Jinnah Tower in Guntur: గుంటూరులోని జిన్నా టవర్‌ను కూల్చేయాలి..లేదంటే మేమే ఆ పనిచేస్తాం: బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్

గుంటూరులోని మహ్మద్ అలీజిన్నా టవర్‌ను కూల్చేయాలని అని లేదంటే బీజేపీ కార్యకర్తలే ఆ పని చేస్తారని బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ వివాదాస్పద పిలుపినిచ్చారు.

Jinnah Tower in Guntur: గుంటూరులోని జిన్నా టవర్‌ను కూల్చేయాలి..లేదంటే మేమే ఆ పనిచేస్తాం: బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్

Jinnah Tower In Guntur

bjp mla raja singh controversial remarks.. Jinnah Tower in Guntur : బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ మరో వివాదానికి తెరలేపారు. వివాదాస్పద వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచే రాజాసింగ్ మరో వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఏపీలోని గుంటూరులోని పాకిస్థాన్ జాతిపిత మహ్మద్ అలీ జిన్నా టవర్‌ను కూల్చేయాలని రాజాసింగ్ పిలుపునిచ్చారు. భారతదేశాన్ని విడదీసిన జిల్లా పేరుతో ఉన్న జిన్నా టవర్ ను కూల్చేయాలన్నారు రాజాసింగ్. అలీ జిన్నా భారతదేశానికి చాలా ద్రోహం చేశారని..అటువంటి దేశద్రోహి అలీజిన్నా పేరు టవర్‌కు ఎందుకు పెట్టారు? అని ప్రశ్నించారు.

Read more : 21 years Marriage Age Act : పెళ్లికి 21 ఏళ్ల నిబంధన..కొత్త చట్టం వస్తే బాలికల భద్రత,రక్షణ సమస్యే : ముస్లిం పెద్దలు

దేశద్రోహి మహ్మద్ అలీ జిన్నా పేరుతో ఉన్న టవర్ ను ఏపీ ప్రభుత్వం వెంటనే జిన్నా పేరుని తొలగించాలి అని డిమాండ్ చేశారు. జిన్నా టవర్‌ పేరు అబ్దుల్‌ కలాం టవర్‌గా మార్చాలి
లేదంటే బీజేపీ కార్యకర్తలే టవర్‌ను కూల్చేస్తారిన రాజాసింగ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.

కాగా గుంటూరు నగరంలోని ప్రముఖ వ్యాపార కూడలిలో పాకిస్తాన్ జాతిపిత పేరుతో స్తూపం నిర్మించారు. మొహమ్మద్ అలీ జిన్నా పేరుతో నిర్మించిన ఈ టవర్ ఒక సెంటర్‌గా గుంటూరు నగరంలో విశేషంగా కనిపిస్తుంది. ఏడు దశాబ్దాలు దాటినా నేటికీ జిన్నా టవర్ సెంటర్ ఆ నగరంలో మత సామరస్యానికి నిదర్శనంగా కనిపిస్తుంది. అటువంటి జిన్నా టవర్ ను కూల్చేయాలని లేదంటే బీజేపీ కార్యకర్తలు ఆ టవర్ ని కూల్చేస్తారని రాజాసింగ్ సంచలన..అత్యంత వివాదాస్ప వ్యాఖ్యలు చేశారు.

Read more : Vizag Beach New Year : బీచ్‌‌కు వచ్చారా..తాట తీస్తాం..పోలీసుల వార్నింగ్

స్వతంత్రానికి పూర్వమే…గుంటూరులో జిన్నా టవర్ స్థాపన
భారత స్వతంత్ర సంగ్రామ ఉద్యమంలో మహమ్మద్ ఆలీ జిన్నా పాత్ర గురించి అందరికీ తెలిసిందే. వృత్తిరీత్యా జిన్నా అడ్వకేట్. జాతీయ కాంగ్రెస్ నేతృత్వంలో భారత్ స్వతంత్ర్య ఉద్యమంలో పాల్గొన్నారు జిన్నా.. తర్వాత ముస్లింలీగ్ స్థాపించారు. లండన్ వెళ్లి న్యాయవాదవృత్తిలో గడిపిన జిన్నా 1934లో తిరిగి ఇండియాకు వచ్చారు. 1942 నాటికి గుంటూరు నుంచి ఎస్.ఎం.లాల్ జాన్ బాషా(కొన్నేళ్ల కిందట రోడ్డు ప్రమాదంలో మరణించిన తెలుగుదేశం నేత లాల్ బాషా తాత) ఎమ్మెల్యేగా పని చేశారు. ఉమ్మడి మద్రాస్ ప్రెసిడెన్సీకి ఆయన రెండుసార్లు ప్రాతినిధ్యం వహించారు.

లాల్ జాన్ బాషా పేరుతోనే ప్రస్తుతం గుంటూరులో లాలాపేట ఉంది. స్వతంత్ర పోరాటంలో భాగంగా క్విట్ ఇండియా ఉద్యమం ఉధృతంగా సాగుతున్న సమయంలో మొహమ్మద్ ఆలీ జిన్నాతో గుంటూరులో భారీ సభ నిర్వహించాలని లాల్ జాన్ బాషా ప్రయత్నం చేశారు. స్వయంగా జిన్నాను ఆహ్వానించేందుకు గుంటూరుకి చెందిన కొందమంది ప్రతినిధులు బొంబాయి వెళ్లి ఆయన్ని ఆహ్వానించారు. వారి ఆహ్వానాన్ని జిన్నా అంగీకరించారు. దీంతో గుంటూరులో జిన్నా వస్తున్నారే సంతోషంతో కోసం భారీ ఏర్పాట్లు చేశారు.

Read more : Telangana Corona : థర్డ్ వేవ్‌‌కు సంకేతం ఇదే…అప్రమత్తంగా ఉండాలి

ప్రస్తుతం జిన్నా టవర్ సెంటర్ లో జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన వారితో సభ నిర్వహణ చేశారు. కానీ జిన్నా తాను రాలేకపోతున్నానంటూ చివరి నిమిషంలో జిన్నా సమాచారం అందించారు.ఆయన స్థానంలో జిన్నా సన్నిహితుడు జుదా లియాఖత్ అలీఖాన్ ఈ సభకు హాజరయ్యారు. సభలో స్వాతంత్ర్య సమరయోధులు కొండా వెంకటప్పయ్య పంతులు, కాశీనాథుని నాగేశ్వర రావు, ఉన్నవ లక్ష్మీనారాయణ, కల్లూరి చంద్రమౌళి సహా పలువురు పాల్గొన్నట్టు రికార్డులు చెబుతున్నాయి. అలా భారతదేశానికి స్వాతంత్ర్యం రాక ముందే 1942 నుంచి 45 మధ్యలో ఈ టవర్ పనులు జరిగాయి. 1945 నుంచి ఈ టవర్ నిర్మాణంతో అది జిన్నా టవర్ సెంటర్ గా మారింది. కానీ జిన్నా టవర్ పై వివాదాలు కొత్తేమీ కాదు. ఈక్రమంలో  బీజేపీ జిన్నా టవర్ ను మరోసారి తెరపైకి తెచ్చింది. ఆ టవర్ కూల్చేయాలని బీజేపీ డిమాండ్ చేస్తోంది.