21 years Marriage Age Act : పెళ్లికి 21 ఏళ్ల నిబంధన..కొత్త చట్టం వస్తే బాలికల భద్రత,రక్షణ సమస్యే : ముస్లిం పెద్దలు

కేంద్రం అమ్మాయిలకు వివాహం వయస్సు 21 ఏళ్లు నిబంధనతో వివాహాల సంఖ్య భారీగాపెరుగుతోంది. ఈకొత్త చట్టం వస్తే..అమ్మాయిల భద్రత..రక్షణ సమస్య అవుతుందని ముస్లింపెద్దలు అభిప్రాయపడుతున్నారు.

21 years Marriage Age Act : పెళ్లికి 21 ఏళ్ల నిబంధన..కొత్త చట్టం వస్తే బాలికల భద్రత,రక్షణ సమస్యే : ముస్లిం పెద్దలు

Hyderabad Rush For Nikahs To Beat Marriage Bill Curbs

Rush For Nikahs To Beat Marriage Bill Curbs In HyD : ఆడపిల్లకు పెళ్లి చేయాలంటే..21 ఏళ్లు ఉండాల్సిందేనని కేంద్ర ప్రభుత్వం తేల్చి చెబుతోంది. దీని కోసం కొత్త చట్టం కూడా తీసుకురాబోతోంది. ఈ క్రమంలో ఇప్పటికే తమ అమ్మాయిలకు వివాహాలు కుదుర్చుకున్నవారు హడావిడిగా పెళ్లి చేసేస్తున్నారు..మూడు ముళ్లు వేయించేస్తున్నారు. ఈ చట్టం అమలులోకి వస్తే 21 ఏళ్లు పూర్తి కాకుండా ఆడపిల్లకు వివాహం చేయకూడదు. ఒకవేళ చేసినా అది చెల్లదు. కాబట్టి చాలామంది తల్లిదండ్రులు తమ అమ్మాయిలకు అప్పటికే వివాహాలు కుదుర్చుకుని ఉన్నవారు..లేదా మరో ఏడాదిలో వివాహం చేయాలనుకున్నవారు హడావిడగా పెళ్లి చేసేస్తున్నారు. ఈక్రమంలో హైదరాబాద్ లో నే పాతబస్తీలో ముస్లిం కుటుంబాల వారు తమ ఆడపిల్లలకు పెళ్లిళ్లు చేసేయటానికి తొందరపడుతున్నారు. దాంట్లో భాగంగానే కేంద్రం 21 ఏళ్ల వివాహ నిబంధన ప్రకటన చేసినప్పనుంచి పాతబస్తీలో వివాహాలు జోరందుకున్నాయి. అలా డజన్ల కొద్దీ వివాహాలు హడావిడిగానే జరిగిపోతున్నాయి.

Read more : Marriage Age: కేంద్రం సంచలన నిర్ణయం.. అమ్మాయిలకు పెళ్లి చేయాలంటే 21ఏళ్లు దాటాల్సిందే!

కాగా ఈ కొత్త వివాహం చట్టం వల్ల ఆడపిల్లల భద్రత..రక్షణ పరంగా సమస్యలు ఏర్పడతాయని ముస్లిం మత పెద్దలు అంటున్నారు. అలాగే ఈ కొత్త వివాహ చట్టంతో ముస్లిం వ్యక్తిగత చట్టంలో జోక్యం చేసుకోవడమేనని అంటున్నారు ముస్లిం మతపెద్దలు.ఇదిలా ఉంటే ఈ కొత్త వివాహ చట్టం ప్రభావం హైదరాబాద్ లోని పాతబస్తీలోని ముస్లిం కుటుంబాలపై బాగానే పడింది. తమ కుమార్తెలకు పెళ్లిళ్లు చేసేయటానికి తల్లిదండ్రులు హడావిడి పడుతుననారు. దీంతో పాతబస్తీలోని మసీదులు బాలికల వివాహాలతో బిజీబిజీగా మారిపోయాయి.

Read more : SriLanka New Marriage act : స్థానికులను పెళ్లి చేసుకోవాలంటే..రక్షణశాఖ అనుమతి తప్పనిసరి

బాల్య వివాహాల చట్టం సవరణ బిల్లును కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్ లో ప్రవేశ పెట్టడం తెలిసిందే. భారత వివాహ చట్టంలో ఇప్పటి వరకు 18 ఏళ్లు నిండితే బాలికలకు చట్టపరంగా వివాహానికి అర్హత ఉంది. అలాగే అబ్బాయిల వివాహ వయస్సు 21 ఏళ్లుగా ఉంది. ఈక్రమంలో కేంద్ర ప్రభుత్వం అమ్మాయిలు..అబ్బాయిలకు ఒకే వివాహ వయస్సు ఉండాలని భావిచింది. దీంతో ఆడపిల్లలకు వివాహ అర్హతను 21 ఏళ్లకు పెంచే ప్రతిపాదనను ఈసరికొత్త బిల్లులో కేంద్ర ప్రభుత్వం పొందుపరిచింది. ఈ బిల్లను చట్టంగా మార్చాలని బీజేపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇది చట్ట సభల ఆమోదం పొంది చట్టంగా మారి అమల్లోకి వస్తే 21ఏళ్లలోపు బాలికలకు వివాహం చేస్తే అది నేరంగా పరిగణించబడుతుంది. దీంతో ఇప్పటికే వివాహాలు నిర్ణయించుకున్నవారు..వచ్చే ఏడాదిగానీ..ఆ పై ఏడాదిగాని తమ ఆడపిల్లలకు పెళ్లి చేయాలనుకున్నవారు కూడా ఈ చట్టం అమలులోకి రాకుండానే వివాహం చేసేయటానికి త్వరపడుతున్నారు. దీంతో హడావిడిగా పెళ్లిళ్లు చేసేస్తున్నారు.

Read more : Marriage Age : 18 ఏళ్లకే ఓటేస్తున్నారు..అదే వ‌య‌స్సులో పెళ్లి ఎందుకు చేసుకోకూడదు..?

ఇదిలా ఉంటే ముస్లింలు మాత్రం ఈ కొత్త చట్టాన్ని వ్యతిరేకిస్తున్నారు. ప్రభుత్వం ఈ కొత్త చట్టం అన్ని మతాలకూ అమలు చేసే అవకాశం ఉందని భావిస్తున్నారు. అలా చేస్తే ముస్లిం కుటుంబాలకు అది ఇబ్బందిగా మారుతుందని భావిస్తు..కొన్ని ముస్లిం కుటుంబాలు ముందే వివాహాల తంతు చేసేస్తున్నారు. మరో రెండేళ్ల తర్వాత వివాహం జరిపించే ఆలోచన ఉన్నవారు కూడా కేంద్రం ప్రభుత్వం ఈ కొత్త బిల్లును దృష్టిలో పెట్టుకుని వీలైనంత త్వరలో నిఖాలు జరిపించేయాలని హడావిడి పడుతున్నారు.దీనికి నిదర్శనం పాతబస్తీలో వివాహాలు భారీ సంఖ్యలో జరిగిపోవటమే..

Read more : Marriage Age: 21 ఏళ్ల పెళ్లి వయస్సు..బిల్లు పాస్ అయ్యేలోపు హడావిడిగా వందలాది పెళ్ళిళ్లు..

ఆర్థిక స్తోమత లేని ముస్లిం కుటుంబాలవారు ఎంత త్వరగా తమ బిడ్డలకు వివాహం చేసేద్దామా అనే హడావిడిలోనే ఉన్నారు. అలా గత కొన్ని రోజులుగా పాతబస్తీలో ప్రతీ రోజు పదుల కొద్దీ వివాహాలు జరిగిపోతున్నాయి. కాగా ఈ కొత్త వివాహం నిబంధన బిల్లుపై అమరత్ ఈ మిలాత్ ఇస్లామియా తెలంగాణ, ఏపీ రాష్ట్రాల అధ్యక్షుడు పాషా అభ్యంతరం వ్యక్తం చేశారు. దీన్ని ముస్లిం పర్సనల్ లాలో జోక్యం చేసుకోవడమేనన్నారు. ఇస్లాంలో యుక్త వయసులోకి అడుగుపెడితే బాలిక వివాహం చేసుకోవడానికి అర్హురాలేనని తెలిపారు. కొత్త చట్టం అమల్లోకి వస్తే బాలికల భద్రత, రక్షణ పరంగా సమస్యలు ఏర్పడతాయని పేర్కొన్నారు.

Read more : Marriage Age: 21 ఏళ్ల పెళ్లి వయస్సు..బిల్లు పాస్ అయ్యేలోపు హడావిడిగా వందలాది పెళ్ళిళ్లు..

 

పెళ్లికి 21 ఏళ్ల నిబంధన : కొత్త చట్టం వస్తే బాలికల భద్రత సమస్యే.. : ముస్లిం పెద్ద వ్యాఖ్యలు