Marriage Age: కేంద్రం సంచలన నిర్ణయం.. అమ్మాయిలకు పెళ్లి చేయాలంటే 21ఏళ్లు దాటాల్సిందే!

భారత్‌లో 18ఏళ్లలోపు అమ్మాయిలకు పెళ్లి చేయకూడదని ఇప్పటివరకు చట్టాలు ఉన్నాయి.

Marriage Age: కేంద్రం సంచలన నిర్ణయం.. అమ్మాయిలకు పెళ్లి చేయాలంటే 21ఏళ్లు దాటాల్సిందే!

Marriage Age

Marriage Age: భారత్‌లో 18ఏళ్లలోపు అమ్మాయిలకు పెళ్లి చేయకూడదని ఇప్పటివరకు చట్టాలు ఉన్నాయి. అయితే ఈ వివాహ కనీస వయసును పెంచుతూ కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. భారత్‌లో వివాహం చేసుకోవాలంటే చట్టప్రకారం అమ్మాయికి కనీసం 18 ఏళ్లు ఉండాలి. అబ్బాయికి 21 ఏళ్లు నిండాలి ఇప్పటివరకు.

ఒక్క భారత్‌లోనే కాదు, ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాల్లో కనీస వివాహ వయసు అబ్బాయిలకు, అమ్మాయిలకు వేరువేరుగా ఉంది. అయితే, ఇప్పుడు ఆ చట్టంలో కీలక మార్పులకు ఆమోదం తెలిపింది కేంద్ర కేబినెట్. ఇకపై పెళ్లి చేసుకోవాలంటే, అమ్మాయిల కనీస వయసు 21ఏళ్లకు మించాలి. ఇంతకుముందు అబ్బాయిలకు మాత్రమే 21ఏళ్లు నిండితే పెళ్లి చేసేవారు.

“మాతృత్వ వయస్సు, MMR(తల్లి మరణాల రేటు), పోషకాహారం మెరుగు వంటి అంశాలను దృష్టిలో పెట్టుకుని ఏర్పాటు చేసిన సమతా పార్టీ మాజీ ఛైర్మన్ జయా జైట్లీ నేతృత్వంలో కేంద్ర మహిళా శిశు సంక్షేమ శాఖ ఒక కమిటీని ఏర్పాటుచేసింది. ఈ కమిటీ మంత్రిత్వ శాఖతోపాటు నీతీఆయోగ్‌కు ఈమేరకు నివేదిక సమర్పించింది. ఆ నివేదిక ప్రకారమే కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది.

18ఏళ్లకే పెళ్లి కావడం వల్ల వచ్చే ఆరోగ్య సమస్యలు, పోషకాహార లోపం నుంచి అమ్మాయిలను కాపాడాల్సిన అవసరం ఉందని అందుకు పెళ్లి చేసే వయస్సు పెంచాలని కేబినెట్ నిర్ణయం తీసుకుంది, ఈ నిర్ణయంతో ఆర్థికంగా, సామాజికంగా, ఆరోగ్యపరంగా ఆడపిల్లలపై సానుకూల ప్రభావం చూపుతుందని టాస్క్‌ఫోర్స్‌ అభిప్రాయపడింది. త్వరలోనే బాల్య వివాహాల నిరోధక చట్టం, ప్రత్యేక వివాహ చట్టం, హిందూ వివాహ చట్టాల్లో ఇందుకోసం సవరణలు తీసుకురానుంది కేంద్రం.