Online Gambling Bill Row: ఆన్‌లైన్‌ రమ్మీ నిషేధ తీర్మానంపై నాన్చుతున్నారని గవర్నర్ పదవే అక్కర్లేదన్న డీఎంకే

ఈ విషయమై తూత్తుకుడిలో నిర్వహించిన ఓ కార్యక్రమంలో ఎంపీ కనిమొళి మాట్లాడుతూ, ఆన్‌లైన్‌ రమ్మీ నిషేధానికి గవర్నర్‌ ఎందుకంత జాప్యం చేస్తున్నారో అర్ధం కావడం లేదని అన్నారు. ఈ క్రీడకు యువత బానిసలవుతున్నారని, డబ్బులు కోల్పోయి బలవన్మరణానికి పాల్పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. భవిష్యత్తులో ఇలా ఎవరైనా ఆత్మహత్యకు పాల్పడితే గవర్నరే బాధ్యత వహించాల్సి వస్తుందని ఎంపీ పేర్కొన్నారు.

Online Gambling Bill Row: ఆన్‌లైన్‌ రమ్మీ నిషేధ తీర్మానంపై నాన్చుతున్నారని గవర్నర్ పదవే అక్కర్లేదన్న డీఎంకే

Governorship is outdated says Kanimozhi

Online Gambling Bill Row: తమిళనాడు రాష్ట్ర గవర్నర్‭పై డీఎంకే తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. అసలు గవర్నర్ పదవే అక్కర్లేదని మండి పడింది. ప్రభుత్వం చేసిన ఓ తీర్మానంపై ఆయన నాన్చుడు ధోరణి అవలంబించడమే దీనికి కారణం. వాస్తవానికి చాలా కాలంగా గవర్నర్‭కు ప్రభుత్వానికి మధ్య సత్సంబంధాలు తెగిపోయాయి. ఇరు వర్గాల మధ్య విబేధాలు బాగా పెరిగిపోయాయి. ప్రభుత్వ పనులను గవర్నర్ అడ్డుకుంటున్నారని అధికార పార్టీ ఆరోపణలు చేస్తుండగా, గవర్నర్ నుంచి వింత సమాధానాలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఏకంగా గవర్నర్ గిరీయే వద్దంటూ డీఎంకే వ్యాఖ్యానించడం గమనార్హం.

Hairball: తన వెంట్రులు తానే తినె అలవాటు ఉన్న యువతి.. ఇప్పటికే 3 కిలోలు తిన్నదట.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?

సోమవారం డీఎంకే నేత, ఎంపీ కనిమోళి మాట్లాడుతూ గవర్నర్‌ పదవి అనవరమని, అది కాలపరిమితి చెందిన పదవి అని అన్నారు. ఆన్‌లైన్‌ రమ్మీని నిషేధిస్తూ రాష్ట్ర శాసనసభలో చేసిన తీర్మానానికి నిర్ణీత కాలంలో గవర్నర్‌ అనుమతించకపోవడంతో తీర్మానం కాలపరిమితి చెందింది. ఈ విషయమై తూత్తుకుడిలో నిర్వహించిన ఓ కార్యక్రమంలో ఎంపీ కనిమొళి మాట్లాడుతూ, ఆన్‌లైన్‌ రమ్మీ నిషేధానికి గవర్నర్‌ ఎందుకంత జాప్యం చేస్తున్నారో అర్ధం కావడం లేదని అన్నారు. ఈ క్రీడకు యువత బానిసలవుతున్నారని, డబ్బులు కోల్పోయి బలవన్మరణానికి పాల్పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. భవిష్యత్తులో ఇలా ఎవరైనా ఆత్మహత్యకు పాల్పడితే గవర్నరే బాధ్యత వహించాల్సి వస్తుందని ఎంపీ పేర్కొన్నారు.

Thailand: డ్రగ్స్ పరీక్షల్లో అందరికందరూ దొరికిపోయారు.. ఇప్పుడా గుడిలో ఒక్క సన్యాసి కూడా లేరు