Hyderabad: హైదరాబాద్‌లో అగ్ని ప్రమాదం.. సిలిండర్లు పేలి అంటుకున్న మంటలు

హకీంపేటలో ఆదివారం సిలిండర్లు పేలి మంటలు అంటుకున్నాయి. హకీంపేటలో సాలార్‌జంగ్ బ్రిడ్జి ఏరియాలో వెల్డింగ్ వర్క్ జరుగుతోంది. ఈ పనులు జరుగుతుండగా వెల్డింగ్ షాపునకు చెందిన 5 సిలిండర్లు ఒక్కసారిగా పేలిపోయాయి.

Hyderabad: హైదరాబాద్‌లో అగ్ని ప్రమాదం.. సిలిండర్లు పేలి అంటుకున్న మంటలు

Hyderabad: సికింద్రాబాద్‌లోని రాంగోపాల్ పేటలో జరిగిన అగ్ని ప్రమాద ఘటన మరువక ముందే హైదరాబాద్‌లో మరో అగ్నిప్రమాదం జరిగింది. హకీంపేటలో ఆదివారం సిలిండర్లు పేలి మంటలు అంటుకున్నాయి. హకీంపేటలో సాలార్‌జంగ్ బ్రిడ్జి ఏరియాలో వెల్డింగ్ వర్క్ జరుగుతోంది.

Shraddha Walkar: శ్రద్ధా వాకర్ హత్య కేసు.. 3000 పేజీల ఛార్జిషీటు సిద్ధం చేసిన పోలీసులు

ఈ పనులు జరుగుతుండగా వెల్డింగ్ షాపునకు చెందిన 5 సిలిండర్లు ఒక్కసారిగా పేలిపోయాయి. భారీ శబ్దంతో పేలి పోవడంతో మంటలు చెలరేగాయి. ఈ ఘటనతో చుట్టుపక్కల ప్రజలు భయాందోళనకు గురై, పరుగులు తీశారు. స్థానికుల సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది ఫైర్ ఇంజిన్ల సాయంతో మంటలను ఆర్పేందుకు ప్రయత్నిస్తున్నారు. మంటలు చుట్టుపక్కల షాపులకు వ్యాపించకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. కాగా, ఈ ఘటనపై అనేక అనుమానాలు తలెత్తుతున్నాయి. పెద్ద సిలిండర్ల నుంచి గ్యాస్ చిన్ని సిలిండర్లలోకి అక్రమంగా నింపుతున్న సమయంలోనే ఈ పేలుడు సంభవించి ఉండొచ్చని అధికారులు అనుమానిస్తున్నారు.

California Shooting: క్యాలిఫోర్నియాలో దుండగుడి కాల్పులు.. పది మంది మృతి?

ఘటనలో ముందుగా రెండు సిలిండర్లు పేలాయి. దీంతో జాగ్రత్త పడ్డ స్థానికులు ఈ ఘటనను తమ మొబైల్స్‌లో చిత్రీకరిస్తున్నారు. ఈ క్రమంలో మరోసారి పేలుడు సంభవించింది. మరో మూడు సిలిండర్లు కూడా పేలిపోయాయి. ప్రస్తుతం మంటలు చాలా వరకు అదుపులోకి వచ్చినట్లు తెలుస్తోంది. తాజా సమాచారం ప్రకారం.. ఈ ఘటనలో ఎవరూ గాయపడలేదని తెలుస్తోంది. ఫైర్ సేఫ్టీ అధికారులు ఈ ఘటనపై విచారణ జరుపుతున్నారు.