Avathar 2 : ‘అవతార్ 2’ షూటింగ్ పూర్తి.. సినిమా రిలీజ్ ఎప్పుడు??

'అవతార్' సినిమాతో పండోరా అనే అద్భుతలోకాన్ని సృష్టించిన కామెరున్ పార్ట్ 2 కోసం అండర్ వాటర్ నేపథ్యంలో సినిమాని నిర్మిస్తున్నారని సమాచారం. ఈ చిత్రాన్ని దాదాపు 1900 కోట్ల.........

Avathar 2 : ‘అవతార్ 2’ షూటింగ్ పూర్తి.. సినిమా రిలీజ్ ఎప్పుడు??

Avathar 2

Avathar 2 :  హాలీవుడ్ స్టార్ డైరెక్టర్ జేమ్స్ కామెరాన్ సృష్టించే అద్భుతాలు అన్ని ఇన్ని కావు. 1997 లో `టైటానిక్` సినిమాతో ప్రపంచం మొత్తాన్ని తన వైపుకి తిప్పుకున్నాడు. ఆ తర్వాత ‘అవతార్’ సినిమాతో అద్భుత చిత్రాన్ని సృష్టించారు. 2009లో వచ్చిన ఈ చిత్రం ప్రపంచ సినీ చరిత్రలో కొత్త చరిత్ర సృష్టించింది. `అవతార్` సినిమా అప్పట్లోనే 20 వేల 368 కోట్లు వసులు చేసింది. అన్ని వసూళ్లు సాధించింది అంటే ఈ సినిమా ఎంత పెద్ద విజయం సాధించిందో అర్ధం చేసుకోవచ్చు.

ఈ సినిమాకి ఆల్రెడీ సీక్వెల్స్ కూడా ప్లాన్ చేశారు జేమ్స్ కెమెరాన్. సీక్వెల్ అంటే ఒకటే అనుకునేరు ఏకంగా నాలుగు సీక్వెల్స్ ని సిద్ధం చేస్తున్నారు. దీంట్లో భాగంగా `అవతార్ -2` సినిమాని మొదలు పెట్టారు. కరోనా వల్ల ఈ సినిమా షూటింగ్ చాలా ఆలస్యం అయింది. అయితే ఇప్పటికే ‘అవతార్ 2’ తో పాటు ఆ తర్వాతి సీక్వెల్స్ కి కూడా డేట్స్ రిలీజ్ చేసేశారు.

Bheemla Nayak : వికారాబాద్‌లో ‘భీమ్లానాయక్’ షూటింగ్.. పవన్ కోసం ఎగబడ్డ జనం

‘అవతార్’ సినిమాతో పండోరా అనే అద్భుతలోకాన్ని సృష్టించిన కామెరున్ పార్ట్ 2 కోసం అండర్ వాటర్ నేపథ్యంలో సినిమాని నిర్మిస్తున్నారని సమాచారం. ఈ చిత్రాన్ని దాదాపు 1900 కోట్ల భారీ బడ్జెట్ తో ప్రపంచంలోనే భారీగా తెరకెక్కిస్తున్నారు. కరోనా వల్ల వాయిదా పడుతూ వస్తున్న ఈ సినిమా ఎట్టకేలకు పూర్తయింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు మొదలు పెట్టారు. ఈ సినిమాని వచ్చే ఏడాది డిసెంబర్ 16న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ చేయనున్నారని తెలిపారు. దీంతో పాటే ఆ తర్వాతి సీక్వెల్స్ రిలీజ్ డేట్స్ కూడా అనౌన్స్ చేశారు. అవతార్ పార్ట్ 3ని 2024లో, పార్ట్ 4ని 2026లో, పార్ట్ 5ని 2028లో విడుదల చేస్తామని జేమ్స్ కామెరాన్ తెలిపారు.