Marriage Age : 18 ఏళ్లకే ఓటేస్తున్నారు..అదే వ‌య‌స్సులో పెళ్లి ఎందుకు చేసుకోకూడదు..?

18 ఏళ్లకే ఓటేస్తున్నారుగా..అదే వ‌య‌స్సులో పెళ్లి ఎందుకు చేసుకోకూడదు..?అంటూ కేంద్రం యువతుల వివాహం వయస్సు 18 నుంచి 21 పెంపు నిర్ణయంపై ప్రశ్నించారు స‌మాజ్ వాదీ ఎంపీలు.

Marriage Age : 18 ఏళ్లకే ఓటేస్తున్నారు..అదే వ‌య‌స్సులో పెళ్లి ఎందుకు చేసుకోకూడదు..?

Marriage Age In India

Marriage Age in India : భారత్ లో అమ్మాయిలకు పెళ్లి వయస్సును ప్రభుత్వం పెంచిన విషయం తెలిసిందే. గతంలో క‌నీస వివాహ వ‌య‌సు 18 ఏండ్లుగా ఉండేది. దీన్ని 18 నుంచి 21 ఏళ్లకు పెంచాల‌ని కేంద్ర క్యాబినెట్ ఆమోదం తెలిపిన విషయం కూడా తెలిసిందే. దీనికి సంబంధించి బిల్లు ప్రభుత్వం ఇప్పటికే సిద్ధం చేసి పార్ల‌మెంట్ ఆమోద‌ముద్ర వేయించ‌టానికి రెడీ చేసింది. కానీ ప్రభుత్వం తీసుకున్న ఈ కీలక నిర్ణ‌యాన్ని స‌మాజ్ వాదీ పార్టీ నేత సయ్యద్‌ తుఫైల్‌ హసన్ వ్య‌తిరేకించారు. అమ్మాయి వివాహ విషయంలో వయస్సు పెంచే ప్రతిపాదనను త‌ప్పుబ‌ట్టారు.

ఈ సందర్భంగా ఎంపీ సయ్యద్‌ తుఫైల్‌ హసన్ మాట్లాడుతూ.. ‘అమ్మాయిలకు పునరుత్పత్తి వయసు రాగానే పెళ్లి చేయాలని..యువతుల పునరుత్పత్తి వయస్సు 16-17 సంవత్సరాల నుండి 30 సంవత్సరాల వరకు ఉంటుంది. 16 ఏళ్ల వయసు నుంచే పెళ్లి ప్రతిపాదనలు చేస్తుంటారు. కానీ వివాహం ఆలస్యమైతే.. రెండు న‌ష్టాలు ఉన్నాయని తెలిపారు. వాటిలో మొదటిది..సంతానోత్పత్తి భయం. అంటే వారికి వివాహం అయి..పిల్లలు పుట్టే అవకాశం తక్కువగా ఉండొచ్చు 2. త‌ల్లిదండ్రులు వృద్ధాప్యానికి వ‌చ్చే వరకు స్థిరపడలేరు.

Read more : Marriage Age: కేంద్రం సంచలన నిర్ణయం.. అమ్మాయిలకు పెళ్లి చేయాలంటే 21ఏళ్లు దాటాల్సిందే!

పెళ్లి ఆలస్యంగా చేసుకుంటే..వారి త‌ల్లిదండ్రులు వృద్దాప్యానికి వ‌చ్చేవ‌ర‌కు పిల్లలు ఇంకా చదువుతునే ఉంటారు. ఇలా చేస్తే..సహజ చక్రాన్ని విచ్ఛిన్నం చేస్తున్నట్లేనని..అమ్మాయికి పునరుత్పత్తి వయస్సు రాగానే వివాహం చేసుకోవాలని..18 ఏళ్లకే ఓటు వేయ‌గా లేనిది.. 18 ఏళ్ల‌కే పెళ్లి ఎందుకు చేసుకోకూడదు? ” అని ఆయన ప్ర‌శ్నించారు.

మరో స‌మాజ్‌వాది పార్టీ సీనియ‌ర్ నేత.. ఎంపీ ష‌ఫీకుర్ రెహ‌మాన్ బ‌ర్క్ కూడా దాదాపు ఇటువంటి అభిప్రాయం వ్యక్తం చేశారు. కేంద్ర తీసుకున్న నిర్ణ‌యాన్ని తీవ్రంగా త‌ప్పుపడుతు..భార‌త్ చాలా పేద దేశ‌మ‌ని..ప్ర‌తి త‌ల్లీతండ్రీ త‌మ బిడ్డ‌ల‌కు తొంద‌ర‌గానే వివాహం చేయాల‌ని కోరుకుంటార‌ని అన్నారు. మ‌హిళ‌ల‌ వివాహ వ‌య‌సు పెంపున‌కు సంబంధించిన బిల్లును పార్ల‌మెంటులో ప్ర‌వేశ‌పెడితే మేం వ్యతిరేకిస్తామని దానికి మేం మ‌ద్ద‌తు ఇవ్వ‌మని స్పష్టంచేశారు.

Read more : IAMC in Hyderabad : హైద‌రాబాద్‌లో దేశంలోనే తొలి ఐఏఎంసీ.. ప్రారంభించిన సీజే ఎన్వీ రమణ, సీఎం కేసీఆర్

కానీ సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ ఈ వ్యాఖ్యలకు మాత్రం దూరంగా ఉన్నారనే చెప్పాలి. మా పార్టీది అభ్యుదయవాదమని, మహిళలు, బాలికల సంక్షేమం కోసం ఎన్నో పథకాలు ప్రారంభించామని అఖిలేష్ అన్నారు. ఇటువంటి ప్రకటనలతో సమాజ్‌వాదీ పార్టీకి ఎటువంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. కాగా ప్రస్తుతం యువకుల కనీస వివాహ వయస్సు 21 ఏళ్లుగా ఉండగా..యువతులకు 18 ఏళ్లుగా ఉంది. ఈ క్రమంలో కేంద్రం యువతుల వివాహం వయస్సును 21 ఏళ్లకు పెంచాలని నిర్ణయిచింది.