Thailand: డ్రగ్స్ పరీక్షల్లో అందరికందరూ దొరికిపోయారు.. ఇప్పుడా గుడిలో ఒక్క సన్యాసి కూడా లేరు

మధ్య థాయిలాండ్‭లోని ఫెట్చాబున్ రాష్ట్రం, బంగ్ సామ్ ఫాన్ అనే జిల్లాలోని ఒక ఆలయంలో ఉన్న ఒక మఠాధిపతి సహా నలుగురు సన్యాసులపై సోమవారం డ్రగ్స్ పరీక్ష చేశారు. ఈ పరీక్షలో మెథాంఫేటమిన్‌ పాజిటివ్ అని తేలినట్లు బంగ్ సామ్ ఫాన్ జిల్లా అధికారి బూన్‌లెర్ట్ థింటాప్తై తెలిపారు. మాదకద్రవ్యాల నుంచి బయట పడేయడం కోసం వారిని ఆసుపత్రికి పంపినట్లు ఆ అధికారి తెలిపారు.

Thailand: డ్రగ్స్ పరీక్షల్లో అందరికందరూ దొరికిపోయారు.. ఇప్పుడా గుడిలో ఒక్క సన్యాసి కూడా లేరు

Temple in Thailand has no monks after all fail drug test

Thailand: థాయిలాండ్‭లో ఉన్న ఒక బౌద్ధ దేవాలయంలో ప్రస్తుతం ఒక్కరంటే ఒక్క సన్యాసి కూడా లేరట. కారణం, ఆ గుడిలోని సన్యాసులందరూ డ్రగ్స్ పరీక్షల్లో పాజిటివ్ అని తెలిసి డీఫ్రాక్ చేశారని స్థానిక అధికారి ఒకరు తెలిపినట్లు ఒక అంతర్జాతీయ మీడియా సంస్థ పేర్కొంది. డీఫ్రాకింగ్ అంటే సదరు మంత్రిత్వ శాఖ విధులను నిర్వర్తించడం కోసం నియమించిన వారిని, ఆ పదవుల నుంచి తొలగించడం.

మధ్య థాయిలాండ్‭లోని ఫెట్చాబున్ రాష్ట్రం, బంగ్ సామ్ ఫాన్ అనే జిల్లాలోని ఒక ఆలయంలో ఉన్న ఒక మఠాధిపతి సహా నలుగురు సన్యాసులపై సోమవారం డ్రగ్స్ పరీక్ష చేశారు. ఈ పరీక్షలో మెథాంఫేటమిన్‌ పాజిటివ్ అని తేలినట్లు బంగ్ సామ్ ఫాన్ జిల్లా అధికారి బూన్‌లెర్ట్ థింటాప్తై తెలిపారు. మాదకద్రవ్యాల నుంచి బయట పడేయడం కోసం వారిని ఆసుపత్రికి పంపినట్లు ఆ అధికారి తెలిపారు.

Hairball: తన వెంట్రులు తానే తినె అలవాటు ఉన్న యువతి.. ఇప్పటికే 3 కిలోలు తిన్నదట.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?

“ఆలయంలో ఇప్పుడు సన్యాసులు ఎవరూ లేరు. ప్రస్తుతం ఖాళీగా ఉంది. అయితే ఆలయానికి సమీపంలోని గ్రామాల్లో ఉన్న వారు, ఎటువంటి పూజలు చేయలేకపోవడంపై ఆందోళన చెందుతున్నారు. అయితే తొందరలోనే ఆలయానికి కొత్త సన్యాసులను నియమిస్తాం” అని బూన్‌లెర్ట్ థింటాప్తై అన్నారు. సన్యాసులకు ఆహారాన్ని దానం చేయడం గొప్పగా భావిస్తారని, అయితే ప్రస్తుతం వారిని డ్రగ్స్ నుంచి విముక్తి చేయడం కూడా అంతే గొప్ప పనిగా భావిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు.

మయన్మార్ నుంచి లావోస్ వచ్చే మెథాంఫేటమిన్‭కు ప్రధాన రవాణా మార్గం థాయిలాండ్. ఇక్కడి నుంచే వివిధ ప్రాంతాలకు డ్రగ్స్ సరఫరా జరుగుతుందని డ్రగ్స్ అండ్ క్రైమ్‌పై ఐక్యరాజ్యసమితి కార్యాలయం ఓ సందర్భంలో పేర్కొంది. కేవలం అర డాలర్‭ (థాయ్‭లాండ్ కరెన్సీలో 20 బట్లు) కంటే తక్కువ ధరకే మెథాంఫేటమిన్‭ పిల్స్ దొరుకుతాయట.

The Kashmir Files : నిజాన్ని ఒప్పుకోలేకపోతే నోరు మూసుకుని కూర్చోండి.. అనుపమ్!