Delhi Woman: మహిళను ఎత్తుకెళ్లి ఐదుగురి సామూహిక అత్యాచారం.. ఢిల్లీలో మరో నిర్భయ తరహా ఘటన

ఢిల్లీ పరిధిలోని ఘజియాబాద్‌లో మరో నిర్భయ తరహా ఘటన జరిగింది. 40 ఏళ్ల మహిళను కారులో ఎత్తుకెళ్లిన ఐదుగురు వ్యక్తులు ఆమెపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. దాదాపు రెండు రోజులపాటు అత్యాచారం చేశారు. అనంతరం రోడ్డుపై వదిలేసి వెళ్లిపోయారు.

Delhi Woman: మహిళను ఎత్తుకెళ్లి ఐదుగురి సామూహిక అత్యాచారం.. ఢిల్లీలో మరో నిర్భయ తరహా ఘటన

Delhi Woman: ఢిల్లీ పరిధిలో దారుణం జరిగింది. నిర్భయ తరహాలో మరో అత్యాచార ఘటన వెలుగు చూసింది. బస్టాండ్‌లో నిలబడ్డ మహిళను ఐదుగురు వ్యక్తులు ఎత్తుకెళ్లి, కారులో సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ ఘటనకు సంబంధించిన వివరాల్ని పోలీసులు వెల్లడించారు.

Solar Eclipse: ఈ నగరాల్లోనే సూర్యగ్రహణం.. హైదరాబాద్‌లో కనిపిస్తుందా? ఈసారి మిస్సైతే మళ్లీ పదేళ్ల తర్వాతే!

ఈ నెల 16న ఘజియాబాద్‌లో బస్టాప్ దగ్గర రిక్షా కోసం ఎదురు చూస్తున్న 40 ఏళ్ల మహిళను ఐదుగురు వ్యక్తులు కిడ్నాప్ చేశారు. తమ ఎస్‌యూవీ వాహనంలో ఎత్తుకెళ్లి ఆమెపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. దాదాపు రెండు రోజులపాటు అత్యాచారం చేశారు. ఆమె మర్మాంగంలో ఇనుప రాడ్ ఉంచారు. తీవ్రంగా హింసించారు. రెండు రోజుల తర్వాత తీవ్ర గాయాలతో ఉన్న ఆమెను కాళ్లు, చేతులు కట్టేసి ఆశ్రమ్ ప్రాంతంలోని ఒక రోడ్డు పక్కన వదిలేశారు. స్థానికులు బాధిత మహిళను గమనించి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు అక్కడికి చేరుకుని ఆమెను స్థానిక ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు. నిందితుల్ని దినూ, షారుఖ్, జావేద్, దోలా, ఔరంగజేబ్‌గా గుర్తించారు.

Pawan Kalyan : మంగళగిరి ఆఫీసులో కార్యకర్తలతో పవన్ మీటింగ్..

వీరిలో నలుగురిని ఇప్పటికే పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మరొకరి కోసం గాలిస్తున్నారు. ప్రస్తుతం మహిళ పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. ఈ ఘటనపై ఢిల్లీ మహిళా కమిషన్ చైర్‍పర్సన్ స్వాతి మాలివాల్ స్పందించారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసుల్ని కోరారు. కాగా, ఈ దారుణానికి తెగబడింది బాధిత మహిళ కుటుంబానికి తెలిసిన వాళ్లే అని పోలీసులు తెలిపారు. నిందితుల తరఫు వారికి, బాధిత కుటుంబానికి సంబంధించి ఆస్తి విషయంలో తగాదాలున్నాయని, ఈ క్రమంలో నిందితులు ఈ ఘటనకు పాల్పడ్డారని పోలీసులు తెలిపారు. నిందితుల వివరాల్ని బాధిత మహిళ చెప్పినట్లు పోలీసులు తెలిపారు.