Girl Rape : నాకే శిక్ష వేస్తావా అంటూ ..జడ్జి మీదకు చెప్పు విసిరిన రేపిస్టు..
రేప్ కేసులో రేపిస్టుకు న్యాయమూర్తి జీవితఖైదు శిక్ష విధించారు. ఈ శిక్ష తట్టుకోలేని సదరు రేపిస్టు జడ్జిమీదకు చెప్పు విసిరాడు.

5 Years Girl Rape Case And Threw Slippers On Judge
5 years girl rape case and threw slippers on judge :ఓ చిన్నారి జీవితాన్ని ఛిదిమేసి..అత్యంత పాశవికంగా గొంతు నులిమి చంపేసిన కామాంధుడికి న్యాయమూర్తి జీవిత ఖైదు శిక్ష విధించారు. ఆ శిక్ష తీర్పుని తట్టుకోలేకపోయిన సదరు నేరస్థుడు జడ్జిమీదకు తన కాలి చెప్పు విసిరిన గటన మద్యప్రదేశ్ కోర్టులో చోటుచేసుకుంది. న్యాయమూర్తి విధించిన శిక్షను భరించలేక సదరు దోసి జడ్జి వైపు చెప్పు విసిరాడు. కానీ అది గురి తప్పి..జడ్జిపై కాకుండా సాక్షుల బోను వద్ద పడింది.
Read more : China Covid : చైనాలో అమానవీయం..కోవిడ్ నిబంధనలు ఉల్లంఘించినందుకు వీధుల్లో నడిపించారు
మధ్యప్రదేశ్‌కు చెందిన సుజిత్ సాకేత్ అనే 27 ఏళ్ల యువకుడు 2021 ఏప్రిల్ 30న ఆడుకుంటున్న ఐదేళ్ల చిన్నారికి చాక్లెట్ కొనిస్తానని చెప్పి తీసుకెళ్లి అత్యాచారానికి ఒడిగట్టాడు. బాలికను నిర్మానుష్యంగా ఉన్న ప్రదేశానికి తీసుకువెళ్లి, అత్యాచారం చేశాడు. తరువాత తన చేసిన పని బయటపడకుండా..ఆ చిన్నారి పీక నులిమి చంపేశాడు. పొట్టకూటి కోసం వేరే ప్రాంతం నుంచి అక్కడికి వలస వచ్చిన ఓ పేద కూలి బిడ్డ ఆ చిన్నారి.
బిడ్డ కనిపించట్లేదని ఆవేదనతో ఆ చిన్నారి తల్లిదండ్రులు హజీరా పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయటంతో పిల్లల రక్షణ (పోక్సో) చట్టం కింద కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. చిన్నారి కోసం వెతగ్గా ఓ చోట చనిపోయి పడి ఉంది. ఈ విచారణలో పోలీసులు ఆధారాలను సేకరించి కోర్టుకు సమర్పించారు. ఈ కేసు విచారించిన పోక్సో కోర్టు జడ్జి పి.ఎస్.కాలా 26మంది సాక్షుల వాంగ్ములాలను పరిగణాలోకి తీసుకున్నారు. అనంతరం సదరు ముద్దాయే దోషి అని తేల్చారు. అనంతరం దోషికి బుధవారం (డిసెంబర్ 29,2021) సుజిత్ సాకేత్ కు జీవితాంతం జైలుశిక్ష విధించారు. చనిపోయేవరకు జైలులోనే ఉండాలని తీర్పు వెల్లడించారు. దీంతో ఆ శిక్షను భరించలేక దోషి సుజిత్ సాకేత్ జడ్జిమీదకు చెప్పు విసిరాడు.
Read more : Vizag Beach : బీచ్‌కు వచ్చారా..తాట తీస్తాం..పోలీసుల వార్నింగ్