China Covid : చైనాలో అమానవీయం..కోవిడ్ నిబంధనలు ఉల్లంఘించినందుకు వీధుల్లో నడిపించారు

అగ్రరాజ్యం హోదా కోసం అమెరికాతో పోటీ పడుతూ...ప్రపంచ సూపర్ పవర్‌గా ఎదిగేందుకు తహతహలాడుతున్న ఘనత వహించిన చైనా ఈ అమానవీయమైన శిక్ష అమలుచేసింది...

China Covid : చైనాలో అమానవీయం..కోవిడ్ నిబంధనలు ఉల్లంఘించినందుకు వీధుల్లో నడిపించారు

China Covid

Covid Rule Breaking In China : PPE కిట్లు లాంటివి వేసుకున్న నలుగురు వ్యక్తులను అలాంటి డ్రెస్సుల్లోనే ఉన్న కొంతమంది వీధుల్లో నడిపించుకుంటూ వెళ్తున్నారు. ఆ నలుగురూ నిండైన డ్రెస్‌తో ఉన్నారు కాబట్టి.. వారెవరో ప్రపంచ ప్రజలందరికీ తెలిసేలా.. వారి ఫొటో, పేరు వారి చేతుల్లోనే ఉంచి.. వీధుల వెంట తిప్పుతున్నారు. పెద్ద సంఖ్యలో గుమికూడిన జనం ఆ తతంగాన్నంతా కన్నార్పకుండా చూస్తున్నారు. సహజంగా గ్రామాల్లో ఊరిపెద్దలు ఇలాంటి శిక్షలు అమలుచేస్తుంటారు. చట్టాలతో పనిలేకుండా ఇలాంటి ఆటవిక శిక్షలు విధిస్తుంటారు. కానీ ఇది జరిగింది గ్రామాల్లో కాదు.. అసలు మన దేశంలోనే కాదు….అమలుచేసింది….నిరక్ష్యరాస్యుడైన ఏ ఊరిపెద్దో…ఆలోచనా శక్తి లేని కులపెద్దో కాదు….అగ్రరాజ్యం హోదా కోసం అమెరికాతో పోటీ పడుతూ…ప్రపంచ సూపర్ పవర్‌గా ఎదిగేందుకు తహతహలాడుతున్న ఘనత వహించిన చైనా ఈ అమానవీయమైన శిక్ష అమలుచేసింది.

Read More : Muhammad ali jinnah tower : గుంటూరులో జిన్నా టవర్ పేరు మార్చాలి : సోము వీర్రాజు

ఇంతకీ బాధితులు చేసిన తప్పేంటీ ? కోవిడ్ నియమాలను ఉల్లంఘించడం. కరోనా కారణంగా సరిహద్దులు మూసివేసి ఉన్నప్పటికీ…అక్రమంగా కొందరు దేశంలోకి రావడానికి సహకరించారన్నది నలుగురు బాధితులపై చైనా చేస్తున్న ఆరోపణ. ఇంత చిన్న నేరానికి అంత పెద్ద శిక్ష అమలుచేసి..దేశంలో మానవహక్కుల హననం ఏ స్థాయిలో జరుగుతోందో..తనంత తానుగా ప్రపంచానికి చాటిచెప్పింది డ్రాగన్. పబ్లిక్ షేమింగ్ పేరుతో ఈ నెల 28న అమలు చేసిన శిక్షపై ఇప్పుడు సోషల్ మీడియాతో పాటు ప్రపంచ మీడియా దుమ్మెత్తిపోస్తోంది.

Read More : Ratan Tata Birthday : కప్‌ సైజ్ కేక్‌..చిన్న క్యాండిల్..సింపుల్‌గా రతన్ టాటా బర్త్‌డే వేడుక

చైనా, వియత్నాం సరిహద్దులకు దగ్గరగా ఉన్న జింగ్‌జీలో ఈ దారుణం జరిగింది. కరోనా కేసులు జీరో స్థాయికి చేర్చేందుకు ఈ ప్రాంతంలో కఠిన ఆంక్షలు అమలుచేస్తున్న సంగతి తెలిసిందే. క్రమశిక్షణా చర్యల్లో భాగంగా…ఈ ఆగస్టులో పబ్లిక్ షేమింగ్‌ అమలుచేయనున్నట్టు ప్రకటించారు. కరోనా నిబంధనలు అతిక్రమించినవారికి అందరిముందు అవమానం అనే ఈ శిక్ష అమలుచేస్తామని హెచ్చరించారు. చెప్పినట్టుగానే నలుగురు బాధితులకు అవమానకర శిక్ష అమలుచేశారు. మాస్క్, ఫేస్‌పీల్డ్, నిండైన డ్రెస్‌ ధరించిన నిందితులు…తమ పేరు, ఫొటోను చేతిలో పట్టుకుని ముందుకు నడిచారు.

Read More : Funny Video: ఆఖరి మెట్టుపై ఓటమి అంటే ఇదేనేమో? అభినందనీయం!

ఒక్కో బాధితుడిని…చేతిలో ఆయుధాలతో ఉన్న ఇద్దరు ఆర్మీ సిబ్బంది గట్టిగా పట్టుకుని ముందుకు తీసుకెళ్లారు. వీధుల్లో వేలాదిగా గుమికూడిన జనం ముందు వారు నడుచుకుంటూ వెళ్లారు. ఈ ఘటనను ఖండిస్తున్నట్టు కమ్యూనిస్టు పార్టీకి చెందిన బీజింగ్ న్యూస్ ప్రకటించింది. కరోనా కట్టడి చేయాలన్న ఒత్తిడి జింగ్‌జీపై ఎక్కువగా ఉన్నప్పటికీ.. ఈ చర్య చట్టాలకు వ్యతిరేకమని, మరోసారి ఇలాంటి చర్యలను సహించబోమని తెలిపింది. చైనా ప్రభుత్వం తక్షణమే ఇలాంటి ఘటనలకు వ్యతిరేకంగా కఠిన చర్యలు చేపట్టాలని మానవ హక్కులు సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.