Delhi: షాకింగ్ ఘటన.. స్టేజిపై ప్రసంగిస్తూ పక్కనున్న వ్యక్తిని చెప్పుతో కొట్టిన మహిళ.. కారణం అదే!

మహిళల రక్షణ కోసం ఏర్పాటు చేసిన ఒక సభలో ఒక మహిళ ప్రసంగిస్తోంది. ఆ పక్కనే ఇద్దరు వ్యక్తులు నిలబడి ఉన్నారు. అంతలోపే ఆ మహిళ తన ప్రసంగాన్ని ఆపేసి, పక్కనున్న ఒక వ్యక్తిని చెప్పుతో కొట్టింది.

Delhi: షాకింగ్ ఘటన.. స్టేజిపై ప్రసంగిస్తూ పక్కనున్న వ్యక్తిని చెప్పుతో కొట్టిన మహిళ.. కారణం అదే!

Delhi: దేశ రాజధాని ఢిల్లీలో స్టేజిపై షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. ఒక మహిళ స్టేజిపై ప్రసంగిస్తూ, పక్కనున్న వ్యక్తిని ఉన్నట్లుండి చెప్పుతో కొట్టింది. ఈ ఘటన సోమవారం జరిగింది. ఇటీవల శ్రద్ధా వాకర్ దారుణ హత్యకు గురైన సంగతి తెలిసిందే. ఆమెతోపాటు అలాంటి బాధిత మహిళలకు న్యాయం చేయాలని, మహిళలకు అండగా నిలవాలని కోరుతూ ఢిల్లీలోని ఛత్తర్ పూర్ ప్రాంతంలో సోమవారం ఒక సభ ఏర్పాటు చేశారు.

Twitter: ట్విట్టర్ బ్లూటిక్ అకౌంట్ల రీవెరిఫికేషన్.. ఈ వారమే ప్రారంభిస్తామంటున్న ఎలన్ మస్క్

‘హిందూ ఏక్తా మంచ్’ ఆధ్వర్యంలో.. ‘భేటీ బచావో’ పేరుతో ఈ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ఒక మహిళ స్టేజిపై ప్రసంగిస్తోంది. ఆమెకు రెండు పక్కలా ఇద్దరు వ్యక్తులు నిల్చున్నారు. వాళ్లే ఆ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో కొద్దిసేపు ప్రసంగించిన మహిళ తన పక్కనున్న వ్యక్తిని తోసేసి, చెప్పు తీసి అతడిపై దాడి చేసింది. షాక్‌కు గురైన చుట్టుపక్కల వాళ్లు తేరుకుని, ఆమెను ఆపేందుకు ప్రయత్నించినా ఆమె ఆగలేదు. చెప్పుతో కొడుతూనే ఉంది. ఈ ఘటనతో అక్కడున్న వాళ్లంతా షాక్‌కు గురయ్యారు. తన పక్కన నిలబడ్డ ఆ వ్యక్తి తనను ఇబ్బంది పెడుతూ, పక్కకు తోసేసేందుకు ప్రయత్నించాడని, మైక్ లాక్కునేందుకు చూశాడని.. అందుకే అతడిని చెప్పుతో కొట్టానని ఆ మహిళ చెప్పింది.

కాగా, ఈ ఘటనపై ఎలాంటి ఫిర్యాదు రాలేదని పోలీసులు తెలిపారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.