Cyber Fraud Hyderabad : వ్యాలెట్‌‌లో ఉన్న రూ. 2 కోట్లను కొట్టేశారు

క్రిప్టో కరెన్సీ విషయంలో ఇంకా కేంద్ర ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకోలేదు. అయితే..సికింద్రాబాద్ ప్రాంతానికి చెందిన లోక్ జిత్ సాయినాథ్ క్రిప్టో కరెన్సీలో భారీగా ఇన్వెస్ట్ చేశారు.

Cyber Fraud Hyderabad : వ్యాలెట్‌‌లో ఉన్న రూ. 2 కోట్లను కొట్టేశారు

cyber-criminals

Cyber Fraud Hyderabad : సైబర్ మోసాలు పెరిగిపోతున్నాయి. హైదరాబాద్ నగరంలో సైబర్ నేరగాళ్ల మాయలో పడి మోసపోతున్నారు. తెలియకుండానే..బ్యాంకు అకౌంట్లలో ఉన్న డబ్బు మాయం అవుతుండడంతో లబోదిబోమంటున్నారు. తమకు న్యాయం చేయాలని సైబర్ క్రైం పోలీసులను ఆశ్రయిస్తున్నారు. బహుమతులను ఇస్తామని, లింక్ ఓపెన్ చేయాలని..ఇతరత్రా మెసేస్, వాట్సాప్ లు వస్తే వాటిని నమ్మవద్దని పోలీసులు సూచిస్తున్నారు. అయినా..కొంతమంది గుడ్డిగా నమ్మి నిలువునా మోసపోతున్నారు. తాజాగా..వ్యాలెట్ హ్యక్ చేసి 2.2 కోట్లు దోచుకున్నారు. ఈ ఘటన సికింద్రబాద్ లో చోటు చేసుకుంది.

Read More : Radheshyam : ‘రాధేశ్యామ్’ ట్రైలర్ రిలీజ్ డేట్ ఫిక్స్.. చీఫ్ గెస్టులు వాళ్ళే…

క్రిప్టో కరెన్సీ విషయంలో ఇంకా కేంద్ర ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకోలేదు. అయితే..సికింద్రాబాద్ ప్రాంతానికి చెందిన లోక్ జిత్ సాయినాథ్ క్రిప్టో కరెన్సీలో భారీగా ఇన్వెస్ట్ చేశారు. దీనికి సంబంధించిన కరెన్సీ వివరాలను వ్యాలెట్ యాప్ లో సేవ్ చేసుకున్నాడు. సైబర్ నేరగాళ్లు అతడి వ్యాలెట్ ను హ్యాక్ చేశారు. వ్యాలెట్ పాస్ వర్డ్ లను మార్చివేసి…అందులో ఉన్న రూ. 2 కోట్ల 20 లక్షలను కాజేశారు. విషయం తెలుసుకున్న సాయినాథ్ సైబర్ క్రైం పోలీసులను ఆశ్రయించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపడుతున్నారు.

Read More : Omicron Variant: భారత్‌లో రోజుకు 14లక్షల కేసులు నమోదయ్యే అవకాశం

క్రిప్టో కరెన్సీ, అధికారిక డిజిటల్ కరెన్సీ నియంత్రణ బిల్లును పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో ప్రవేశపెట్టాలని కేంద్ర ప్రభుత్వం భావించింది. అయితే క్రిప్టో కరెన్సీ లావాదేవీలను, బిల్లు పూర్వాపరాలను మరోసారి పరిశీలించాలని భావించిన కేంద్రం ప్రస్తుతానికి ఆ విషయాన్ని పక్కన పెట్టింది. బడ్జెట్ సమావేశాల్లో ఈ బిల్లు పార్లమెంట్‌లో ప్రవేశపెట్టే అవకాశముంది. ఆర్‌బీఐ జారీచేసేలా అధికారిక డిజిటల్ కరెన్సీ రూపొందించేందుకు ఫ్రేమ్‌వర్క్ చేయాలన్నది ఈ బిల్లు సారాంశం. భారత్‌లో ప్రయివేట్ క్రిప్టోకరెన్సీలను నిషేధించడం, సాంకేతిక పరంగా కొన్ని రకాల క్రిప్టో కరెన్సీలు ఉపయోగించేందుకు కొన్ని మినహాయింపులు ఇవ్వడం అనే అంశాలను కూడా బిల్లులో పొందుపరచనున్నారు.