెట్ చేసిందంటూ ఎన్నికల ప్రచారంలో వ్యాఖ్యానించిన ప్రధానమంత్రి నరేంద్రమోదీపై కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే కౌంటర్ అటాక్ చేశారు. ఉగ్రవాదంపై కాంగ్రెస్ పార్టీ ఎంతగానో పోరాటం చేసిందని, అలా పోరాటం చేస్తూ ఇద్దరు ప్రధానులను కోల్పోయిందని ఆయన అన్నారు. అంతే కాకుండా, దేశం కోసం కాంగ్రెస్ పార్టీ ఎంతగానో చేసిందని, పార్టీ నేతలు ఎంతో మంది ప్రాణ త్యాగాలు చేశారని అన్న ఆయన.. దేశ స్వాతంత్ర్యం కోసం భారతీయ జనతా పార్టీకి చెందిన ఒక్కరంటే ఒక్కరైనా కనీస పోరాటం చేశారా అని ప్రశ్నించారు.

Thailand: డ్రగ్స్ పరీక్షల్లో అందరికందరూ దొరికిపోయారు.. ఇప్పుడా గుడిలో ఒక్క సన్యాసి కూడా లేరు

గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా ఆదివారం ఖేడాలో నిర్వహించిన ప్రచార ర్యాలీలో మోదీ మాట్లాడుతూ ‘‘బాట్లాహౌస్ ఎన్‌కౌంటర్ వేళ కాంగ్రెస్ పార్టీ నేతలు ఉగ్రవాదులకు మద్దతుగా కన్నీళ్లు కార్చారు. ఉగ్రవాదాన్ని కాంగ్రెస్ పార్టీ ఓటు బ్యాంక్ రాజకీయాలకు వాడుకుంది. అనేక ఇతర పార్టీలు కూడా ఇలాంటి దారుణ చర్యలకు పాల్పడ్డాయి. నేను గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సూరత్, అహ్మదాబాద్‌లో పేలుళ్లు జరిగి ప్రజలు చనిపోతుంటే ఉగ్రవాదాన్ని రూపుమాపాలని నేను కేంద్రాన్ని కోరాను. అయితే కేంద్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం నన్ను టార్గెట్ చేసింది’’ అని అన్నారు.

Online Gambling Bill Row: ఆన్‌లైన్‌ రమ్మీ నిషేధ తీర్మానంపై గవర్నర్ నాన్చిన.. గవర్నర్ పదవే అక్కర్లేదన్న డీఎంకే

కాగా, మంగళవారం నిర్వహించిన ప్రచార ర్యాలీలో ఖర్గే మాట్లాడుతూ ‘‘విదేశీయుల నుంచి ఉగ్రవాదుల నుంచి దేశాన్ని కాపడానికి మేము (కాంగ్రెస్) ఎంతగానో కష్టపడ్డాం. ఎందరి ప్రాణాల్నో కోల్పోయాం. దేశ స్వాతంత్ర్య పోరాటాన్ని ముందుండి నడిపించాం. అక్కడ కూడా అనేక త్యాగాలు చేశాము. దేశంలో శాంతిని సామరస్యాన్ని నెలకొల్పడానికి మా నాయకుల్ని కూడా కోల్పోయాము. ఇందిరా గాంధీ, రాజీవ్ గాంధీ.. వీరిద్దరూ దేశానికి ప్రధానమంత్రులుగా ఉన్నప్పుడు ఉగ్రవాదుల చేతిలో చనిపోయారు. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా పోరాడుతూ వారు ప్రాణత్యాగం చేశారు. దేశ స్వాతంత్ర్యం కోసం పోరాడిన వారిలో భారతీయ జనతా పార్టీ నుంచి ఒక్కరైనా ఉన్నారేమో చూపించగలరా?’’ అని ప్రశ్నించారు.

Kharge to PM: మోదీకి ఏమైనా 100 తలలు ఉన్నాయా? ఖర్గే ఇలా ఎందుకు ప్రశ్నించారంటే..?

182 అసెంబ్లీ స్థానాలున్న గుజరాత్‌లో డిసెంబర్ 1, 5 తేదీల్లో రెండు విడతల్లో ఎన్నికలు జరగనున్నాయి. డిసెంబర్ 8న ఫలితాల్ని కేంద్ర ఎన్నికల సంఘం విడుదల చేస్తుంది. 27 ఏళ్లుగా బీజేపీ అధికారంలో ఉంది. నరేంద్ర మోదీ 2001 నుంచి 2014 వరకూ గుజరాత్ ముఖ్యమంత్రిగా కొనసాగారు. 2017లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ 99 స్థానాల్లో గెలిచి ఆరోసారి అధికారంలోకి వచ్చింది. ఈసారి ఎన్నికల్లో సైతం బీజేపీనే గెలుస్తుందని ఒపీనియన్ పోల్స్ చెప్తున్నాయి.

Delhi: షాకింగ్ ఘటన.. స్టేజిపై ప్రసంగిస్తూ పక్కనున్న వ్యక్తిని చెప్పుతో కొట్టిన మహిళ.. కారణం అదే!