Solar Eclipse: ఈ నగరాల్లోనే సూర్యగ్రహణం.. హైదరాబాద్‌లో కనిపిస్తుందా? ఈసారి మిస్సైతే మళ్లీ పదేళ్ల తర్వాతే!

ఈ నెల 25, మంగళవారం రోజు దేశంలో పాక్షిక సూర్య గ్రహణం ఏర్పడబోతుంది. దీనికి చాలా ప్రత్యేకత ఉంది. ఎందుకంటే ఈ సారి మిస్సైతే, తిరిగి దేశంలో సూర్య గ్రహణం కనిపించేది 2032లోనే.

Solar Eclipse: ఈ నగరాల్లోనే సూర్యగ్రహణం.. హైదరాబాద్‌లో కనిపిస్తుందా? ఈసారి మిస్సైతే మళ్లీ పదేళ్ల తర్వాతే!

Solar Eclipse: ఈ నెల 25, మంగళవారం రోజు సూర్య గ్రహణం ఏర్పడనున్న సంగతి తెలిసిందే. ఈ సారి సూర్య గ్రహణం చాలా ప్రత్యేకమనే చెప్పాలి. ఎందుకంటే ఈ సారి మిస్సైతే మళ్లీ సూర్య గ్రహణం చూడాలంటే పదేళ్ల వరకు ఆగాల్సిందే. తిరిగి 2032లోనే దేశంలో సూర్యగ్రహణం కనిపిస్తుంది.

Pawan Kalyan : మంగళగిరి ఆఫీసులో కార్యకర్తలతో పవన్ మీటింగ్..

అందుకే ఈ సారి తప్పనిసరిగా సూర్యగ్రహణాన్ని చూడాలని చాలా మంది అనుకుంటున్నారు. అయితే, ఈ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ ఏడాది సూర్య గ్రహణం దాదాపు 1.45 గంటలపాటు ఉంటుంది. ప్రపంచంలోని అనేక దేశాల ప్రజలతోపాటు, ఖగోళ శాస్త్రవేత్తలు కూడా దీనికోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. మన దేశంలోని అనేక ప్రాంతాల్లో సూర్యగ్రహణం పాక్షికంగా కనిపిస్తుంది. కొన్ని చోట్ల నిమిషాలపాటు మాత్రమే ఉంటే, ఇంకొన్ని చోట్ల దాదాపు గంటపాటు సూర్య గ్రహణం కనిపిస్తుంది. దేశ రాజధాని ఢిల్లీతోపాటు, హైదరాబాద్, కోల్‌కతా, పోర్‌బందర్, గాంధీ నగర్, ముంబై, సూరత్, పనాజీ, ఇంఫాల్, ఈటానగర్, అండమాన్-నికోబార్ దీవులు, ఐజ్వాల్, దిబ్రూగర్, కోహిమా, సిల్చార్ వంటి పట్టణాల్లోనూ సూర్య గ్రహణాన్ని చూడొచ్చు.

Pawan kalyan : మొదటి భార్యకి 5 కోట్లు ఇచ్చాను, రెండో భార్యకి ఆస్తి ఇచ్చాను.. మూడు పెళ్లిళ్లపై స్పందించిన పవన్..

దేశంలో ఎక్కువసేపు సూర్య గ్రహణం కనిపించేది మాత్రం గుజరాత్‌లోని ద్వారకలోనే. న్యూఢిల్లీలో మంగళవారం సాయంత్రం 4.29 గంటలకు సూర్య గ్రహణం కనిపిస్తుంది. సాయత్రం దాదాపు ఐదున్నర గంటల వరకు చూడొచ్చు. హైదరాబాద్‌లో సాయంత్రం 4.59 గంటలకు ప్రారంభమై, 49 నిమిషాల పాటు సూర్య గ్రహణం కనిపిస్తుంది. అది కూడా పాక్షిక సూర్య గ్రహణమే అని గుర్తుంచుకోవాలి. ఈసారి మిస్సైతే తిరిగి సూర్య గ్రహణాన్ని చూసేది నవంబర్ 3, 2032లోనే. మధ్యలో మార్చి 29, 2025లో సూర్య గ్రహణం కనిపించినప్పటికీ మన దేశంలో చూసే అవకాశం లేదు.