Shraddha Walkar: శ్రద్ధా వాకర్ హత్య కేసు.. 3000 పేజీల ఛార్జిషీటు సిద్ధం చేసిన పోలీసులు

ఈ విచారణకు సంబంధించి ఢిల్లీ పోలీసులు 3,000 పేజీల ఛార్జిషీటు సిద్ధం చేశారు. ఛార్జిషీటులో కీలక విషయాల్ని పొందు పరిచారు. విచారణలో భాగంగా దాదాపు 100 మంది సాక్షుల వాంగ్మూలం తీసుకున్నట్లు ప్రస్తావించారు. అలాగే ఫోరెన్సిక్ నివేదిక, ఎలక్ట్రానిక్, సైంటిఫిక్ ఆధారాల్ని కూడా ఛార్జిషీటులో పోలీసులు పొందుపరిచారు.

Shraddha Walkar: శ్రద్ధా వాకర్ హత్య కేసు.. 3000 పేజీల ఛార్జిషీటు సిద్ధం చేసిన పోలీసులు

Shraddha Walkar: గత ఏడాది ఢిల్లీలో సంచలనం సృష్టించిన శ్రద్ధా వాకర్ హత్య కేసు విచారణ తుది దశకు చేరుకుంది. ఈ కేసులో పోలీసులు విచారణ దాదాపు పూర్తి చేశారు. ఈ విచారణకు సంబంధించి ఢిల్లీ పోలీసులు 3,000 పేజీల ఛార్జిషీటు సిద్ధం చేశారు. ఛార్జిషీటులో కీలక విషయాల్ని పొందు పరిచారు.

Bharat Jodo Yatra: జమ్ముకశ్మీర్‌లో భారీ భద్రత మధ్య రాహుల్ భారత్ జోడో యాత్ర ..

విచారణలో భాగంగా దాదాపు 100 మంది సాక్షుల వాంగ్మూలం తీసుకున్నట్లు ప్రస్తావించారు. అలాగే ఫోరెన్సిక్ నివేదిక, ఎలక్ట్రానిక్, సైంటిఫిక్ ఆధారాల్ని కూడా ఛార్జిషీటులో పోలీసులు పొందుపరిచారు. శ్రద్ధ హత్య తర్వాత పోలీసులు ఢిల్లీ పరిసర ప్రాంతాల్లో సేకరించిన ఎముకలు శ్రద్ధావేనని డీఎన్ఏ పరీక్ష ద్వారా తేలినట్లు పోలీసులు తెలిపారు. ఈ వివరాలు అన్నింటితో కూడిన ఛార్జిషీటును ఈ నెల చివరి వారంలో కోర్టుకు సమర్పించే అవకాశం ఉంది. ప్రస్తుతం ఈ ఛార్జిషీటుకు సంబంధించిన అంశాల్ని న్యాయ నిపుణులు పరిశీలిస్తున్నారు. శ్రద్ధా వాకర్, ఆమె ప్రియుడు ఆఫ్తాద్ పూనావాలా కొన్నేళ్లుగా సహజీవనం చేశారు. దీనికి శ్రద్ధ తండ్రి నిరాకరించాడు. ఢిల్లీలోని ఛాతర్‌పూర్ ప్రాంతంలో శ్రద్ధ-ఆఫ్తాబ్ అద్దె ఇంట్లో కలిసుండే వాళ్లు.

IAS Smita Sabharwal : ఐఏఎస్ అధికారిణి స్మితా సబర్వాల్ ఇంట్లోకి అర్ధరాత్రి చొరబడ్డ డిప్యూటీ తహసీల్దార్

ఈ క్రమంలో గత ఏడాది మే 18నశ్రద్దా వాకర్‌ను ఆఫ్తాద్ పూనావాలా హత్య చేశాడు. అనంతరం ఆమె శరీర భాగాల్ని ముక్కలుముక్కలుగా నరికాడు. వాటిని రోజులవారీగా ఢిల్లీ పరిసరాల్లో పడేశాడు. కొద్ది రోజుల తర్వాత ఈ హత్య విషయం వెలుగు చూసింది. శ్రద్ధా వాకర్ తండ్రి ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరిపారు. ఈ ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఆఫ్తాబ్‌ను అదుపులోకి తీసుకున్న పోలీసులు అన్ని కోణాల్లో విచారణ జరిపారు. పాలీగ్రాఫ్ టెస్ట్, నార్కో అనాలసిస్ టెస్ట్ నిర్వహించారు.