Radheshyam : ‘రాధేశ్యామ్’ ట్రైలర్ రిలీజ్ డేట్ ఫిక్స్.. చీఫ్ గెస్టులు వాళ్ళే…

సెంబర్ 23న 'రాధేశ్యామ్' సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగనుంది. ఈ కార్యక్రమం రామోజీ ఫిల్మ్ సిటీలో జరగనుంది. తాజాగా ఈ ఈవెంట్ గురించి చిత్ర యూనిట్ తెలిపారు. పూర్తిగా కోవిడ్....

Radheshyam : ‘రాధేశ్యామ్’ ట్రైలర్ రిలీజ్ డేట్ ఫిక్స్.. చీఫ్ గెస్టులు వాళ్ళే…

Radheshyam (1)

Radheshyam :  పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా రాబోతున్న సినిమా ‘రాధేశ్యామ్’. ‘సాహో’ సినిమా తర్వాత మరో పాన్ ఇండియా సినిమాగా ఈ సినిమా రాబోతుంది. ఇందులో పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి టీజర్స్, సాంగ్స్ రిలీజ్ అయ్యి సినిమా పై మరిన్ని అంచనాలు పెంచాయి. లవ్, సస్పెన్స్ అంశాలు ఉన్న ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 14 న విడుదల కానుంది. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన మరో అప్‌డేట్ వచ్చింది.

ప్రేక్షకులు ఈ సినిమా ట్రైలర్ కోసం ఎదురు చూస్తున్నారు. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా ఎప్పుడు ఉంటుందా అని ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. డిసెంబర్ 23న ‘రాధేశ్యామ్’ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగనుంది. ఈ కార్యక్రమం రామోజీ ఫిల్మ్ సిటీలో జరగనుంది. తాజాగా ఈ ఈవెంట్ గురించి చిత్ర యూనిట్ తెలిపారు. పూర్తిగా కోవిడ్ నిబంధనలు పాటించి ఈ వేడుక నిర్వహించబోతున్నామని, తక్కువ మందికి మాత్రమే పాసెస్ ఇస్తున్నామని, ఈవెంట్ కి వచ్చే అభిమానులు, అతిథులు కరోనా నిబంధనలకు కట్టుబడి రావాలి అని చిత్ర యూనిట్ తెలిపారు.

Avathar 2 : ‘అవతార్ 2’ షూటింగ్ పూర్తి.. సినిమా రిలీజ్ ఎప్పుడు??

అదే రోజు 5 భాషలకు సంబంధించిన ట్రైలర్ విడుదల కానుంది. అయితే ఈ ట్రైలర్ ని రిలీజ్ చేయటానికి ఏ సెలబ్రిటీని తీసుకురావట్లేదంట. ప్రభాస్ అభిమానులతోనే ఈ ట్రైలర్ ని విడుదల చేయనున్నారట. ప్రభాస్ సినిమా ట్రైలర్ ని అభిమానులతో లాంచ్ చేయించటం అంటే మామూలు విషయం కాదు. మరోసారి ఈ విషయంలో ప్రభాస్ ని పొగిడేస్తున్నారు అభిమానులు.