Bheemla Nayak : వికారాబాద్‌లో ‘భీమ్లానాయక్’ షూటింగ్.. పవన్ కోసం ఎగబడ్డ జనం

భీమ్లానాయక్ సినిమా ఇంకా లాస్ట్ షెడ్యూల్ షూట్ మిగిలి ఉండగా ఇటీవల ఆ షెడ్యూల్ వికారాబాద్ లో ప్రారంభమైంది. వికారాబాద్ దగ్గర అడవుల్లో ఈ షూట్ జరుగుతుంది. భీమ్లానాయక్‌, డేనియల్‌ శేఖర్‌...

Bheemla Nayak : వికారాబాద్‌లో ‘భీమ్లానాయక్’ షూటింగ్.. పవన్ కోసం ఎగబడ్డ జనం

Pavan

Updated On : December 18, 2021 / 8:40 AM IST

Bheemla Nayak :  పవన్ కళ్యాణ్, రానా దగ్గుబాటి హీరోలుగా నటిస్తున్న మల్టీస్టారర్ సినిమా ‘భీమ్లానాయక్’ సంక్రాంతికి రిలీజ్ అవ్వనుంది. మలయాళ సూపర్ హిట్ సినిమా ‘అయ్యప్పన్ కోషియం’కి రీమేక్ గా ఇది తెరకెక్కనుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన గ్లిమ్ప్స్, సాంగ్స్ బాగా వైరల్ అయ్యాయి. అంతే కాక పవన్ మరోసారి పోలీస్ పాత్ర చేస్తుండటంతో సినిమాపై భారీ అంచనాలు పెరిగాయి.

Samantha : సమంత ఐటెం సాంగ్ కి కౌంటర్ గా వైరల్ అవుతున్న మేల్ వర్షన్ సాంగ్

అయితే ఈ సినిమా ఇంకా లాస్ట్ షెడ్యూల్ షూట్ మిగిలి ఉండగా ఇటీవల ఆ షెడ్యూల్ వికారాబాద్ లో ప్రారంభమైంది. వికారాబాద్ దగ్గర అడవుల్లో ఈ షూట్ జరుగుతుంది. భీమ్లానాయక్‌, డేనియల్‌ శేఖర్‌ అటవీ ప్రాంతంలో హోరాహోరి పోరుకు సిద్ధమయ్యారు. పవన్ కళ్యాణ్ వికారాబాద్ దగ్గర షూటింగ్ చేస్తున్నాడు అని తెలియడంతో చుట్టూ పక్క ఊళ్ళ నుంచి కూడా జనాలు వచ్చారు. పవన్ ని చూడటానికి జనం ఎగబడ్డారు. కొంతమంది పవన్ తో ఫోటోలు దిగుదామని ట్రై చేశారు. పవన్ ని చూడటానికి వచ్చిన జనాల్ని కంట్రోల్ చేయడం సినిమా యూనిట్ కి తలనొప్పిగా మారింది. ఈ సినిమాని సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదల చేస్తున్నారు. నిత్యామీనన్‌, సంయుక్తమీనన్‌ లు హీరోయిన్స్ గా నటిస్తున్నారు.