Hairball: తన వెంట్రులు తానే తినె అలవాటు ఉన్న యువతి.. ఇప్పటికే 3 కిలోలు తిన్నదట.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?

జుట్టు తినడం ప్రాణాంతకంగా మారిన సందర్భాలు కూడా ఉన్నాయి. 2017లో బ్రిటన్‭లోని 16 ఏళ్ల యువతి తన కడుపులో హెయిర్‌బాల్ కారణంగా అనారోగ్యానికి గురై హఠాత్తుగా మరణించింది. వారి స్వంత వెంట్రుకలను తినే అలవాటు ఉన్న వారు తరచుగా రాపుంజెల్ సిండ్రోమ్‌తో బాధపడుతున్నారని, ఇది ట్రైకోఫాగియా అనే మానసిక రుగ్మత వల్ల వస్తుందని అమెరికా నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ పేర్కొంది.

Hairball: తన వెంట్రులు తానే తినె అలవాటు ఉన్న యువతి.. ఇప్పటికే 3 కిలోలు తిన్నదట.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?

Chinese Teen Who Ate 3 Kg Of Her Own Hair

Hairball: ప్రపంచ వ్యాప్తంగా అనేక మందికి విచిత్రమైన అలవాట్లు ఉన్నాయి. అందులో భాగంగా చైనాకు చెందిన 14 ఏళ్ల ఒక యువతికి కూడా ఒక విచిత్రమైన అలవాటు ఉంది. అదేంటంటే, ఆమె జుట్టును ఆమే నమలడం. అప్పుడప్పుడు ఆ జుట్టును మింగుతూ ఉంటుంది కూడా. ఇలా తింటూ తింటూ 3 జుట్టును కడుపులోకి జారవిడిచిందట. దీంతో ఆమె తల బట్టతలలా మారిపోయిందని చైనాకు చెందిన సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్ అనే వార్తా సంస్థ పేర్కొంది.

ఈ పరిస్థితి ఎంతకు దారి తీసిదంటే, కడుపులో జుట్టు పేరుకుపోయి, ఆ యువతి కనీసం ఆహారం తీసుకోలేని పరిస్థితికి వచ్చింది. పరిస్థితి విషమంగా ఉండడంతో ఆసుపత్రికి తరలించారు. మొత్తానికి ఆమె కడుపులో పేరుకుపోయిన మూడు కిలోల హెయిర్‌బాల్‌ను వైద్యులు తొలగించారు. షాంగ్సీ ప్రావిన్స్‭కు చెందిన పికా అనే యువతికి ఎదుర్కొన్న విచిత్ర సంఘటన ఇది.

Chicken Crowing Complaint : కోడి కూత కూస్తుందని పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు.. యజమానిపై కేసు నమోదు

తల్లిదండ్రుల ఉద్యోగం కారణంగా సదరు యువతి వారికి దూరంగా తాత, నాయనమ్మల వద్ద పెరిగిందట. అయితే యువతి అలవాటును వారు గమనించలేదని తెలిసింది. చిన్న తనంలో అలవాటైన ఈ రుగ్మత. కాలక్రమంలో ఇలా పెరిగి పెద్దదైందట. పికాకు వైద్యం చేసిన జియాన్ డాక్సింగ్ హాస్పిటల్‌ వైద్యుడు గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్ షి హై మాట్లాడుతూ కొందరు మురికి పదార్థాలు, కాగితం, మట్టి వంటి వస్తువులను బలవంతంగానైనా సరే తినే అలవాటు ఉంటుందని పేర్కొన్నారు.

జుట్టు తినడం ప్రాణాంతకంగా మారిన సందర్భాలు కూడా ఉన్నాయి. 2017లో బ్రిటన్‭లోని 16 ఏళ్ల యువతి తన కడుపులో హెయిర్‌బాల్ కారణంగా అనారోగ్యానికి గురై హఠాత్తుగా మరణించింది. వారి స్వంత వెంట్రుకలను తినే అలవాటు ఉన్న వారు తరచుగా రాపుంజెల్ సిండ్రోమ్‌తో బాధపడుతున్నారని, ఇది ట్రైకోఫాగియా అనే మానసిక రుగ్మత వల్ల వస్తుందని అమెరికా నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ పేర్కొంది.

YS Sharmila: షర్మిల పాదయాత్రకు తెలంగాణ హైకోర్టు అనుమతి.. వైఎస్.విజయమ్మను అడ్డుకున్న పోలీసులు