Fishermen Eat Dolphin : యమునా నదిలో డాల్ఫిన్…పట్టుకొని తిన్న మత్స్యకారులు

యమునా నది వరదల్లో కొట్టుకు వచ్చిన డాల్ఫిన్ ను పట్టుకొని వండి తిన్న నలుగురు మత్స్యకారులపై పోలీసులు కేసు నమోదు చేశారు. యమునా నదిలో చేపల వేటకు వెళ్లిన నలుగురు మత్స్యకారులకు డాల్ఫిన్ చేప చిక్కింది....

Fishermen Eat Dolphin : యమునా నదిలో డాల్ఫిన్…పట్టుకొని తిన్న మత్స్యకారులు

Fishermen Eat Dolphin

Fishermen Eat Dolphin : యమునా నది వరదల్లో కొట్టుకు వచ్చిన డాల్ఫిన్ ను పట్టుకొని వండి తిన్న నలుగురు మత్స్యకారులపై పోలీసులు కేసు నమోదు చేశారు. యమునా నదిలో చేపల వేటకు వెళ్లిన నలుగురు మత్స్యకారులకు డాల్ఫిన్ చేప చిక్కింది. వలలో చిక్కిన డాల్ఫిన్ ను మత్స్యకారులు భుజంపై మోసుకొని ఇంటికి తీసుకువెళ్లారు. మత్స్యకారులు డాల్ఫిన్ ను వండుకు తిన్నారనే వార్త వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. (Accidentally Catching It From Yamuna)

Madhya Pradesh : లోకాయుక్తకు రెడ్ హ్యాండెడ్‌గా దొరికిన అధికారి…లంచం డబ్బు నమిలి మింగేశాడు

ఈ వీడియో చూసిన పోలీసులు మత్స్యకారులపై కేసు నమోదు చేసి, నిందితుల్లో ఒకరిని అరెస్టు చేశారు. నసీర్‌పూర్ గ్రామానికి చెందిన నలుగురు మత్స్యకారులు జులై 22వతేదీ ఉదయం యమునా నదిలో చేపలు పడుతుండగా డాల్ఫిన్ వలలో చిక్కుకుందని పిప్రి ఎస్‌హెచ్‌ఓ శ్రవణ్ కుమార్ సింగ్ చెప్పారు. డాల్ఫిన్ ను వండుకుతిన్న మత్స్యకారులపై ఫారెస్ట్ రేంజర్ రవీంద్రకుమార్ ఇచ్చిన ఫిర్యాదు మేర పోలీసులు కేసు నమోదు చేశారు. (Fishermen Eat Dolphin)

Indian married woman Anju : పాక్ వెళ్లిన నా కుమార్తె మానసిక క్షోభకు గురైంది… అంజూ తండ్రి వెల్లడి

కొంత మంది బాటసారులు మత్స్యకారులు డాల్ఫిన్ ను తీసుకువెళుతుండగా వీడియో తీశారని పోలీసులు చెప్పారు. అటవీశాఖ అధికారి ఫిర్యాదు మేరకు రంజీత్ కుమార్, సంజయ్, దీవన్, బాబాలపై వన్యప్రాణి సంరక్షణ చట్టం (1972) కింద కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. రంజిత్ కుమార్‌ను అరెస్టు చేసి విచారిస్తున్నామని, మిగిలిన నిందితులను పట్టుకునేందుకు ప్రయత్నాలు కొనసాగుతున్నాయని పోలీసులు తెలిపారు.