IAMC in Hyderabad : హైద‌రాబాద్‌లో దేశంలోనే తొలి ఐఏఎంసీ.. ప్రారంభించిన సీజే ఎన్వీ రమణ, సీఎం కేసీఆర్

దేశంలోనే తొలి ఐఏఎంసీ హైద‌రాబాద్‌లోని నానక్ రామ్గూడలో ఏర్పాటైంది. ఇంటర్నేషనల్ ఆర్బిట్రేషన్ అండ్ మీడియేషన్ సెంటర్ (ఐఏఎంసీ)ను సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ,CM KCR ప్రారంభించారు

IAMC in Hyderabad : హైద‌రాబాద్‌లో దేశంలోనే తొలి ఐఏఎంసీ.. ప్రారంభించిన సీజే ఎన్వీ రమణ, సీఎం కేసీఆర్

Iamc In Hyderabad

inauguration of IAMC in Hyderabad Nanak RamGuda : దేశంలోనే తొలి ఐఏఎంసీ హైద‌రాబాద్‌లోని నానక్ రామ్ గూడలో ఏర్పాటైంది. నానక్‌రామ్‌గూడ‌లోని ఫోనిక్స్ వీకే టవర్స్‌లో 25 వేల చ‌ద‌ర‌పు అడుగుల‌లో ఏర్పాటు చేసిన‌ ఇంటర్నేషనల్ ఆర్బిట్రేషన్ అండ్ మీడియేషన్ సెంటర్ (ఐఏఎంసీ)ను సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ, సీఎం కేసీఆర్ కలిసి ప్రారంభించారు. సీఎం కేసీఆర్ చేతుల మీదుగా ఐఏఎంసీ వెబ్‌సైట్ ఆవిష్క‌రించారు. ఈ సంద‌ర్బంగా ఐఏఎంసీ కేంద్రాన్నిసీజేఐకు అప్ప‌గించారు. ప్ర‌స్తుతం తాత్కాలిక భ‌వ‌నంలో ఐఏఎంసీ ఏర్పాటు అవుతోంది. ఐఏఎంసీ శాశ్వ‌త భ‌వ‌నం కోసం భూకేటాయింపులు పూర్త‌య్యాయి.

Read more : Cyber Fraud Hyderabad : వ్యాలెట్‌‌లో ఉన్న రూ. 2 కోట్లను కొట్టేశారు

ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ మాట్లాడుతు..హైదరాబాద్ ను ప్రేమించేవారిలో జస్టిస్ ఎన్వీ రమణ ఒకరు అని తెలుగు వ్యక్తి అయిన ఆయన తెలుగులోనే మాట్లాడతటానికి ఇష్టపడతారని..ఎన్వీ రమణగారి స్ఫూర్తితో నేను తెలుగులోనే మాట్లాడతానని అన్నారు. హైదరాబాద్ నగరం విశ్వనగరంగా తీర్చిదిద్దుతున్నామని..సింగ్ పూర్ కంటే హైదరాబాదే బాగుందని ఎంతోమంది నాతో చెప్పారని సీఎం కేసీఆర్ ఈ సందర్భంగా గుర్తు చేశారు.

ఎన్వీ రమణ సీజే ఆర్బిట్ర్షన్ సెంటర్ ఏర్పాటులో కీలకంగా వ్యవహరించారని కేసీఆర్ తెలిపారు.  అంతర్జాతీయ ప్రమాణాలకు ధీటుగా ఈ సెంటర్ చాలా తక్కువ సమయంలో ఏర్పాటు కు కృషిచేసిన వాళ్లందరికీ కృతజ్ఞతలు తెలిపారు కేసీఆర్. రాష్ట్రంలో ఉన్న కేసులకు సంబంధించి అన్నీ ఈ సెంటర్ కు వచ్చేలా .. చట్టం చేస్తామని అన్నారు. రాష్ట్రానికి ఈ అవకాశం కల్పించిన ఎన్వీ రమణగారికి చేతులు జోడించి నమస్కరిస్తున్నానని సీఎం కేసీఆర్ సవినయంగా విన్నవించారు.సీజేగా ఎన్వీ రమణ నియించబడటం తెలుగు వాళ్ల అందరికి గర్వకారణం అని కేసీఆర్ అన్నారు.

Read more : Madhavan : స్విమ్మింగ్ లో వరుస పతకాలు సాధిస్తూ.. ఒలింపిక్స్ కి వెళ్లనున్న మాధవన్ తనయుడు..

అనంతరం సీజే ఎన్వీ రమణ మాట్లాడుతు..నాలుగు నెలలలో అద్భుతమైన ఆర్బీటేషన్ సెంటర్ ఏర్పాటు కావటం సంతోషించాల్సిన విషయం అని అన్నారు. సెంటర్ ఏర్పాటులో సీఎం కేసీఆర్ సహాకారం చాలా ఉందని ఆయన సహకారం చాలా గొప్పదని ప్రశంసించారు. జాతీయ, అంతర్జాతీయ కంపెనీ సమస్యల పరిష్కారానికి ఈ ఆర్బీటేషన్ సెంటర్ ఎంతో మేలుచేస్తుందని అన్నారు. వరల్డ్ క్లాస్ ఫెసిలిటీస్ హైద్రాబాద్ లో  ఉన్నాయనీ.. ఈ అంతర్జాతీయ సెంటర్ ఏర్పాటుకు హైద్రాబాద్ కు అన్ని అర్హతలు ఉన్నాయని ఎన్వీ రమణ అన్నారు.

ఈ  కార్యక్రమంలో ట్రస్టీలు – సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ లావు నాగేశ్వర రావు, జస్టిస్ హిమాకోహ్లి, సుప్రీం కోర్టు రిటైర్డ్ జడ్జి జస్టిస్ ఆర్వీ రవీంద్రన్, హైకోర్టు చీఫ్ జస్టిస్ సతీశ్ చంద్ర శర్మ, న్యాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్, హోంమంత్రి మ‌హ‌ముద్ అలీ, టూరిజం శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ పాల్గొన్నారు.