Muhammad ali jinnah tower : గుంటూరులో జిన్నా టవర్ పేరు మార్చాలి : సోము వీర్రాజు

గుంటూరులోని మహ్మద్ అలీ జిన్నా టవర్ పేరు మార్చాలని ఏపీ బీజేపీ సోము వీర్రాజు డిమాండ్ చేశారు.

Muhammad ali jinnah tower : గుంటూరులో జిన్నా టవర్ పేరు మార్చాలి :  సోము వీర్రాజు

Guntur Muhammad Ali Jinnah Tower

Guntur Muhammad ali jinnah tower :  కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆజాది కా అమృత్ మహోత్సవ్ లో భాగంగా ఆనాటి స్వతంత్ర్య సమరయోధులను స్మరిస్తూ నివాళి అర్పిస్తోంది.  ఈ సందర్భంగా గుంటూరులో జిన్నా టవర్ విషయంలో బీజేపీ నేతలు మండిపడుతున్నారు. జిన్నా టవర్ పేరు మార్చాలని ఏపీ బీజేపీ నేత సోము వీర్రాజు డిమాండ్ చేస్తే..మొత్తం టవరే కూల్చేయాలని తెలంగాణ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ పిలుపునిచ్చారు. అఖండ భారతాన్ని ముక్కలు చేసి పాకిస్థాన్ దేశం కోసం కృషి చేసి.. జిన్నా భారతదేశ విభజనకు కారణమైన జిన్నా టవర్ పేరు మార్చాలని సోము వీర్రాజు డిమాండ్ చేశారు.

Read more : Jinnah Tower in Guntur: గుంటూరులోని జిన్నా టవర్‌ను కూల్చేయాలి..లేదంటే మేమే ఆ పనిచేస్తాం: బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్

పాకిస్తాన్ విభజనకు మహ్మద్ అలీ జిన్నా ఆలోచనలు..ఆయన మనస్తత్వమే కారణమని..దేశవిభజన సమయంలో అనేక మంది భారతీయులు ఊచకొతకు గురయ్యారని..ఈరోజు కూడా భారత్-పాకిస్తాన్ దేశాల మధ్య విభేధాలు కొనసాగుతునే ఉన్నాయని అన్నారు. భారతదేశంలో ఆయన ఒక్క ప్రవృత్తి మూలంగా ఇవాల్టికి కూడా పాకిస్తాన్ భారతదేశాన్ని శత్రుదేశంగా భావిస్తోందనీ..అటువంటి జిన్నా పేరును గుంటూరు సెంటర్ కు ఉంచడం భావ్యం కాదని సోము అన్నారు. టవర్ కు జిన్నా పేరు తీసివేసి అబ్దుల్ కలాం పేరు గానీ లేదా గుంటూరు జిల్లాలోని ప్రముఖుల పేర్లు లేదా..స్వతంత్ర్య పోరాటంలో పాల్గొన్న పోరాట యోధుల పేర్లు పెట్టాలని బిజెపి డిమాండ్ చేస్తోంది. దేశ విరుధ్ధంగా సెంటర్లుగా ఉన్న పేర్లను మార్చాలని బిజెపి డిమాండ్ చేస్తోందని అన్నారు.

అలాగే బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ కూడా భారతదేశాన్ని విడదీసిన జిన్నా పేరుతో ఉన్న టవర్ ను కూల్చేయాలని అన్నారు. జిన్నా భారతదేశానికి చాలా ద్రోహం చేశారని..అటువంటి దేశద్రోహి అలీజిన్నా పేరు టవర్‌కు ఎందుకు పెట్టారు? అని ప్రశ్నించారు. దేశద్రోహి మహ్మద్ అలీ జిన్నా పేరుతో ఉన్న టవర్ ను ఏపీ ప్రభుత్వం వెంటనే జిన్నా పేరుని తొలగించాలి అని డిమాండ్ చేశారు. జిన్నా టవర్‌ పేరు అబ్దుల్‌ కలాం టవర్‌గా మార్చాలి..లేదంటే బీజేపీ కార్యకర్తలే టవర్‌ను కూల్చేస్తారిన రాజాసింగ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.

Red more : Weed sale made him Millionaire: జాబ్ వదిలేసి “మరిజువానా” సాగుతో కోట్లు సంపాదిస్తున్న యువకుడు

పాకిస్థాన్ జాతిపిత మహ్మద్ అలీ జిన్నా పేరుతో గుంటూరు నగరంలో ఉన్న చారిత్రాత్మక కట్టడం ఉంది. ఈ కట్టడం గుంటూరు నగరంలోని మహాత్మా గాంధీ వీధిలో ఉంది. ఇది శాంతి, సామరస్యాలకు చిహ్నంగా నిర్మించబడింది. ఈ టవర్ ఆరు స్థంబాలమీద నిర్మించబడింది. పైన గుమ్మటపు డోమ్ ఉంటుంది. ఈ టవర్ 12వ శతాబ్దానికి చెందిన ముస్లిం నిర్మాణ శైలిలో ఉంటుంది.